చరణం : 1 అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్నుమిన్ను కానబోడే మో కడుపుకు చాలినంత కబళమీయకుంటే మనిషి నీతినియమం పాటించడేమో మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి ॥
గుండె గుండె నీ గుడి దీపాలై అడుగు అడుగు నీ ఆలయమయ్యే రాజ్యమీవయ్యా... నీ రాజ్యమీవయ్యా
చరణం : 2 అర్హత లేనివారికి అధికారం ఇస్తే దయ ధర్మం దారి తప్పునేమో దారి తప్పినవారిని చేరదీయకుంటే తిరిగి తిరిగి తిరగబడతారేమో తగినవారికి తగు బలమిచ్చి సహనం క్షమ సఖ్యతనిచ్చి ॥
తనువు తనువు నిరీక్షణశాలై అణువు అణువు నీ రక్షణశాలయ్యే బలమీవయ్యా... ఆత్మబలమీవయ్యా
చరణం : 3 శిలువపైన నీ రక్తం చిందిననాడే శమదమాలు శోధించెనుగాదా నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి శోకం మరణం మరణించెను గాదా చావు పుటుక నీ శ్వాసలని దయాదండన పరీక్షలని ॥
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని సత్యం మార్గం సర్వం నీవని మహిమ తెలుపవయ్యా... నీ మహిమ తెలుపవయ్యా ॥
చిత్రం : రాజాధిరాజు (1980) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : వేటూరి గానం : పి.సుశీల **************************************** Movie Name : Rajadhiraju (1980) Music Director : K.V.Mahadevan Lyricist : Veturi Sundararama Murthy Singer : P.Susheela
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి ఇరుముడులు స్పృశియించి శుభుమనుచు దీవించి జనకృందములచేరె జగమేలు స్వామి తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి స్వామియే శరణం అయ్యప్ప స్వాములందరు తనకు సాయమ్ముకాగా ధీమంతుడైలేచి ఆ కన్నెస్వామి పట్టబంధము వీడి భక్తతటికై పరుగుపరుగున వచ్చె భువిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయనమ:
ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని రోజూ శబరీషా పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీర ఎరుమేలి వాసా నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర కలి భీతి తొలగించు భూతాదినేత
అయ్యప్ప దేవాయ నమ: అభయ స్వరూపాయనమ:
ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం ఓం... పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపానదీ తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి శాంతి శాంతి: ... ఓం శాంతి శాంతి శాంతి:
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత
ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నియు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము మేలిమి బంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత
దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్ధిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ... నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ... రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చిత్రం : దేవుళ్ళు (2001) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ************************************ Raamaa....aa...raamaa...aa...aa Andari bandhuvayaa bhadhrachala raamayyaa andari bandhuvayaa bhadhrachala raamayyaa aadhukune prabhuvayyaa aa ayodhya raamayyaa cheyuthanichhe vadayyaa ma seetaraamayyaa korkelu teerche vaadayyaa kodandaraamayyaa
పల్లవి : సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును శిరిడి సాయి కధ మధుర మధుర మహిమాన్విత బొధ సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
చరణం : శిరిడీ గ్రామంలో..ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద..వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం అనందమే ఆహారం..చేదు చెట్టు నీడయె గురుపీఠం ఏండకు వానకు..ఈ చెట్టుకిందనే ఉండకు సాయి.సాయి రా మసీదుకు అన్న మహల్సాపతి పిలుపుకు మసిదుకు మారను సాయిఅదే అయ్యినది ద్వారకామాయి అక్కడ అందరు బాయి బాయి బాబా బొధలే నిలయమనోయి
చరణం : ఖూరను, బైబిలు, గీత ఒకటని కులమతం భేదం వద్దని గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులుగా చేసే నీటీ దీపమలు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి..పూల మొక్కలకు పోసి లెండీ వనం పెంచి..అఖండ జ్యొతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపె బల్లి బాషకు అర్ధం తెలిపె ఆర్తుల రోగలు తనుహరియించె భక్తుల భాదలు తాను భరించె ప్రేమ సహనం రెండువైపుల ఉన్న నాణెం గురుదక్షిణ అడిగె మరణం జీవికి మార్పని తెలిపె మరణించి తను మరల బ్రతికె సాయిరాం..సాయిరాం..సాయిరాం.. సాయిరాం..సాయిరాం..సాయిరాం.. నీదని నాదని అనుకోవద్దని ధునిలొ ఊది విభూధిగ నిచ్చె భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్స్తవమై సాగగా కంకడ హారతులందుకొని కలి పాపలను కడుగగా సకల దేవత స్వరూపుడై వేద శాస్త్రముల కతీతుడై సద్గురువై..జగద్గురువై సత్యం చాటె దత్తాత్రేయుడై జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి త్రుటిలోన పగులగా పరిపూర్ణుడై..గురుపూర్ణిమై భక్తుల మనసున చిరంజీవై దేహం విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి సాయిరాం..సాయిరాం..సాయిరాం.. సాయిరాం..సాయిరాం..సాయిరాం..
చిత్రం : దేవుళ్ళు (2001) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం : స్వర్ణలత , సుజాత ************************************ Sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha parayanato sakala janulaki bharalanu tolaginche gadha parayanato sakala janulaki bharalanu tolaginche gadha sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
Shiridi graamamlo oka baaluni roopamlo vepachettukrinda vedaamtiga kanipinchadu tana velugunu prasarinchadu pagalu reyi dhyaanam paramatmunilo leenam pagalu reyi dhyaanam paramatmunilo leenam aanandame aharam chedhu chettuneedaye guru peethm yendaku vaanaku krungaku ee chettu krindane undaku sayi,sayi ra maseeduku ani mahalsapati pilupuku maseeduku maarenu sayi ade ayinadi dvarakamayi akkada andaru bhayi bhayi baba bodhala nilayamadoyi Sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
||పల్లవి|| బాబా.....సాయిబాబా...... బాబా.....సాయిబాబా...... నీవు మావలె మనిషివని.... నీకు మరణం వున్నదని.... అంటే ఎలా నమ్మేది.... అనుకుని ఎలా బ్రతికేది.... బాబా.....సాయిబాబా...... బాబా.....సాయిబాబా......
||చరణం 1|| నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడె కోవెల నీ దేహం...... శిధిలంగా అవుతుందా పిలిచినంతనె పలికే దైవం మూగైపొతాడా...... బాబా.....సాయిబాబా......
||చరణం 2|| దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలోనా ఎక్కడవున్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలోనా ఎక్కడవున్నా ముక్కలు చెక్కలు చేసుకురా సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా గ్రహములు గోళాలిహపరశక్తులు గగ్గొలెట్టగ రావయ్యా నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపొనీ ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపొనీ కదిలే కాలాగ్ని... ఎగిసే బడబాగ్ని దైవం ధర్మాన్ని... దగ్ధం చేసెయ్నీ నేనే ఆత్మైతే.. నువ్వే పరమాత్మ నీలో నన్ను ఐక్యం అయిపొనీ.....పొనీ.......
చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం : ఇళయరాజా రచన : ఆత్రేయ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ***************************************** baba sai baba...baba sai baba... neevu maavale manishivani neku maranam unnadani ante yelaa nammedi anukuni yela bratikedi
సాకీ : సాయి బాబా ....సాయిబాబా.... సాయినాధా....సాయిదేవా.... సత్యం నిత్యం నీవేకావా
పల్లవి :
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా
చరణం1: మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి.... శ్రీరాముడైనా....శ్రీకృష్ణుడైనా.... ఏ దైవమైనా . నీలోనేచూచాము సాయి.... రావా....బాబా....రావా.... రక్షా....రక్షా నీవేకదా మా బాబా .. నువ్వు..
maa paali daivamanee maa dikku neevenani kolichaamu dinam dinam sayi... maa aarthi chustavani sakshatkaristavani vechamu kshanam kshanam sayi... shriramudainaa...srikrishnudainaa.. ye daivamainaa..ye dharmamainaa.. nelone chuchamu sayi... ravaa..babaa...ravaa.. rakshaa..dakshaa...neve kadaa maa babaa(nuvvu)
maa yesu nevenani...maa prabhuvu nevenani prardhanalu cheshamayaa ninne.. allaga vachavani challamga chustavani cheshamu salam salam neke gurunanakainaa....gurugovindainaa... gurudvaramainaa..ne dvarakenanee ne bhaktulainaamu sayi.. ravaa...baba..ravaa.. rakshaa...dakshaa....neeve kadaa maa babaa(nuvvu) krushna sai kriushna sai ramasai krushna sai krushna sai rama sai alla sai moulaa sai(2) nanak sai govind sai yesu sai shirdi sai om...(nanak) sai sai baba sai .....(6)
Movie Name : Sri shirdi saibaba Mahathyam (1986) Music Director : Ilayaraja Lyricist : Athreya Singers : S.P.Bala Subramanyam & Chorus
మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
చరణం 1: పసిపాప మనసున్న ప్రతి మనిషి లోను పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్దుడవుతాడని గోలీల ఆటల్లో కొండంత సత్యంచాటావు ఓసాయి మమ్మ్ము సాకావు మాసాయి వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి తలుపుల్ల్ని తీసేస్తివి.. మాలో కలతల్ని మాపేస్తివి….
మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
చరణం 2: పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ..ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకామాయి నీ వాసమాయే ధన్యులమైనామయ్యా మాకు దైవామై వేలిసావయ్యా……
మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా తరియించినామయ్యా మేము తరియించినామయ్యా తరియించినామయ్యా మేము తరియించినామయ్యా…
చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం : ఇళయరాజా రచన : ఆత్రేయ గానం : కె.జె.యేసుదాసు **************************************** Pallavi : ma papala tolaginchu deepaala neeve veliginchinaavayya mammu karuninchi navyaya janma janmala punyaala pantalle ninnu darshinchinaamayya memu tariyinchinamayya
పల్లవి: దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దీనుల హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో ఓ ఓ ఓ దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
చరణం1: త్రేతాయుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడిగా త్రేతాయుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడిగా కలిలో ఏసు,బుద్దుడు,అల్లా కలిలో ఏసు,బుద్దుడు,అల్లా కరుణామూర్తులుగా ఆ ఆ దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
పల్లవి : సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
చరణం : 1 విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు "సాయీ"
చరణం : 2 పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై