Wednesday, February 5, 2014

పంటచేలో పాలకంకి నవ్విందీ ....... పదహారేళ్ళ వయసు (1978)















పంటచేలో పాలకంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేతపచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
 ॥॥

 చరణం : 1
శివ గంగ తిరనాళ్లలో
నెలవంక స్నానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికిళ్లతో
గొరవంక గుడిగంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా
నే కొండ పిండి కొట్టాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా    (2)
ఆ నవ్వుకే  ఈ నాపచేను పండాలా
 ॥॥

 చరణం : 2
గోదారి పరవళ్లలో
మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా
నీ మాట బాట కావాలా
నా పాట ఊరు దాటాలా
మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా     (2)
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా
 ॥॥


చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
***************************************************
Movie Name : Padaharella Vayasu (1978)
Music Director : Chakravarthy
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P.Balu, S.Janaki

No comments:

Post a Comment