Saturday, September 29, 2012

ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు.. స్వర్ణ కమలం (1988)


పల్లవి:
ఆ ఆ ఆఆ ఆఆ
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

చరణం:
మబ్బులో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికైనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

చరణం:
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నాకోసం సురభోగాలే వేచి నిలిచెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

చిత్రం: స్వర్ణ కమలం (1988)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: జానకి

No comments:

Post a Comment