Wednesday, July 17, 2013

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే ..... మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు (2013)

మబ్బులు కురిసే,మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం తోడయి దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే మౌనం విరిసే మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే ఎద ఎగసే

ఏ జన్మ కథ మళ్ళీ మొదలయి నా జన్మ కదిలింది
ఆశగా నీతో అడుగేస్తుంటే అణువణువూ అదిరింది
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
మమతల ముడిపడి మురళిగ నిలబడి
మానస కోయిల కూసెనుగా
మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే

ఎద ఎగసే ఏ కొమ్మ తొలి సిగ్గుల మొగ్గై ఏ చోట పూస్తుందో
ఉరికే వాగులు పారే ఏరులు చేరే తీరాలేవో
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
తెలుసా వాటికి తమ తల రాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
పువ్వుల ఘుమఘుమ మువ్వల సరిగమ
ఎవ్వరు ఆపినా ఆగవుగా
మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే

నా చూపులకు సోయగమిచ్చి నీ కంటి కళ వచ్చి
నువ్వే నేనని భావన చేస్తూ నాతో నేను రమించి
చూసేదంతా సొగసనిపించి చేసేవన్నీ నిజమనిపించే
చూసేదంతా సొగసనిపించి చేసేవన్నీ నిజమనిపించే
గువ్వల కిళకిళ నవ్వుల పరిమళ మల్లెల తీరము కనిపించే
మల్లెల తీరము కనిపించే..
మబ్బులు కురిసే మొగ్గలు విరిసే మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే ఎద ఎగసే
మల్లెలు పూసే మౌనం విరిసే మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం చినుకై రాలెను సంతోషం
తియ్యని తేనల సావాసం తోడయి దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే మౌనం విరిసే మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే ఎద ఎగసే


చిత్రం : మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు (2013)
సంగీతం : రవీంద్ర ప్రసాద్ (పాటలు ) & పవన్ కుమార్ (BGM)
రచన : ఉమా మహేశ్వర్ రావు
గానం :  క్రాంతి
*********************************************************
Mabbulu kurise moggalu virise madi murise
Dikkulu merise chukkalu virise yeda yegase
Chethiki andenu aakasam
Chinukai raalenu santhosham
Theeyani thenela savasam
Thodai dorikenu ee samayam
Sudulai pongina nadi vegam
Saagara sangama priya daham
Mallelu poose mounam virise madi murise
Kannulu merise vennela kaase yeda yegase

Ye janma katha malli modalai naa janma kadilindi
Aasaga neetho adugesthunte anuvanuvu adirindi
Chiru chiru gaalulu thakina neevani
Chiru sadi vinna adi nee maatani
Chiru chiru gaalulu thakina neevani
Chiru sadi vinna adi nee maatani
Mamathala mudi padi muraliga nilabadi
Maanasa koyila kusenuga

Mabbulu kurise moggalu virise madi murise
Dikkulu merise chukkalu virise yeda yegase

Ye komma tholi siggula moggai ye chota poosthundo
Urike vaagulu paare yerulu chere theeraalevo
Thelusa vaatiki thama thalaraathalu
Thelisina aagavu valachina charithalu
Thelusa vaatiki thama thalaraathalu
Thelisina aagavu valachina charithalu
Poovula ghuma ghuma muvvala sarigama
Yevvaru aapina aagavugaa

Mabbulu kurise moggalu virise madi murise
Dikkulu merise chukkalu virise yeda yegase

Naa chupulaku soyagamichi nee kanti kalavachi
Nuvve nenani bhavana chesthu naatho nenoraminchi
Chusedantha sogasanipinche
Chesevanni nijamanipinche
Chusedantha sogasanipinche
Chesevanni nijamanipinche
Guvvala kila kila navvula parimala
Mallela theeram kanipinche
Mallela theeram kanipinche

Mabbulu kurise moggalu virise madi murise
Dikkulu merise chukkalu virise yeda yegase
Mallelu poose mounam virise madi murise
Kannulu merise vennela kaase yeda yegase
Chethiki andenu aakasam
Chinukai raalenu santhosham
Theeyani thenela savasam
Thodai dorikenu ee samayam
Sudulai pongina nadi vegam
Saagara sangama priya daham
Mallelu poose mounam virise madi murise
Kannulu merise vennela kaase yeda yegase


Movie Name : Mallelatheeramlo Sirimalle puvvu (2013)
Music Director : Ravindra Prasad (songs) & Pavan Kumar (BGM)
Lyricist : Uma Maheswar Rao
Singer : Kranthi

No comments:

Post a Comment