గోంగూర సేలోనా గోలగోల
చెయ్యొద్దురా మావా వెనకాల
గోంగూర సేలోనా గోలగోల
చెయ్యొద్దురా మావా వెనకాల
పోసికోలు ఆసికాలు చాలు చాలు
పోసికోలు ఆసికాలు చాలు చాలు
కదపనీయి కూసింత చెయ్యీకాలు..చెయ్యీకాలు
గోంగూర సేలోనా పొద్దుటేల
ఆకంతా కోసేటి పడుచుపిల్ల
గోంగూర సేలోనా పొద్దుటేల
ఆకంతా కోసేటి పడుచుపిల్ల
ఆగలేవు నిన్నుచూస్తే కాలూచెయ్యీ
మరి ఆగలేవు నిన్నుచూస్తే కాలూచెయ్యీ
సరసమాడి సాటుమాటు సాయం చెయ్యి..సాయం చెయ్యి
నాగులేటి వాగులాటి నడక చూసి
నల్లపూసకంటె సిన్న నడుము చూసి
ఆగలేకపోయానే అత్తకూతురా
వెన్నపూసలాంటి ఒంటి మెరుపు చూసి
మిరపతోట ఎరుపులాంటి చూపు చూసి
నిలవలేకపోయారా సందమామా
ఓ ఎట్టయితే వచ్చేసెయ్యి అహ అందరిని ఒప్పించెయ్యి
లగ్గాలే పెట్టిస్తా రానిచ్చెయ్యి రాసిచ్చెయ్యి మురిపించెయ్యి ||గోంగూర||
గోగుపూల సోకులన్ని దోచుకోకు
గోరువంకలాగ వచ్చి గిచ్చబోకు
నాగళ్ళ కొనగోళ్ళ గుచ్చొద్దురా
మంచెకాడి కుప్పకాడ ఒప్పుకోవే
బొంగరాల బుంగమూతి తిప్పుకోవే
ముత్యాలమునిపంట ముద్దియ్యవే
హెయ్ పందిళ్ళు వేయించెయ్యి ఒహో పరువాలు అందించెయ్యి
పొంగారే బొంగారం పండించెయ్యి పట్టేసెయ్యి..ఒట్టేసెయ్యి ||గోంగూర||
చెయ్యొద్దురా మావా వెనకాల
గోంగూర సేలోనా గోలగోల
చెయ్యొద్దురా మావా వెనకాల
పోసికోలు ఆసికాలు చాలు చాలు
పోసికోలు ఆసికాలు చాలు చాలు
కదపనీయి కూసింత చెయ్యీకాలు..చెయ్యీకాలు
గోంగూర సేలోనా పొద్దుటేల
ఆకంతా కోసేటి పడుచుపిల్ల
గోంగూర సేలోనా పొద్దుటేల
ఆకంతా కోసేటి పడుచుపిల్ల
ఆగలేవు నిన్నుచూస్తే కాలూచెయ్యీ
మరి ఆగలేవు నిన్నుచూస్తే కాలూచెయ్యీ
సరసమాడి సాటుమాటు సాయం చెయ్యి..సాయం చెయ్యి
నాగులేటి వాగులాటి నడక చూసి
నల్లపూసకంటె సిన్న నడుము చూసి
ఆగలేకపోయానే అత్తకూతురా
వెన్నపూసలాంటి ఒంటి మెరుపు చూసి
మిరపతోట ఎరుపులాంటి చూపు చూసి
నిలవలేకపోయారా సందమామా
ఓ ఎట్టయితే వచ్చేసెయ్యి అహ అందరిని ఒప్పించెయ్యి
లగ్గాలే పెట్టిస్తా రానిచ్చెయ్యి రాసిచ్చెయ్యి మురిపించెయ్యి ||గోంగూర||
గోగుపూల సోకులన్ని దోచుకోకు
గోరువంకలాగ వచ్చి గిచ్చబోకు
నాగళ్ళ కొనగోళ్ళ గుచ్చొద్దురా
మంచెకాడి కుప్పకాడ ఒప్పుకోవే
బొంగరాల బుంగమూతి తిప్పుకోవే
ముత్యాలమునిపంట ముద్దియ్యవే
హెయ్ పందిళ్ళు వేయించెయ్యి ఒహో పరువాలు అందించెయ్యి
పొంగారే బొంగారం పండించెయ్యి పట్టేసెయ్యి..ఒట్టేసెయ్యి ||గోంగూర||
చిత్రం : భారతంలో అర్జునుడు (1987)
సంగీతం : చక్రవర్తి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki

No comments:
Post a Comment