Thursday, October 18, 2012

తొలి తెలుగు సంపూర్ణ టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931) లోని పద్యాలు, గేయాలు


వింతాయెన్ వినన్ సంతస మాయెనుగా దేవేంద్ర
సంతస మాయెనుగా సురనాథ
అడగెను దేవారి బెడిదపు దపమున
గూరివడి ప్రాణం బెడబాసి
మనసున నానందంబును మిగులుగా
నీవొంద దనుజుండు మృతిజెందె !

( తెలుగులో రచించిన మొదటి పాట.. )

చిత్రం : భక్త ప్రహ్లాద (1931)
రచన : చందాల కేశవదాసు (తొలి తెలుగు సినీ కవి)
సంగీతం : హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గానం : సురభి కమలాబాయి


******************************

పరితాప భారంబు భరియింప తరమా
కటకటనే విధి గడువంగ జాలుదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా...
పరితాప భారంబు భరియింప తరమా

ఈ విషము నేనెటులను
తనయుని త్రావింపగలను?
ధర్మము కాపాడుదునా?
తనయుని కావగగలనా?...

పరితాప భారంబు భరియింప తరమా
కటకటనే విధి గడువంగ జాలుదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా...
పరితాప భారంబు భరియింప తరమా

చిత్రం : భక్త ప్రహ్లాద (1931)
రచన : చందాల కేశవదాసు (తొలి తెలుగు సినీ కవి)
సంగీతం : హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గానం : సురభి కమలాబాయి

No comments:

Post a Comment