Monday, September 2, 2013

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే... ఏం చేస్తున్నా నీ ఊసే ............ అడ్డా (2013)

పల్లవి :
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే... ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే
వేచింది నీకోసమే... నే కోరింది నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే... ఎలా ఎలా నమ్మేదే
ఇవన్నీ ప్రతిబంధంలో ఉన్నాయి ఇంతకు ముందే
అదో ఇదో తేలేదెలా... ఓహో... ॥

చరణం : 1
ఎప్పటినుంచో చూస్తున్నా
ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నాపైనే నమ్మకమింక రాలేదే
నీపై ఇష్టం ఎంతున్నా... ఏం చేస్తా
అయినా ఎందుకో మనసే ఒప్పదే
పోనీ ఆ నిజం నీతో చెప్పదే
అయోమయం పోయేదెలా... ఓహో...

చరణం : 2
రేపోమాపో నావల్లే నీకేమీ కాకూడదని
ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
నాలో ఉన్నది స్పష్టం కానిదే
నువ్వేం చేసినా ఎలా ఆపనే
లోలో నిజం తెలిసేదెలా... ఓహో...


చిత్రం : అడ్డా (2013)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : అనంత శ్రీరామ్
గానం : విజయ్ ప్రకాష్
*********************************
Movie Name : Adda (2013)
Music Director : Anoop Rubens
Lyricist : Anantha Sriram
Singer : Vijay Prakash

No comments:

Post a Comment