
పల్లవి :
కు కు కు...
ఉలికిపడకు కు కు కు కు
పెదవి కలిపేందుకు కు కు కు కు
కలలు కనకు కు కు కు కు
కధలు నడిపేందుకు కు కు కు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
శరాలు పెంచకు
చరణం : 1
మొగ్గ విచ్చే వేళ నా మోజులన్ని
పోటు తుమ్మెదల్లె తేనె విందుకొస్తావా
సిగ్గులొచ్చే వేళ నే దక్కనైతే
పాల బుగ్గలోనే ఎర్ర పొంగులిస్తావా
మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ
చంపక మాలలు సొంపులకిస్తావా
పైటకు చాటుగా పద్యము రాసే వేళ
ఉత్పల మాలలకూపిరి పోస్తావా
నీ వడికే దోపిడిలో నీ వొడిలో ఒత్తిడిలో
వసంత వేళకు కు కు కు...
ఉలికి పడకు....
చరణం : 2
ఆడదయ్యే వేళ నీ అందమంతా
ఎండ కన్ను దాటి గుండెలోకి వస్తావా
పాయసాలు పొంగే నీ పక్కకొస్తే
ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
నన్నయ భట్టుకి నవలలు నచ్చేవేళ
కౌగిలి పర్వం కొత్తగా రాస్తావా
చక్కిలిగింతలు తిక్కలకొచ్చిన వేళ
నర్తన శాలకు నాతో వాస్తవా
నా ఎదలో పూ పొదలో
నా కధలో నీ జతలో
సందేహమెందుకు...
చిత్రం : సుందర కాండ (1992)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర
************************************
ku ku ku...
ulikipadaku ku ku ku ku
pedavi kalipenduku ku ku ku ku
kalalu kanaku ku ku ku ku
kadhalu nadipenduku ku ku ku
chilaka palikina vayasuku
vayasu thodigina sogasuku
sharaalu tenchaku
mogga viche vela na mojulanni
potu thummedalle tene vindukostavaa
sigguloche vela ne dakkanaithe
pala buggalone yerra pongulistavaa
mathuga mallelu atharu chindevela
champaka malalu sompulakistavaa
paitaku chatuga padyamu rase vela
utpala malalakupiri postavaa
nee vanike dopidilo nee vodilo vothidilo
vasantha velaku ku ku ku...
uliki padaku.....
adadayye vela ne andamanthaa
yenda kannu dati gundeloki vastavaa
payasalu ponge ne pakkakosthe
muddu barasala mundugane chestavaa
nannaya bhattuki navalalu nachevela
kougili parvam kothaga rastavaa
chakkiliginthalu thikkalokochina vela
narthana shalaku natho vasthavaa
naa yedalo puu podalo
naa kadhalo nee jathalo
sandehamenduku...
Movie Name : Sundarakanda (1992)
Music Director : M.M.Keeravani
Lyricist : Veturi sundara ramamurthy
Singers : S.P.Bala Subramanyam , K.S.chithra
No comments:
Post a Comment