Monday, August 19, 2013

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను..... పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు
నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు

కలలాగ నను కలిశావు..లతలాగ నను పెనవేశావు
ఒక గానమై.. ఒక ప్రాణమై..జతగూడి మనమున్నాము.. ఉన్నాము..ఉన్నాము..

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు..
నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు..

ఆ మూడూ ముళ్ళని మరిచేవు..నా పాల మనసుని విరిచేవు..
ఈనాడు నన్ను విడనాడినా..ఏనాటికైనా కలిశేవు..కలిశేవు..నను కలిశేవు..

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను


చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
***********************************************
Movie Name : Puttinillu - Mettinillu (1973)
Music Director : Satyam
Lyricist : C. Narayana Reddy
Singer : S.P.Balasubramanyam

No comments:

Post a Comment