Sunday, September 1, 2013

పదండి ముందుకు... పదండి తోసుకు.. కదం తొక్కుతూ కదలండి... పదండి ముందుకు (1962)

పల్లవి :
పదండి ముందుకు...
పదండి తోసుకు
కదం తొక్కుతూ కదలండి
స్వరాజ్యమే మన జన్మహక్కనీ
సమస్త జగతికి చాటండి ॥
భారతవీర ప్రజలారా
స్వరాజ్య వాదీ ధరించు ఖాదీ (2)
పరాయి సరుకులు మనకేలా ॥
రాటమున వడకే వారే
పోరాటములోన వడకరులే॥॥

చరణం : 1
అహింసయే మన ఆయుధమూ
సత్యాగ్రహమే సాధనమూ॥
త్రివర్ణ సుందర పతాకము
భారత దాస్య విమోచనము॥
ప్రేమా శాంతీ ధర్మం నిండిన (2)
రామ రాజ్యమే ఆశయమూ (2)॥

చరణం : 2
కల్లు మానండోయ్ బాబయ్యా
కళ్లు తెరచి సాగి రారయ్యా బాబయ్యా
॥మానండోయ్‌॥
కాపురాలను కూల్చురాకాసిరా
కన్నీళ్లు కష్టాలు కొనితెచ్చురా॥
మంచితనమే చంపి...
మమతలే తెగతెంపి
మనల పశువుల చేయు మహామారిరా
॥మానండోయ్‌॥॥

చరణం : 3
తరతరాల దురన్యాయాలకు
గురియై... బలియై...
దారి కనరాని వారీ దరిద్రనారాయణులూ
హరిజనులు
సాటి మనిషిని దూరం చేసే జనులు
మోక్షం కనలేరసలు (2)
సమాజమంతా సమానమైతే
నాడే జాతికి నవజీవనము (2) ॥

చరణం : 4
ఈ భూమి మా భూమిరా
ఇది బంగారు మాగాణిరా
పనులెన్నో వేసి పంట సిరులను దోచి
మాతల్లి నేలకే మమ్ము దూరమ్ము చేయు
దుష్టపరిపాలనకు స్వస్తియీనాడే
పన్నుల నిరాకరణ ప్రారంభమాయె...॥
తెలుగు దేశ వీరులారా...
భరత దేశ పౌరులారా...


చిత్రం : పదండి ముందుకు (1962)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఎ.పి.కోమల
**********************************************
Movie Name : Padandi Mundhuku (1962)
Music Director : S.P.Kodandapani
Lyricist : Sri Sri
Singers : Ghantasala, Madhavapeddhi Sathyam, A.P.Komala

No comments:

Post a Comment