Tuesday, October 29, 2013

తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే ..... బాలరాజు బంగారుపెళ్ళాం (1995)

అబ్బయో....ఓ అబ్బయో
అబ్బయో....ఏంది అబ్బయో
అబ్బయో....చెప్పు అబ్బయో

చెరుకుముక్క చేతికిచ్చి కన్ను గీటితే
సురుకు సూపు రవిక మీద కాక రేపితే
మసకమసక సందెయేళ సందు దొరికితే
ఊపు మీద కంచె దాటి మంచె చేరితె
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే

వాసినే తేలు తేలు అంటు ఏలు చూపిస్తావేందే
నేను రాకపోతె తేలటం కాదు మునిగిపోయేదానివి

మోటబావి కాడ నువ్వు కాలుజారితే
బావిలోకి దూకి నేను పైకిలేపితే
గడ్డివాము కాడ వలపుగంట మోగితే
మొగ్గసోకు మొదటిసారి సిగ్గు వదిలితే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే

పొగ రాని చలిమంటకు అబ్బయో పొలిమేర వేడెక్కరో అబ్బయో
పొదచాతు సయ్యాటలో అబ్బయో పొగరంతా దిగుతాదిలే అబ్బయో
తడాఖా చూపించు మజామజాగా.....అబ్బయో
కానిస్తా తతంగం యధాతధంగా.....అమ్మాయో
ముచ్చటగా తీయనిదే తీసి ఇస్తారా
అదిరిందే సందడిలో అది ఇదీ ముడే పడేసి
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే

కుదిరింది కుప్పలకాడ అబ్బయో కురిపిస్తా ముద్దులవాన అబ్బయో
ఎపుడైనా కాదన్నానా అబ్బయో యావ నాకు లేదన్నానా అబ్బయో
చలాకీ వయస్సే చురుక్కుమందే....అమ్మాయో
ఇలాగే బిగిస్తే కసెక్కుతాందే...అబ్బయో
చూడు ఇక జింగిచకా వాగువంకల్లో
ఆశ పడి కన్నె ఒడి చేయాలంది హడావిడి
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే   ||మోటబావి||


చిత్రం : బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం :  M.M.కీరవాణి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  మనో , K.S.చిత్ర
*********************************************
Movie Name :  Balaraju Bangaru Pellam (1995)
Music Director : M.M.Keeravani
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, K.S.Chitra

No comments:

Post a Comment