Thursday, October 31, 2013

వేస్తావా వేస్తావా నా ఆకులవక్క పువ్వులపక్క వేస్తావా ... ఖతర్నాక్ (2006)

వేస్తావా వేస్తావా నా ఆకులవక్క పువ్వులపక్క వేస్తావా
వేస్తాలే వేస్తాలే సోకులమెక్క పక్కలు ఇక వేస్తానే
ఏరా నీ ముందరుంటే ఎటో చూస్తుంటావా
గాలమేసియ్యమంటే ఆలోచిస్తుంటావా
రావే నా రవ్వలకోడి నీ ఒళ్ళోనే లాడీపేడీ ||వేస్తాలే||

చల్లెటు బుల్లెటు చాటుమాటు రవ్వట్టు
చీకట్లో పూవెట్టు చిమచిమ చిమాయింపుగా
ఉందంతే ఉన్నట్టు లేదంటే లేనట్టు
సిగ్గంతా తాకట్టు యమయమ యమాయింపుగా
ఏది నీ బంజారా చూడనీ కళ్ళారా పక్కనే ఉన్నారా మీటుకో తంబూరా
తెల్లారినా చల్లారని కౌగిళ్ళల్లో ఉడుకు మరిగి మళ్ళీ మళ్ళీ  ||వేస్తాలే||

కాముడికి తమ్ముడా కండవెల్లి గుమ్మడా
చుక్కపొడిచేదాకా ఒకే దూకుడా
ఓసి నీ జిమ్మడా దాచకే ఆవడా
చిల్లి పడిపోతాదే సిల్కు పావడా
ఆపు నీ ఆరాటం సాగనీ సయ్యాటం
ఎంతసేపు ఆడాలి ఒంటికర్ర కోలాటం
కొంపా కొల్లేరయ్యేదాకా గుప్పా తెగేదాకా మళ్ళీ మళ్ళీ  ||వేస్తాలే||


చిత్రం :  ఖతర్నాక్ (2006)
సంగీతం : M.M. కీరవాణి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : గాయత్రి, శంకర్ మహదేవన్, నోయెల్
*********************************
Movie Name : Khatarnak (2006)
Music Director :  M.M.Keeravani
Lyricist :  Jonnavithula Ramalingeswara Rao
Singers : Gayathri,Shankar Mahadevan, Noel

No comments:

Post a Comment