Tuesday, October 29, 2013

హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... సుందరకాండ (2008)

 ఆహ పొట్టీ దేవుడండీ...  బహు గట్టీ దేవుడండీ...
గురిపెట్టీ కొలవరండీ...
ఈ మట్టిలోంచి పుట్టినట్టి గట్టిదేవుదండి
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ...
గుడిచుట్టూ తిరిగి రండీ...
మీ పెట్టుపోతలను బట్టే యిట్టె పలుకునండి
టిక్కెటు మొక్కలు చూపి ఆపై ఎక్కడికక్కడ దాటి
ఇంకా దేకుతు పాకుతు మొర్లుతు మొక్కులు చెల్లించండి
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ...
గురిపెట్టీ కొలవరండీ... హో......

కోరస్:
గంప దేవరా దేవరా జై జై దేవరా
గంప దేవరా దేవరా జై జై దేవరా

చరణం : 1
అత్తరు అర్చనతో మీ అత్త పీడ వదులుతుంది
మోడల్ చేస్తే మీ కోడలు లొంగుతుందీ
లప్ప తెచ్చి మీరిస్తే చేతికి చిప్పే ఇస్తాడు
తిప్పి తిప్పి తన చుట్టూ కోర్కెలు పిప్పే చేస్తాడూ

కోరస్ :  పచ్చనోట్ల కట్ట తోటి పాప నాశనం
చిటికెలోన చేయిస్తాము శీఘ్ర దర్శనం  హెయ్

పచ్చనోట్ల కట్ట తోటి పాప నాశనం
చిటికెలోన చేయిస్తాము శీఘ్ర దర్శనం  హెయ్

చెలగ వాహనుడు  పలుగు నివాసుడు
వోట్ల కారకుడు సీట్ల దాయకుడు

కోరస్ : ఏకుల మేమత మేదీ చూడడు నాధనాధనాధుడూ
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ...  గురిపెట్టీ కొలవరండీ... హోయ్

చరణం : 2
మూల విగ్రహం పోట్టిదేవుడూ ఉత్స విగ్రహం కోట్ల దేవుడు
సర్వ మంగళం పోట్టిదేవుడూ సకల సంకటం కోట్ల దేవుడూ
ఎండిన చెరువుల పొలాల మధ్యన ఎయిర్ పోర్టు తెస్తా తెస్తా...
ఎకరం ఒక్కటి 20 కోట్లని రేట్లే పెంచేస్తా
పని పాట్లు చెయ్కుండా బతికేలా నే చేస్తా
 అ ఒక్క ఓటుతో పక్క జనానికి చుక్కలు చూపిస్తా

కోట్ల వారి మాట కోట్ల వోట్ల మూటయా
పచ్చనోట్ల దండ మీరు వేసుకోండయా    కో: ll2ll
 
పట్టు గోచీలు
రిస్టు వాచీలు
కలరు టీవీలు
సిలుకు శారీలు

ఉచ్చం నీచం ఏవీ చూడని నాధనాధనాధుడూ
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... గుడిచుట్టూ తిరిగి రండీ...
టిక్కెటు మొక్కలు చూపి ఆపై ఎక్కడికక్కడ దాటి
ఇంకా దేకుతు పాకుతు మొర్లుతు మొక్కులు చెల్లించండి
హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... గుడిచుట్టూ తిరిగి రండీ...


చిత్రం :  సుందరకాండ (2008)
సంగీతం :  విద్యాసాగర్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం :  ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : SundaraKanda (2008)
Music Director : Vidyasagar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

No comments:

Post a Comment