Thursday, October 31, 2013

నీకూ నాకూ కుదిరెను మ్యాచి... పోటాపోటి క్రికెట్టు మ్యాచి... భారతంలో అర్జునుడు (1987)

నీకూ నాకూ కుదిరెను మ్యాచి
పోటాపోటి క్రికెట్టు మ్యాచి
ఓడించేసెయ్ సర్వం దోచి
గెలిపించేసెయ్ ప్రేమించేసెయ్
నీకూ నాకూ కుదిరెను మ్యాచి
పోటాపోటి క్రికెట్టు మ్యాచి
ఓడించేస్తా పరువం దోచి
గెలిపించేస్తా ప్రేమించేసి

బంతి తీసుకో కపిల్ దేవ్ లా
బ్యాట్ పట్టుకో విశ్వనాథ్ లా
గవాస్కరల్లే కొట్టు గ్రౌండును అదరగొట్టు
రవిశాస్త్రిలాగా రన్నులు చేస్తూ అజారుద్దీన్ లాగా ఆడు
ఒకే దెబ్బతో సిక్సరు అదే ఊపులో సెంచరీ
దాటించేస్తా బౌండరీ దడదడలాడాలి గాలరీ  ||నీకూ నాకూ||

దమ్ముచూపుతా మదన్ లాల్ లా
దుమ్ము రేపుతా శ్రీకాంత్ లా
ఎగిరే బంతులు పడతా ఏ వన్ బౌలర్ నవుతా
వెంగ్ సర్కార్ లా వేగం చూపి పఠౌడి పద్ధ తిలో కొడతా
మాంచి ఊపుతో కొడుతూ మధ్యలోన ఔటవ్వకు
లంచి బ్రేకులో లాలూచీ పడి నమ్మించి నన్ను ముంచకు
||నీకూ నాకూ||


చిత్రం :  భారతంలో అర్జునుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :   ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki

No comments:

Post a Comment