Wednesday, October 30, 2013

నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా ..... అంజనీ పుత్రుడు (2009)

నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా
నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా
దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా
చూసిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు...హనుమా...హనుమ
చూసిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు ఆ లంకను కాల్చి వచ్చినావు
సీతమ్మను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు
రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు
రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు
సత్కార్య సాధకులందరికి ఆదర్శము నీవు ||నీసరి ఎవరయ్యా||

శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు
ప్రభువుకు మంచి చేసినావు సుగుణములెంచి చూసినావు
శుభమ్ములు కలుగజేసినావు
లక్ష్మణ మూర్ఛను బాపగ సంజీవగిరిని తెచ్చినావు
భక్తులందరిని బ్రోచుటకు చిరంజీవిగా ఉన్నావు..హనుమా  ||నీసరి ఎవరయ్యా||

భక్తిపరీక్షకు నిలబడి ఒడిని గుండె చీల్చినావు
రాముని ఎదను చూపినావు అనితర భక్తి చాటినావు
భక్తుల శక్తి చాటినావు
రామనామయని ఘోషించే జపసాగరమే నీవు
రామనామాంబుధి నీవు
రామనామాంబుధి నీవు....హనుమా

హనుమా...నను గనుమా...    ||నీసరి ఎవరయ్యా||
భీమసేనుని దారి కాచి సరిదారి చూపినావు
ఆ తమ్ముని తరచి చూసినావు నిజమ్మును తనకు తెలిపినావు
విశ్వరూపమ్మును చూపినావు
జెండాపై కపిరాజై అర్జునరథమునెక్కినావు
అద్భుతమౌ జయమునొసగినావు
అద్భుతమౌ జయమునొసగినావు
హనుమా...హనుమా...      ||నీసరి ఎవరయ్యా||


చిత్రం : అంజనీపుత్రుడు (2009)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్
*********************************************
Movie Name :  అంజనీపుత్రుడు (2009)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Vandemataram Srinivas

No comments:

Post a Comment