Showing posts with label సినీ-జనం( cinema artists ). Show all posts
Showing posts with label సినీ-జనం( cinema artists ). Show all posts

Friday, May 2, 2014

టి.కృష్ణ

వరంగల్ జిల్లా రాయపర్తిలో 1927లో జన్మించిన టి.కృష్ణ అసలు పేరు టి.కృష్ణమాచారి. వారి తండ్రి మంచి పండితులు. ఉభయ భాషా ప్రావీణ్యులు. భగవద్గీతకు వ్యాఖ్యానం చెప్పడంలో ఆ కాలంలోనే ఆయన్ని మించిన వారు లేరు. తనలాగే తన కొడుకును కూడా ఉభయ భాషా ప్రవీణుణ్ణి చేయాలని ప్రయత్నించారు. కానీ, ఏ సమయంలో సినిమాలను అభిమానించడం మొదలు పెట్టాడోగానీ టి.కృష్ణ తన భవిష్యత్తును సినిమా రంగంలోనే వెదుక్కోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే, ఆ రంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగారు.

చిన్ననాటి నుంచే తనకు నటన పట్ల, నాటకాల పట్ల మంచి అభిరుచి ఉంది. దానికితోడు మేనమామ నాటి మంత్రి టి.హయక్షిగీవాచారి ప్రోత్సాహమూ తోడవడంతో నటుడిగా వారు జీవితం ప్రారంభించారు.అయితే, టి.కృష్ణకు దైవదత్తంగా లభించిన కంఠస్వరం అదనపు ఆకర్షణైంది. ఆయన తాతగారు వీథి భాగవతాలు చెప్పేవారు. అలా తాతగారి సంగీత కళను తనలోకి ఆవహింప చేసుకోవడమూ కలిసి వచ్చింది. అలా అని, తాను నాటకాలంటూ తిరిగి చదువును అశ్రద్ధ చేయలేదు. మెట్రిక్ పూర్తి కాగానే ఉస్మానియాలో చేరి 1948లో బిఎ పూర్తి చేశారు. ఇంకా పై చదువులు చదవమని ఇంట్లో పెద్దవాళ్లు చెప్పారుగానీ, సినిమాల్లో పనిచేయడానికి ఈ మాత్రం చదువు చాలనుకున్నారాయన. యూనివర్సిటీ విద్యవైపు చూడకుండా మద్రాస్‌కు వెళ్లాలని కృష్ణ నిర్ణయించుకున్నారు.

అయితే, మద్రాస్‌కు వెళ్లకముందే ఆయన అభిరుచి వన్నె తేలింది. చిన్నప్పటినుంచీ బడిలో పాటల పోటీల్లో పాల్గొనేవారు. కాలేజీ చదివే రోజుల్లో నాటకాల్లో వేషాలు వేశారు. అక్కడి నాటకాల పోటీలో హీరోగానో, హీరోయిన్‌గానో వేషాలు వేసి బహుమతులు పొందిన అనుభవం తనది. అందుకే, చదువు ఆపేశాక ఇంట్లో ఉద్యోగం చేయాలన్న వొత్తిడికి తలొగ్గారు. అందులోనూ మళ్లీ తన అభిరుచికి తగ్గట్టుగానే, ‘గోలకొండ’ పత్రికలో సినిమా సమీక్షలు రాయడం, హైదరాబాదు రేడియోలో గ్రామస్థుల కార్యక్షికమంలో పాల్గొనడం, ‘లింగడు’ పాత్రలో ప్రసంగాలు చేయడం-ఇట్లా సినిమా చుట్టే తన అభిరుచిని పరివ్యాప్తం చేసుకున్నాడే తప్పా వేరే దిక్కు పోలేదు.

అంతకు ముందే మరో సంగతి కూడా జరిగింది. హైదరాబాదు రాష్ర్టంలో రజాకార్ల దురంతాల సమయంలో ఓ ఏడాది తన చదువు వెనుకబడింది. అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. ఈ సమయంలోనే రామచంవూదరావుతో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పటికే గూడవల్లి రామవూబహ్మం వద్ద ‘ఇల్లాలు’ తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా జెమినీ స్టూడియోలో పని చేసి ఉన్నారు. ఆయన టి.కృష్ణలోని ఉత్సాహాన్ని , ఆయనకున్న అర్హతలను గమనించి, ‘నీలాంటి విద్యార్థి సినిమాలకు చాలా అవసరం. ప్రయత్నిస్తే పరిక్షిశమలో మంచి స్థితికి చేరుకుంటావు’ అని వెన్ను తట్టారు. ఈ మాటలు కృష్ణను మరింత ప్రభావితం చేశాయి. వీటన్నిటి కారణంగా ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలతో అభిరుచిని సంతృప్తి పర్చుకోవడానికి బదులు ఏకంగా మద్రాస్ రైలెక్కడమే మంచిదని నిర్ణయించుకున్నారు. 1950లో చ్నై చేరుకున్నారు కృష్ణ.

వెళ్లనైతే వెళ్లారుగానీ అక్కడెవరూ తెలియదు. అయినా ఢీలా పడలేదు. మొండి ధైర్యంతో వెళ్లి భరణి రామకృష్ణను కలుసుకొని తన గురించి చెప్పుకున్నారు. అంతా విన్న ఆయన హెచ్.ఎం.డ్డిని కలుసుకుంటే తప్పకుండా ఏదో ఒక మార్గం చూపుతారని చెప్పి పంపించారు. అదృష్టవశాత్తూ హెచ్.ఎం.డ్డి సమయం ఇవ్వడం, తన నాటక అనుభవాన్ని వినడం, రేడియో ‘లింగడు’ పాత్రను ఏకబిగిన ప్రదర్శిస్తే చూసి మెచ్చుకోవడం జరిగాయి. ‘సరే, ఇక్కడే ఉండు. పని నేర్చుకో’ అని చెప్పి ఆ వెంటనే కృష్ణను డైరెక్షన్ శాఖలో చేర్చుకున్నారు. హెచ్.ఎం.డ్డి అప్పట్లో ‘నిర్దోషి’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు టి.కృష్ణను సహాయ దర్శకుడిగా పెట్టుకున్నారు.

దర్శకత్వ శాఖలోనైతే చేరారుగానీ, మన కృష్ణకు లోలోన ఒక అసంతృప్తి ఉంది. తనకు డైరెక్షన్ మీదకన్నా సినిమాల్లో వేషం వేయడం అన్నా, పాటలు పాడటం అన్నా ఇష్టం. కానీ, మనసులోని మాట పెద్దాయనకు చెబితే ఎక్కడ మొదటికే మోసం వస్తుందో అని భయపడి తన పని తాను చేసుకుంటూ మరో వంక బయటి చిత్రాల్లో అవకాశాలకోసం ప్రయత్నించసాగారు. ఇంతలో సి.ఆర్.సుబ్బరామన్ వద్ద కోరస్ పాటల్లో మొదట గొంతు కలిపే అవకాశం వచ్చింది. తర్వాత కె.ఎస్. ప్రకాశ్‌రావు ‘మొదటిరాత్రి’లో ఓ వేషమూ వేశారు. కానీ, సమస్య కాని ఓ సమస్య వచ్చి పడింది. ఆయన మాట్లాడుతుంటే సహజ సిద్ధమైన తెలంగాణ యాస ప్రస్ఫుటంగా ధ్వనించేది. అదే తనకి సమస్య అయింది. సినిమా రంగంలో కృష్ణ, గోదావరి, గుంటూరు జిల్లాల భాషదే ఆధిపత్యం. దాంతో మంచి కంఠస్వరంతోపాటు నటనానుభవం, అభిరుచి, శ్రద్ధా ఉండికూడా టి.కృష్ణ నిస్సహాయంగా ఉండిపోయారు. కోస్తాంధ్ర ఆధిపత్య భావజాలం తనకు సినిమాల్లో నటించి పాడటాన్ని అవహేళన చేసినట్లయింది. చివరకు నటనను మానుకొని డైరెక్షన్ వైపు స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు టి.కృష్ణ.

ఇంతలో వరంగల్ ప్రాంతానికి చెందిన దేశ్‌ముఖ్‌లు శుభోదయ పతాకంపై హెచ్.వి.బాబు దర్శకత్వంలో ‘ఆదర్శం’ (1952) సినిమా తీశారు. దీనికి కృష్ణ సహకార దర్శకుడుగానే గాక ఒక ముఖ్య కామేడీపాత్రను పోషించారు. అదీ మహానటి సావిత్రి పక్కన. ఈ చిత్రానికి ఎడిటర్ ఎం.వి.రాజన్. ఆయన ఎడిటింగ్‌కి వెళుతున్నప్పుడల్లా మన కృష్ణతో ‘సినిమా డైరెక్టర్‌కు ఎడిటింగ్ తెలియడం చాలా అవసరం’ అని చెప్పేవారు. ‘నీకు ఉత్సాహం ఉంటే ఎడిటింగ్‌లో చేరి పని నేర్చుకో’ అని కూడా సలహా ఇచ్చేవారు. దాంతో కృష్ణ ఎడిటింగ్ శాఖలో చేరడం, ఆ పని తనకు బాగా నచ్చడం... ఇంకేం... ఇక తాను రాజన్ దగ్గరే చాలాకాలం పనిచేశారు. అటు తర్వాత ‘ఆలీబాబా నలబై దొంగలు’, రాజ్‌కపూర్ ‘ఆహ్’ చిత్రానికి అనువాదమైన ‘ప్రేమలేఖలు’ (దీని తమిళ వెర్శన్ ‘అవన్’) చిత్రాలకు కూడా రాజన్ వద్ద అసిస్టెంటుగా పనిచేశారు టి .కృష్ణ. అంతేకాదు, ‘ప్రేమలేఖలు’లో ప్రాణ్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారాయన.

జీవిక సాగడానికి సినిమాల్లో అన్ని పనులు చేసుకుపోతున్న కృష్ణకి ఒకనాడు పాండి బజారులో భావనారాయణ గారు కనిపించి ‘నేను , డీబి నారాయణ కలిసి ఒక సినిమా తీస్తున్నాం. నువు అసిస్టెంటుగా పనిచేస్తావా? ’ అని అడిగారు. పనికోసం పదిసార్లు, పది చోట్లకు తిరిగి అలసిపోతున్న సందర్భంలో ఈ మాటలు ఆయనకు అమృత గుళికల్లా వినిపించాయి. ఆ సినిమా పేరు ‘అమర సందేశం’ (1954). ఆ కొత్త దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. అంతకు ముందు 1953లోనే కె.ఎస్‌పకాశరావు ‘కన్న తల్లి’ తీస్తున్న రోజుల్లోనే ఆదుర్తితో టి.కృష్ణకు పరిచయం ఉంది. ఆదుర్తి కూడా తాను దర్శకుడవ్వగానే ఎవ్వరైనా ఎడిటింగ్ తెలిసిన వారినే అసిస్టెంటుగా పెట్టుకుంటే బాగుంటుందనుకున్నాడు. అనుకున్నట్లుగా, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా భావనారాయణ టి.కృష్ణను ఎంపిక చేయడంతో వారిద్దరి కాంబినేషన్ అలా మొదలైంది. ఆ చిత్రానికి ఎడిటింగ్ , డైరెక్షన్ శాఖల్లో అసిస్టెంటుగా పనిచేశారు కృష్ణ. ఆ వెంటనే కాకపోయినా రెండేళ్ల తర్వాత ఆదుర్తికి అన్నపూర్ణ సంస్థ దుక్కిపాటి మధుసూదన రావు నుంచి పిలుపు వచ్చింది. అలా ‘తోడి కోడళ్లు’ (1957)కు దర్శకుడైనారు. ఆదుర్తి వెంటనే టి.కృష్ణకు ఎడిటింగ్ శాఖలో ‘అసిస్టెంటు ఎడిటర్’గా ఉద్యోగం ఇచ్చారు. అది మొదలు ఆదుర్తి చివరి చిత్రం దాకా ఆయన చిత్రాలకు దర్శకత్వ, ఎడిటింగ్ శాఖల్లో ఆయన పనిచేశారు.

ఆదుర్తిగారే టి.కృష్ణను 1961లో తన ‘కృష్ణవూపేమ’ చిత్రానికి ‘స్వతంత్ర ఎడిటర్’ను చేశారు. అప్పటి నుంచి ఆదుర్తి తీసిన ‘మంచి మనుషులు’, ‘మూగ మనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సుమంగళి’, ‘దాగుడు మూతలు’, ‘తోడు నీడ’, ‘వెలుగు నీడలు’, ‘పూల రంగడు’, ‘తేనే మనసులు’, ‘కన్నె మనసులు’, ‘సుడిగుండాలు’ తదితర సుమారు 30 చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు.

ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో తీసిన ‘మిలన్’, ‘డోలీ’, ‘మస్తానా’, ‘మన్‌కామీత్’, ‘దర్పణ్’, ‘జీత్’ చిత్రాలకు కూడా టి.కృష్ణ ఎడిటర్‌గా చేశారు. ఇంకా సింహళ తమిళ భాషల్లోకి అనువాదమైన చిత్రాలను కూడా ఎడిట్ చేశారు. తెలంగాణ వాడు కనుక ఉర్దూ భాషలో ప్రావీణ్యం ఉన్నవాడు కనుక హిందీ చిత్రాలకు కూడా పనిచేయగలిగారని అప్పట్లో ‘విజయచిత్ర’ మాస పత్రికలో రాశారు. ఇంకా గొప్ప సంగతేందంటే బి.ఆర్. చోప్రా సినిమాలను కూడా ఆయన ఎడిట్ చేశారు.
అన్నపూర్ణ, బాబు మూవీస్, విజయభట్ తదితర సంస్థలకు పర్మినెంట్ ఎడిటర్‌గా ఉన్న టి.కృష్ణ 1967లో దర్శకునిగా మారారు. విజయవర్ధన్ మూవీసు వారు ‘బొమ్మై అన్న తమిళ చిత్రాన్ని కొని, ఆదుర్తి చేత తీయించాలనుకున్నారు.

అయితే, అప్పట్లో ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డైరెక్షన్ తెలిసిన టి.కృష్ణకు ఆ పని అప్పజెప్పారు. అలా కృష్ణ దర్శకత్వంలో తొలిసారిగా ‘ఉపాయంలో అపాయం’ చిత్రం తయారైంది. విశేషమేమంటే కేవలం 21 రోజుల్లో పూర్తిచేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేశారాయన. ఈ సినిమా 120 రోజులు ఆడింది. దీని తర్వాత మళ్లీ ఎడిటర్‌గా కొనసాగుతున్న కృష్ణ బొంబాయిలో ఉన్నప్పుడు ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే ఉర్దూ నవలను చదివి దాన్ని సినిమా తీయాలని రచయిత వీరేంద్ర సిన్హాను సంప్రదించారు. అయితే ఆ కథనం అప్పటికే ప్రేమ్‌జీకి ఇవ్వడం జరిగింది. అది ‘దుష్మన్’ పేరుతో తీయబోతున్నారని, అది పూర్తవ్వగానే తెలుగు హక్కులు ఇస్తాననడంతో కృష్ణ అందుకోసం ఆగిపోయారు.

కథ బాగా నచ్చడంతో ఏడాదిపాటు ఎదురు చూసేందుకు సిద్ధపడ్డారు . ఇందుకు మరో కారణం కూడా ఉంది. అతని వరంగల్ మిత్రులు మార్కండేయ, ఆంజనేయులు, హైదరాబాదు మిత్రులు, లక్ష్మణ్‌రావు, బాబుల్ నాథ్‌లు కృష్ణతో మంచి సినిమా తీయాలని ఎదురు చూస్తున్నారు. కథ దొరకగానే బాలాజీ చిత్రం పేరుతో సంస్థను ప్రారంభించి, శోభన్‌బాబు హీరోగా ‘ఖైదీ బాబాయి’ చిత్రం తీశారు. ఇది 1974లో విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ‘మొనగాడు’ (1976), ‘మంచి బాబాయి’ (1978), ‘లక్ష్మీ నిలయం’ (1982), ‘అందరికంటే మొనగాడు’ (1985), ‘బలిపీ భారతనారి’ (1989), చివరి చిత్రం ‘అమ్మో పోలీసోళ్లు’ (1999)తో సహా ఆయన మొత్తం పదకొండు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1980లో మద్రాసు నుంచి హైదరాబాదుకు మకాం మార్చిన కృష్ణ ఆ తర్వాత ‘మల్లె మొగ్గలు’, ‘విక్రం’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన జీవిత కాలంలో 300కు పైగా చిత్రాలను ఎడిట్ చేశారు. హైదరాబాదు వచ్చాక కొన్ని టి.వి. సీరియళ్లకు కూడా కథలు అందించిన కృష్ణ అటు తర్వాత సినిమా పరిక్షిశమలో మారిన ట్రెండును స్వీకరించలేక తనకు తాను పరిధులు విధించుకున్నారు.

తెలుగు చిత్ర సీమలో ఒక అర్ధ శతాబ్దం పాటు నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన మన టి.కృష్ణ 2001 మే 9న హైదరాబాదులో కన్ను మూశారు.
ఆదుర్తి సుబ్బారావు అనుచరుడిగా ఎడిటింగ్ శాఖలో నిష్ణాతుడుగా తెలుగు సినీ చరివూతలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టి.కృష్ణ మన ఓరుగల్లు బిడ్డ... తెలంగాణ వెండి వెలుగు...!
టి.కృష్ణ దర్శకత్వంలో తొలిసారిగా ‘ఉపాయంలో అపాయం’ చిత్రం తయారైంది. విశేషమేమంటే కేవలం 21 రోజుల్లో పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేశారాయన. ఈ సినిమా 120 రోజులు ఆడింది.

Monday, April 14, 2014

నేడు గొల్లపూడి పుట్టిన రోజు

తొలుత పలుకుతో జనాన్ని మురిపించి, ఆపై అభినయంతోనూ ఆకట్టుకున్న ఘనుడు గొల్లపూడి మారుతీరావు... ఆయన రాసిన మాట పలు చిత్రాలకు బంగారుబాట వేసింది... ఆయన వేసిన వేషాలు అనేక చిత్రాల విజయంలో పాలుపంచుకున్నాయి... నటరచయితగా రాణించిన గొల్లపూడి మారుతీరావు పుట్టినరోజు నేడు... ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ మారుతీరావు మాటను, గొల్లపూడి నటనను గుర్తు చేసుకుందాం...

పుట్టడమే సాహిత్యసువాసనలు విరజిమ్మే కుటుంబంలో కావడంతో- బాల్యంలోనే మారుతీరావు రచనావ్యాసంగంలో అడుగువేశారు... పాతికేళ్ళు నిండకముందే అన్నపూర్ణ సంస్థ నిర్మించిన 'డాక్టర్ చక్రవర్తి'కి స్క్రీన్ ప్లే రాసి భళా అనిపించారు... ఆ పైన 'గొల్లపూడి' మాటకు చిత్రసీమలో ఓ బాట ఏర్పడింది... ఆ బాటలో పయనించిన పలు చిత్రాలు విజయతీరాలను చేరుకున్నాయి... గొల్లపూడి పలుకు కొన్ని చిత్రాలకు 'ఉలుకు'గా మారింది, కొన్నిసార్లు జనాన్ని 'కులికే'లా చేసింది... మాటలతో మంత్రం వేస్తున్న గొల్లపూడిలోని నటుణ్ణి ఏ ముహూర్తాన పసికట్టాడో కానీ, కోడి రామకృష్ణ తన తొలి చిత్రం 'ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య'లోనే మారుతీరావుకు నటుడిగా ఓ మార్కు వచ్చేలా చేశాడు...

రచయితగా పత్రికల్లోనూ, సినిమాల్లోనూ పలు ప్రయోగాలు చేసిన మారుతీరావు సంపాదించుకోలేని గుర్తింపును నటుడిగా 'గొల్లపూడి' అనతికాలంలోనే కొల్లగొట్టేశారు... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు వంటి టాప్ స్టార్స్ చిత్రాల్లో గొల్లపూడి అభినయం వెలుగులు విరజిమ్మింది... ప్రస్తుతం మారుతీరావుకు అంతగా అవకాశాలు లేకున్నా, ప్రశాంత జీవనం సాగిస్తున్నారు... తన తనయుడు శ్రీనివాస్ పేరిట నెలకొల్పిన అవార్డును ప్రతియేటా ప్రతిభావంతులకు ప్రదానం చేస్తున్నారు... గొల్లపూడి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం...

Saturday, February 1, 2014

సార్థక నామధేయుడు (సందర్భం - బ్రహ్మానందం పుట్టినరోజు)

Sakshi | Updated: January 31, 2014 23:35 (IST)

తెరపై కామెడీ జరగనవసరంలేదు. జోకులు పేలనవసరం లేదు.. మనిషి కూడా కనిపించనవసరం లేదు. చందమామ లాంటి గుండ్రటి బట్టతల కనిపిస్తే చాలు. థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు. బ్రహ్మానందమా మజాకా. కేవలం ఆయన నవ్వుల వల్లే విజయాలు సాధించిన సినిమాలు కోకొల్లలు. రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్యల్లాగా దశాబ్దాల తరబడి సినీ హాస్యసామ్రాజ్యాన్ని ఏలిన ఘనత బ్రహ్మానందంది. ప్రస్తుతం ఆయన శకమే నడుస్తోంది.

 రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత హాస్యనటుల్లో ‘పద్మశ్రీ’ అందుకున్నది బ్రహ్మానందమే. విజయవంతమైన సినిమాల్నే ఎవరూ గుర్తుంచుకోవడం లేదు. కానీ బ్రహ్మానందం పాత్రలు మాత్రం అందరికీ గుర్తుంటాయి. అరగుండు, ఖాన్‌దాదా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్, ప్రణవ్, బాబీ, మెక్‌డోనాల్డ్ మూర్తి, పద్మశ్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. నవ్వుల జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో..

 ‘బ్రహ్మానందం’ అని ఏ ముహూర్తాన తల్లితండ్రులు నామకరణం చేశారో కానీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులకు బ్రహ్మానందాన్ని అందిస్తున్న సార్థకనామధేయుడు బ్రహ్మానందం. చిన్నవయసులోనే కష్టాలన్నీ అనుభవించేశారాయన. చెప్పులు లేకుండా బడికెళ్లిన రోజులు, అవి కొనమని నాన్నను అడిగితే, ఆయన కొట్టిన దెబ్బలు ఇంకా బ్రహ్మానందంకి గుర్తే. అందుకే విషాదం నుంచి కూడా కామెడీ పుడుతుందంటారాయన.

 అన్ని రసాల్లోనూ కష్టతరమైనది హాస్యరసం. దాన్ని సమర్థవంతంగా పోషించిన వాడు ఏ రసాన్నయినా సునాయాసంగా పండించగలడు. అందుకే.. బ్రహ్మానందంకి ఎలాంటి రసమైనా.. తృణప్రాయం. ఆయన కామెడీ కింగ్ మాత్రమే కాదు. ట్రాజెడీ కింగ్ కూడా. ‘అమ్మ’, ‘బాబాయ్ హోటల్’, ‘ఆయనకి ఇద్దరు’ చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన విషాదాన్ని తెలిగ్గా మరిచిపోలేం. రవిరాజా పినిశెట్టి డెరైక్ట్ చేసిన ‘ముత్యమంత ముద్దు’ సినిమాలో బ్రహ్మానందంలో ఓ భయంకరమైన విలన్ కనిపిస్తాడు. ముత్యాల సుబ్బయ్య ‘అన్న’లో అయితే... ఆయనలో ఓ విప్లవకారుడు కనిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలోని  కోణాలు చాలా ఉన్నాయి.

 జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని నవ్వులతోనే అధిగమించిన హ్యూమరిస్ట్ బ్రహ్మానందం. పెద్ద హీరోల సినిమా వేడుకలైనా సరే... బ్రహ్మానందం స్టేజ్ మీదకు రాగానే.. సదరు హీరోలతో సమానంగా జనాల్లో స్పందన. దీన్ని బట్టి ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకున్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయనలో గొప్ప లక్షణం. మూలాల్ని మరిచిపోకుండా, సంప్రదాయానికి దూరం కాకుండా, సంస్కృతిని గౌరవిస్తూ, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ చాలా ప్రశాంతమైన జీవనశైలిలో ముందుకు వెళ్తుంటారాయన. తెరపై కనపడే బ్రహ్మానందం వేరు. ఇంటా బయటా కనిపించే బ్రహ్మానందం వేరు. ఆయన మాటల్లో, వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఫిలాసఫీ కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మానందంతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. సినిమానే కాకుండా ఏ టాపిక్ గురించి అడిగినా పుంఖాను పుంఖాలుగా మాట్లాడగల జ్ఞానం ఆయనలో ఉంది. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరిన బ్రహ్మానందం జీవితం నేటి తరానికి నిజంగా స్ఫూర్తి దాయకమే.

Friday, January 24, 2014

బడికెళ్లని ఆచార్యుడు...

Sakshi | Updated: January 23, 2014 00:47 (IST)బడికెళ్లని ఆచార్యుడు...
నివాళి: సుద్దాల అశోక్‌తేజ,  ప్రముఖ సినీ  గేయ రచయిత

 ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్‌ని మ్యూట్‌లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్‌లో ఆయనేం చెప్పదలుచుకు న్నారో అర్థమైపోతుంది. అదే సీన్‌ని కళ్లు మూసుకుని కేవలం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్‌తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్‌లోని మెస్మరిజం అదే!
 


‘‘ఇల్లు కొనుక్కున్నారా?’’
‘‘లేదు సార్...’’
‘‘పోనీ... కారైనా ఉందా?’’
‘‘అదీ లేదండీ...’’
‘‘ఎప్పటికైనా సరే... ముందు ఇల్లు కొనుక్కోండి. మీ భార్య సంతోషిస్తుంది. ఆ తర్వాతే కారు’’
‘‘అలాగే సార్’’.

2000 సంవత్సరంలో ‘సకుటుంబ సపరివార సమేతం’ షూటింగ్ స్పాట్‌లో ఏయన్నార్‌గారికి, నాకూ మధ్య జరిగిన సంభాషణ అది. ఆ సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. అలా ఆయన నోట నా పాట రావడం నిజంగా నా అదృష్టమే.

ఆ షూటింగ్ లొకేషన్‌లో చాలాసార్లు కలిశాన్నేను. ఎన్నో ఏళ్ల జీవితానుభవంతో ఆయన చెప్పిన కొన్ని అంశాలను నా మనసులోనే భద్రపరచుకున్నా. ఆయన చెప్పిన సలహాలు... అప్పుడే కెరీర్ మొదలు పెట్టిన నాకు ఓ గైడింగ్ ఫోర్స్‌లా ఉపకరించాయి.

‘‘ఇండస్ట్రీలో నీకెవరిమీదైనా కోపం కలిగినా, అసహనం వచ్చినా ఎక్కడా వ్యక్తపరచొద్దు. నీలో నువ్వు దాచుకో. లేకపోతే నీ భార్యతో పంచుకో. సినిమా పరిశ్రమలో గోడలకు, కిటికీలకు, రోడ్లకు, అన్నింటికీ చెవులుంటాయ్’’.

నిజంగా ఎంత గొప్ప సలహా అది. ఏయన్నార్ చెప్పిన ఇంకో విలువైన విషయం ఏంటంటే... ‘‘ఇక్కడ ఎవరికి వాళ్లే ఆధునిక భస్మాసురులు. క్రమశిక్షణ, వృత్తిపట్ల గౌరవభావం, టైమ్‌సెన్స్... ఈ మూడూ లేకపోతే మన నెత్తి మీద మనమే చేయిపెట్టుకున్నట్టు. ప్రతిభ కన్నా ముఖ్యమైన అంశాలు అవి’’.
నిజంగా నాకైతే ఆయన సూచనలు సినీ భగవద్గీతలా అనిపించాయి.

ఆయన నటించిన ‘నటసమ్రాట్’ అనే టీవీ సీరియల్‌కి టైటిల్‌సాంగ్ రాశాను. ఆ పాటలో ‘బడికెళ్లని ఆచార్యుడు నటసమ్రాట్... ఏ గుడికెళ్లని తాత్వికుడు నటసమ్రాట్...’ అనే రెండు వాక్యాలు ఆయన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన కారులో కొన్నాళ్లపాటు ఈ పాట మార్మోగి పోయింది. ఆయన నటించిన ‘శ్రీరామదాసు’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాల్లో కూడా నేను పాటలు రాశాను. సముద్రాల, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర, సినారె లాంటి హేమాహేమీలతో పనిచేసిన ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా ఈ తరంలో నాలాంటి కొంతమందికే దక్కింది.

‘రవీంద్రభారతి’లో జరిగిన 10-15 సభల్లో నేనూ ఆయనతో పాటు పంచుకున్నా. ఓసారి ‘అక్కినేని అభినయ అవలోకనం’ అనే ప్రోగ్రామ్ జరిగింది. ఆయన అభినయం గురించి 45 నిమిషాలు ప్రసంగించాలి. అదీ ఆయన ముందు. కొంచెం కష్టమే. కానీ నాకిష్టంగా అనిపించింది.

నేనేం చెప్పానంటే...
‘‘సావిత్రి కేవలం కళ్లతోనో, నవ్వుతోనో అభినయిస్తుందంటారు. అయితే మీకో సినిమా సీన్ చెప్పాలి. ‘పెళ్లి కానుక’ సినిమాలో హీరోయిన్‌కి తన బిడ్డను అప్పగించి, సూర్యాస్తమయం వైపుకి ఏయన్నార్ నడుచు కుంటూ వెళ్తుంటారు. ఆ షాట్‌లో కేవలం ఆయన వీపు మాత్రమే కని పిస్తుంది. ఆ వీపుతో కూడా తాను చెప్పదలుచుకున్న భావాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు’’.

ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం క్లాప్స్. నా అబ్జర్వేషన్‌ని ఏయన్నార్ కూడా ప్రశంసించారు.
‘నవరాత్రి’లో కూడా అంతే. ఆయన, సావిత్రి కేవలం సైగలతోనే సంభాషించుకుంటారు. ఎంత గొప్ప యాక్టింగ్. ఎవరు చేయగలరండీ అలా.

‘శ్రీరామదాసు’ ఆడియో ఫంక్షన్ భద్రాచలంలో జరిగింది. ఏయన్నార్‌తో కలిసి నేనూ రైలులో వెళ్లా. ఆయనతో రెండు గంటలు స్పెండ్ చేశా. ఎన్ని అనుభవాలు చెప్పారో. ఓసారాయనకు మశూచి వచ్చిందట. అవి చిదిపితే మొహం మొత్తం మచ్చలు మిగులుతాయి. దానికి ఒకటే పరిష్కారం. ఒక్కో పొక్కుని సిరంజితో గుచ్చి ఇంజెక్షన్ చేయాలి. ఆల్‌మోస్ట్ యాసిడ్ లాంటి మందు. నిజంగా నరకమే. అయినా భరించారు.

ఆయన జీవితం ప్రతి మలుపులోనూ ఎన్నో అవరోధాలు... ఎన్నెన్నో అడ్డుపుల్లలు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిపీలకం అని వెక్కిరించిన వాళ్ల ఎదురుగానే... ఎవరెస్ట్‌లా ఎదిగి చూపించారు.
వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఆయన్నుంచి ఈ తరమే కాదు... రాబోయే తరాలు కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. తెరపై ఆయన గొప్ప లవర్ బాయ్. తెర బయట ఆయనో గొప్ప లైఫ్ లవర్‌బాయ్. జీవితం పట్ల ఆమోఘమైన ప్రేమ ఉందాయనకు. అదే ఆయన్ను ఇంత దాకా నడిపించింది.
గుండె మనిషిని నడిపిస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఒక మనిషి... గుండెను నడిపిస్తున్న సంగతి ఎవరికైనా తెలుసా? ప్రపంచంలో అలాంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే అక్కినేని.
అమెరికాలో ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్లే ఈ గుండె ధైర్యాన్ని చూసి విస్తుపోయారట.
మనిషి ఎంత కాలం బతికినా 120 ఏళ్లకు సరిపడ్డా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తారాయన.

ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్‌ని మ్యూట్‌లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్‌లో ఆయనేం చెప్పదలుచుకున్నారో అర్థమైపోతుంది. అదే సీన్‌ని కళ్లు మూసుకుని కేవ లం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్‌తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్‌లోని మెస్మరిజం అదే!

ఈ నట రవిబింబం అస్తమించింది!
అభినయ మేరునగం క్రుంగిపోయింది!
మొత్తంగా ఒక శకం ముగిసింది..!

Saturday, January 18, 2014

భానుప్రియ

ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం, వంశీ కాంబినేషన్‌.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. డ్యాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. అటువంటి చిరంజీవికి సమఉజ్జీగా నాట్యం చేసి మెప్పించారు. 1967 జనవరి 15న భానుప్రియ జన్మించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. తన అభినయంతో తెలుగువారిని పులకింపచేసింది. అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, వివిధ పాత్రల్లో తనదైన బాణీ పలికించింది. 1980-1993 మధ్య కాలంలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలో ఉంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు.

'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కాంబినేషన్‌ లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ కాంబినేషన్‌ సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్ లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ
 నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి స్టార్ హీరోగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో స్పీడ్ డాన్సులకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి కాంబినేషన్ అదుర్స్. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి డాన్స్‌ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు.

నందమూరి బాలకృష్ణ విజయవిహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగు పెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో టాప్ హీరో వెంకటేశ్‌తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేక పోయారు. 'ఖుద్‌గర్జ్‌, ఇన్సాఫ్‌ కీ పుకార్‌, మార్‌ మిటేంగే" వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు.

 భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. భానుప్రియకు పుట్టిరోజు శుభాకాంక్షలు.

భానుప్రియ నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు :


సితార - రౌడీ - రామాయణంలో భాగవతం - ప్రేమించు-పెళ్లాడు - మొగుడూపెళ్లాలు - ఇల్లాలికో పరీక్ష - అన్వేషణ - చిరంజీవి - జ్వాల - పల్నాటి పులి - విజేత - అపూర్వ సహోదరులు - ఆలాపన - దొంగమొగుడు- చక్రవర్తి - జేబుదొంగ - స్వర్ణకమలం - ఖైదీ నంబర్ 786 - త్రినేత్రుడు - బ్లాక్ టైగర్ - స్టేట్ రౌడీ - ఏడుకొండలస్వామి - పెదరాయుడు - మామా బాగున్నావా? - అన్నమయ్య - ఛత్రపతి - గౌతమ్ ఎస్.ఎస్.సి.- అమెరికా అల్లుడు- పెదరాయుడు.

Thursday, July 18, 2013

సౌందర్య

జననం : 18-07-1972

అసలు పేరు : సౌమ్య

స్వస్థలం : గంగికుంట గ్రామం, ములబాగల్ తాలూకా, కొలర్ జిల్లా, కర్ణాటక

జన్మస్థలం : బెంగళూరు

చదువు : ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం

తల్లిదండ్రులు : మంజుల, కె.ఎస్.సత్యనారాయణ

అన్నయ్య : అమర్‌నాథ్

వివాహం-భర్త : 27-04-2003, జి.ఎస్.రఘు

తొలిచిత్రం : గంధర్వ (కన్నడ-1992) మనవరాలి పెళ్లి (తెలుగు-1993)

ఆఖరిచిత్రం : ఆప్తమిత్ర (కన్నడ-2004) శివ్ శంకర్ (తెలుగు-2004)

నటించిన చిత్రాలు : దాదాపు 100 (తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం)

నిర్మాతగా : ద్వీప (కన్నడ-2002)

అవార్డులు-పురస్కారాలు : ఉత్తమనటిగా ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (అమ్మోరు, అంతఃపురం, రాజా, ద్వీప, ఆప్తమిత్ర), ఉత్తమ నిర్మాతగా (ద్వీప), కర్ణాటక ప్రభుత్వం నుండి నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మూడు నంది అవార్డులు, సినీపరిశ్రమకు సంబంధించిన మరెన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగు సినీపరిశ్రమ ఆమె అద్భుతమైన నటనకు ‘నవరసనటమయూరి’ అనే బిరుదునిచ్చి సత్కరించింది.

ఇతర విషయాలు : అతితక్కువ కాలంలోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య. కన్నడ అమ్మాయి అయినా అచ్చతెలుగు ఆడపడచులా కనిపించే సౌందర్యను మహానటి సావిత్రితో పోల్చేవారు. ‘అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ని స్థాపించి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. ‘అమర సౌందర్య విద్యాలయ’ పేరుతో ఓ అనాథశ్రమాన్ని, పాఠశాలను స్థాపించారు. ప్రజాసేవ చేద్దామని బీజేపీలో చేరారు. పార్టీ ప్రచారం కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరుతుండగా విమాన ప్రమాదంలో ఆమె, ఆమె అన్న అమర్‌నాథ్ మరణించారు.

మరణం: 17-04-2004