Tuesday, October 29, 2013

జై దుర్గా జై జై జైశక్తి జై దిగి రావమ్మా ....... పుణ్యభూమి నా దేశం (1994)

జై దుర్గా జై జై జైశక్తి జై
దిగి రావమ్మా ఇక మాకోసమై
జై దుర్గా జై జై జైశక్తి జై
దిగి రావమ్మా ఇక మాకోసమై
కళ్ళురిమినావో రక్కసులే అంతం
కరుణించినావో లక్ష్మీప్రసన్నం      ||జై దుర్గా||

ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి

ఆ....ఆవేశమే త్రిశూలమై మర్దించగా ఇక దీవించవే
ఈ....ఉద్రేకమే రుద్రాంశతో ఉప్పొంగగా శుభం చేకూర్చవే
జయీభవ అనవే జైదుర్గా జగమంతా శాంతివనం చేస్తానే           ||జైదుర్గా||

ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి

నీ.....భక్తునితో తలపడితే తలలే తెగునే ఇలలోన
ఎదుటపడి ఎదురించి బ్రతికేదెవరే ఇకపైన
పిడికిలి బిగిసిన చాలులే హడలెత్తిపోవాలి లోకాలన్ని          ||జైదుర్గా||


చిత్రం : పుణ్యభూమి నా దేశం (1994)
సంగీతం : కె. వి. మహదేవన్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Punyabhumi Naa Desham (1994)
Music Director : K.V.Mahadevan
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra

No comments:

Post a Comment