Showing posts with label భారతీయ సినిమా చరిత్ర (History of Indian Cinema). Show all posts
Showing posts with label భారతీయ సినిమా చరిత్ర (History of Indian Cinema). Show all posts

Monday, May 13, 2013

ఎవర్‌గ్రీన్.. మాయాబజార్

mayabazar

-వందేళ్ల భారతీయ సినీయవనికపై వన్నెతరగని తెలుగుచిత్రం
- అద్భుత కళాఖండంగా మొదటిస్థానం
- సీఎన్‌ఎన్-ఐబీఎన్ పోల్స్‌లో వెల్లడి
- రెండు, మూడు స్థానాల్లో మలయాళి చిత్రాలు
- ఆ తర్వాతి స్థానాల్లో బెంగాలీ, తమిళ్, బాలీవుడ్ సినిమాలు

మాయాబజార్.. 
నాటికి నేటికి ఏనాటికి వన్నెతరగని తెలుగుచిత్రం! అదో అపూర్వ కళాఖండం! 
వందేళ్ల భారతీయ సినీయవనికపై దానికి మరొకటి సాటిరాదని మరోసారి నిరూపితమైంది! 
దేశంలో అద్భుత కళాఖండంగా మొదటిస్థానంలో ‘మాయాబజార్’ నిలిచింది! 
వివిధ భాషల్లోని వంద చిత్రాలపై సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థ పోల్స్ నిర్వహించగా.. ఇది వెల్లడైంది. 56ఏళ్ల క్రితం విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ అందరి మన్ననలు అందు కుంటోంది. భారతీయ సినిమా శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థ ఇటీవల దేశంలోని వివిధ భాషల్లోని వంద చిత్రాలను ఎంపిక చేసి.. పోల్స్ నిర్వహించింది. వీటిల్లో అద్భుత చిత్రంగా మీరు దేనికి ఓటేస్తారని జనాన్ని ప్రశ్నించగా.. అనేక మంది ‘మాయాబజార్’ ను ఎంచుకున్నారు. మొదటి స్థానంలో నిలిపారు. రెండోస్థానంలో మలయాళి చిత్రం ‘మణిచివూతథాఝూ’, మూడోస్థానంలో మరో మలయాళి చిత్రం ‘ఒరు వడక్కన్ వీరగాథ’ నిలిచాయి. బెంగాలీ, తమిళ్, బాలీవుడ్ చిత్రాలు తరువాతి స్థానాలను సొంతం చేసుకున్నాయి. 1989లో వచ్చిన శివ చిత్రం(తెలుగు) ఏడో స్థానం కైవసం చేసుకుంది. మాభూమి, సాగరసంగమం, పాతాళభైరవి, శంకరాభరణం వంటి తెలుగు చిత్రాలు టాప్ 20లో చోటు దక్కించకున్నాయి.

మరపురాని కళాఖండం
1957 మార్చి 27.. బ్లాక్ అండ్ వైట్ తెరపై మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రం! మాయాబజార్! విడుదలైంది. అప్పటివరకు అలా వచ్చి.. ఇలా చూసిపోయే ప్రేక్షకులే.. మాయాబజార్ కోసం క్యూలు కట్టారు. పది నుంచి వందసార్లు ఆ చిత్రాన్ని వీక్షించినవారు అప్పట్లోనే కొకొల్లలు. ఇప్పటికీ ఆ చిత్రం టీవీల్లో వస్తోందంటే ఇంటిల్లిపాది ముందస్తుగానే దాని ముందు వాలిపోతారు! చిత్రవూపముఖులైతే.. వీలున్నప్పుడల్లా ‘మాయాబజార్’ సీడీ వేసుకొని చూస్తుంటారు! అదీ.. ఆ కళాఖండం గొప్పతనం. కేవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాయాబజార్... భారతంలోని శశిరేఖాపరిణయ ఘట్టం మాత్రమే! కథ, కథనం, మాటలు, పాటలు, అభినయం.. దానికి వన్నెతెచ్చాయి.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్... ఎవరికివారే పోటీపడి నటించారు! వారికితానేమి తక్కువకానంటూ మహానటి సావిత్రి నటనసాగింది! ఆ చిత్రంలోని పింగళి మాటలు, పాటలు.. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి. కొత్త పదాలకు, సరికొత్త పాటలకు, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి.. ఆ చిత్రం బాటలు వేసింది. 2007లో 50ఏళ్లు పూర్తి చేసుకున్న మాయాబజార్ ఇటీవల రంగుల్లో కూడా విడుదలైంది. ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో..’, ‘చూపులు కలిసిన శుభవేళ.. ఎందుకు నీకీ కలవరము’, ‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు..’, ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము..’ ఈ పాటలు విననివారుంటారా?, అస్మదీయులు, తస్మదీయులు, హాయ్ హాయ్ నాయకా... మాటలు వినపడగానే ఆశ్చర్యంగా చూడనివారుంటారా? ఈ పాటలు.. ఈ మాటలు బొమ్మకట్టి తెరకెక్కింది ‘మాయాబజార్’లోనే!

Sunday, May 5, 2013

టాకీల తొలి రోజుల్లో వింతలు.. విశేషాలు

తొలి రోజుల్లో చిత్ర నిర్మాణ పద్ధతులను పరిశీలిస్తే చిత్రంగా అనిపిస్తుంది. ప్రారంభంలో సినిమాల నిర్మాణం తక్కువే. ఏడాదికి ఒకటో రెండో సినిమాలు నిర్మాణంలో ఉండేవి. ఆర్టిస్టుల సంఖ్య కూడా తక్కువే. వాళ్లంతా నెల జీతాలకు పని చేస్తుండేవారు. ఒక్కో సినిమాని తీయడానికి నాలుగు నుంచి ఆరు నెలల వరకూ సమయం పట్టేది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయి, నిర్మాత 'రిలీజ్ ఆర్డర్' ఇచ్చేవరకూ ఆర్టిస్టులకు మరో సినిమాలో నటించడానికి వీలుండేది కాదు.

అగ్రిమెంట్ చేసుకొన్న సమయంలోపల సినిమా షూటింగ్ పూర్తి కాకపోతే అదనంగా డబ్బు చెల్లించేవారు. అలాగే ప్రతి కంపెనీకి ఒక కారు ఉండేది. అందులో ముఖ్యమైన ఆర్టిస్టులను మాత్రమే పికప్ చేసుకొనేవాళ్లు. సహాయ నటీనటులకు మాత్రం రెండు అణాలు (నాలుగు అణాలు కలిపితే ఓ పావలా) బస్ ఛార్జీల నిమిత్తం ఇచ్చేవారు. అదేవిధంగా 'షేవింగ్ ఖర్చు' నిమిత్తం మగవాళ్లకి ఒక అణా ఇచ్చేవారు.

షూటింగ్ ఇలా జరిగేది

సెట్లో దర్శకుడే సుప్రీమ్. ఆయన సెట్‌లోకి రాగానే అందరూ ఎంతో గౌరవించి, భయభక్తులతో మెలిగేవారు. నిర్మాణ విషయాల్లో నిర్మాత జోక్యం చేసుకోకుండా దర్శకునికి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. హీరో, హీరోయిన్ ఎవరైనా దర్శకుని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. అలాగే పాత్రలను బట్టి మేకప్, కాస్ట్యూమ్స్ నిర్ణయించేవారు. నటీనటులందరికీ ఒకే ఒక మేకప్‌మన్, టచెప్ బోయ్ ఉండేవారు. ఆర్టిస్టులందరినీ దర్శకుడు ఒక చోట సమావేశపరిచి. ఆ యా పాత్రధారులను డైలాగులు చెప్పమని అడిగేవారు. అంటే నాటక ప్రదర్శనకు ముందు జరిగే ఫైనల్ రిహార్సల్స్‌లా జరిగేదన్నమాట. ఆర్టిస్టులకు టైమింగ్స్ అని ఉండేవి కావు. ప్రతిరోజూ ఆర్టిస్టులంతా మేకప్ వేసుకుని తయారై ఉండేవారు. ఫ్లోరులో ఏ సెట్ (సెట్ అంటే ఆ రోజుల్లో నాటకలకు ఉపయోగించే సీనరీ కర్టెన్లన్నమాట) ఖాళీగా ఉంటే అక్కడకి ఆర్టిస్టులను పిలిచి షూటింగ్ జరిపేవారు. ఇప్పటిలా ఫ్లోరు పైభాగం రేకులతో కప్పి ఉండేదికాదు. చుట్టూ నాలుగు గోడలు తప్ప పై భాగమంతా ఖాళీగానే ఉండేది. అక్కడినుంచి ఎండ పడుతుంటే రిఫ్లెక్టర్ల వెలుగులో ఆర్టిస్టులు నటించేవారు.

ప్రారంభంలో తెలుగువారి షూటింగ్స్ ఎక్కువగా ఉత్తరాదిలో జరుగుతుండేవి. కొన్ని స్టూడియోల్లో తెలుగువారిని చాలా చిన్నచూపు చూసేవారు. హిందీ సినిమాలకు మొదట ప్రాధాన్యం ఇచ్చి, ఆ షూటింగ్స్ లేనప్పుడే తెలుగు సినిమాలకు ఇచ్చేవారు. కొంతమంది ఉత్తరాది స్టూడియో అధినేతలు చూపించే వివక్షను సహించలేకే పినపాల వెంకటదాసు దక్షిణాదిలో స్టూడియోని నిర్మించారు. ఆనాటి స్టూడియోల్లో వసతులు అంతంత మాత్రమే, కొన్ని చోట్ల తినడానికీ, విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు ఉండేవికావు. సెట్టులో పని లేనప్పుడు ఆర్టిస్టులు ఓ చెట్టుకిందో చతికిలపడేవారు.

కెమెరా కదలికలు తక్కువ
ప్రారంభంలో సినిమా అంటే దాదాపు నాటకంలానే ఉండేది. రెండు సీన్లు కలిపి ఒకే షాట్‌లా తీసేవారు. కెమెరా కూడా సాధ్యమైనంతవరకూ కదలిక లేకుండా ఒకే చోట ఉండేది. షూటింగ్ ఎలా చేయాలన్నది దర్శకుడు ముందుగానే నోట్స్ తయారు చేసుకుని వచ్చేవాడు. దాని ప్రకారం షాట్స్ తీసేవారు. దర్శకుడు చెప్పమన్నంతవరకూ చెప్పడం, ఆగమన్నప్పుడు ఆగడం ఆర్టిస్టుల పని. ఇదేమిటని కానీ, ఇలా ఎందుకు చేయాలని కానీ అడిగే ధైర్యం కానీ, అవకాశం కానీ ఆర్టిస్టులకు ఉండేదికాదు. సాధారణంగా మొదటి టేక్‌లోనే షాట్ ఓకే అయ్యేది. 'రెండో టేక్' అంటేనే ఆర్టిస్టులు సిగ్గుతో తలల దించుకునేవారట. ఎందుకంటే రంగస్థలం మీద ఆరితేరిన వాళ్లనే సినిమాల్లోకి తీసుకునేవారు. ముఖ్యంగా పద్యాలు, పాటలు పాడగలిగే వాళ్లకే అవకాశాలు లభించేవి. మధ్యలో కట్‌లు లేకుండా పాటంతా ఒకేసారి పాడాలి. ఆర్టిస్టులు పాడుతుంటే వాయిద్య బృందం ఓ మూల ఉండి సంగీతం సమకూర్చేవారు. మెల్లిగా మాట్లాడితే సౌండ్ రికార్డ్ కాదేమోనని నాటకాల్లో లాగానే ఆర్టిస్టులు బిగ్గరగా మాట్లాడుతుంటే 'మెల్లిగా మాట్లాడండి' అంటూ దర్శకుడు సూచనలు ఇచ్చేవారు.

సొమ్మసిల్లే సౌండ్ రికార్డిస్ట్
పాత రోజుల్లో శబ్దాన్ని రికార్డ్ చేసే రికార్డిస్ట్‌కు సెట్‌లో చాలా గౌరవం లభించేది. అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఆర్టిస్ట్ ప్రయత్నించేవారు. మైక్‌ని సెట్ మధ్యలో అమర్చేవారు. ఆర్టిస్టులు దాని చుట్టూ చేరి డైలాగులు చెప్పేవారు. సెట్‌లో శబ్దం రికార్డ్ అవుతున్నప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉన్నా కెమెరాలో రీలు మాత్రం పెద్ద శబ్దం చేస్తూ తిరిగేది. అప్పటికింకా 'బ్లింప్' (కెమెరా పైన ఉండే తొడుగు. అది వేస్తే శబ్దం వినిపించదు) రాలేదు. అందుకే ఆ శబ్దం రికార్డ్ కాకుండా సౌండ్ రికార్డిస్ట్‌ని ఓ అద్దాల గదిలో ఉంచేవారు. చుట్టూ మూసేసి ఉండటంతో ఆ గదిలో గాలి ఆడేది కాదు. అంతే సౌండ్ రికార్డిస్ట్ ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. ఇక పెద్ద షాట్ అయితే చెప్పనక్కర్లేదు. సొమ్మసిల్లి పడిపోయే సౌండ్ రికార్డిస్టుల కోసం 'ఫస్ట్ ఎయిడ్ బాక్స్' ఎప్పుడూ సిద్ధంగా ఉండేది.

సింగిల్ ప్రొజెక్టర్లే అన్నీ
ఆ రోజుల్లో అన్నీ సింగిల్ ప్రొజెక్టర్లే ఉండేవి. రీలు తరువాత రీలు లోడ్ చేసేవారు. ప్రారంభంలో రోజుకి రెండు ప్రదర్శనలు ఉండేవి. అదీ సాయంత్రం పూటే. కరపత్రాల్లో ' సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రదర్శన ప్రారంభం' అని ఉన్నా జనంతో హాలు నిండేవరకూ సినిమా మొదలయ్యేది కాదు. అప్పట్లో ప్రొజెక్టర్లని చేత్తో తిప్పేవారు. ఒక వేళ ప్రొజెక్టర్ పాడయితే , తిరిగి బాగయ్యే జనం అలాగే కూర్చేనేవారు. ప్రదర్శనపరంగా ఇన్ని ఇబ్బందులున్నా ప్రతి సినిమా ప్రేక్షకాదరణ పొందేది.

మూకీ ముచ్చట
మూకీ సినిమాల్లో డైలాగులు ఉండవు కనుక తెరపై జరిగే కథాక్రమాన్ని ప్రేక్షకులకు బాగా అర్ధమయ్యేట్లు వివరించి చెప్పడానికి ఓ వ్యాఖ్యాత ఉండేవాడు. మంచి కంఠస్వరం కలిగి ఉండటం ఈ వ్యాఖ్యాతకు తప్పనిసరి. హాస్యోక్తులతో తన బాణీలో వ్యాఖ్యాత సంభాషణలు వివరిస్తుంటే ప్రేక్షకులు విరగబడి నవ్వేవారు. వ్యాఖ్యాత పక్కనే తబలా, హార్మొనియం ఉండేవి. మూకీ సినిమాలకు అవే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.

సినిమాకు 'వంద'నం


సరిగ్గా వందేళ్ల క్రితం 'రాజా హరిశ్చంద్ర'తో ప్రారంభమైన సినీ ప్రయాణం నేటితో నూరో మైలురాయి చేరుకుంది. ఈ వందేళ్ల పయనంలో సినిమా మాట నేర్చింది, సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందింది. గొప్పగొప్ప కళాకారులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకి అందించింది. భారతీయ సినిమా అభివృద్ధి కోసం కృషి చేసిన తెలుగు వారినీ, తెలుగు చిత్రపరిశ్రమని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. దేశవ్యాప్తంగా సినీప్రియులు పండుగ చేసుకుంటున్న సందర్భంగా అందుబాటులో ఉన్న కొంతమంది సినీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించి అందిస్తున్నాం.

అది నా అదృష్టం:
- విజయనిర్మల
"భారతీయ సినిమా 100 ఏళ్ల పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంది. నా చిన్నప ్పటి నుంచి ఈ రంగంలో ఉన్నాను. ఎస్వీ రంగారావు, సావిత్రి, జగ్గయ్య, జమున, శివాజీ గణేశన్ వంటి మహామహులతో పనిచేశాను. హీరోయిన్‌గా నటించాను. కృష్ణగారితో చేసిన సినిమాలు కోకొల్లలు. నేను 44 సినిమాలకు దర్శకత్వం చేస్తే అందులో 40 కృష్ణగారితో చేసినవే. ఈ జన్మకి ఇది చాలనిపిస్తోంది. ఇదంతా ఈ 100 ఏళ్లలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను.

ఇప్పుడున్న హీరోలు చాలా టాలెంటెడ్. మహేష్, ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అరవింద్‌గారి అబ్బాయి అల్లు అర్జున్, చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్ వంటి వారందరూ ఎంతో కృషి చేసి టాలెంట్‌తో పైకి వస్తున్నారు. నేటి సినిమాలో తల్లి, చెల్లెలు, వదిన పాత్రలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చూపించే సినిమాలు కనుమరుగైపోతున్నాయి. ఇటీవల వచ్చిన 'సతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలు రావాలి.

ఇలాంటి సినిమాలతో మన సినిమా 200 సంవత్సరాల మైలు రాయిని చేరాలి. మాస్, ఫైట్, సాంగ్స్‌తో సినిమాలను సరిపెట్టకూడదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. మేం 'అల్లూరి సీతారామరాజు' చేసే సమయంలో ఇంత టెక్నాలజీ లేదు. అయినా మేం మా వంతు కృషి చేశాం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టు మానవీయ అంశాలను జోడించి సినిమాలు చేయాలి. సూర్యకాంతం, నిర్మలమ్మ వంటి నటీమణులు కరువైపోయారు. వారి స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి. రావాలి''

అందులో నేనూ భాగమైనందుకు ఆనందం
- కృష్ణంరాజు
భారతీయ సినిమా శత వసంతాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో నేనూ భాగమైనందుకు ఇంకా ఆనందంగా ఉంది. సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలోకి అందరం పొట్ట చేతపట్టుకునొ వచ్చినవాళ్లమే. ఎవరి అదృష్టానికిఈ, ఎవరి అర్హతకు తగిన స్థానం వాళ్లకు లభించింది. విలన్‌గా నటించినా, హీరోగా చేసినా నాదైన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఒదులుకోలేదు. నా సీనియర్స్ ఆశీస్సులు పొందాను. సమవయస్కులతో స్నేహంగా మసిలాను. గోపీకృష్ణా బేనరుపై ఎన్నో విభిన్న చిత్రాలు నిర్మించాను. తెలుగులో విజయవంతమైన చిత్రాలను హిందీలో తీస్తే అక్కడ కూడా హిట్ అయ్యాయి. ఎలా చూసుకున్నా ఒక నిండైన, అర్ధవంతమైన జీవితాన్ని గడిపాను. నాకు ఇంత గొప్ప జీవితాన్ని సినీ కళామతల్లే ప్రసాదించింది. వందేళ్ల సినిమా చరిత్రలో నాకూ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది.


ఇప్పుడు ఎదగడం సులువు
- కె. రాఘవ, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
ఇండస్ట్రీలో ఉండటానికి అప్పట్లో రకరకాల కష్టాలూ, బాధలూ పడ్డాం. ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం కష్టమే కానీ, వచ్చాక ఎదగడం సులువు. ఇప్పడు ప్రచార, ప్రసార సాధనాలు ఎన్నో ఉన్నాయి. కానీ అప్పట్లో ఎక్కువ మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడే వాళ్లం. డబ్బులిచ్చి విజయవాడ వంటి చోట్లకి మనుషుల్ని పంపి, అక్కడి టీకొట్ల వద్ద మౌత్ పబ్లిసిటీ ఇప్పించేవాళ్లం. 'అంజలినీ, ఏఎన్నార్‌నీ కెమెరా మింగేసిందంట' అని పబ్లిసిటీ ఇచ్చే వాళ్లం. జట్కాబండిపై మైకుతో చెప్పించేవాళ్లం.

వాటికి బేనర్లు కట్టేవాళ్లం. అవి జనానికి ఆసక్తి కలిగించేవి. ఇండస్ట్రీకి నేను మంచి సినిమాలిచ్చాను. దాసరి నారాయణరావునీ, కోడి రామకృష్ణనీ దర్శకులుగా అందించాను. 'సుఖదుఃఖాలు'తో కె. బాలచందర్‌ను రచయితగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాను. వి.సి. గుహనాథన్‌ను పరిచయం చేశాను. ఇండస్ట్రీకి నేను చేసిన దానికి గుర్తింపుగా అన్నట్లు ప్రభుత్వం నాకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చింది. అది తప్ప మిగతా అవార్డులేవీ నాకు రాలేదు. ఇప్పుడు ఆయా కమిటీల్లో ఉండేవాళ్లు తమ కుటుంబానికి చెందిన వాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటున్నారు.


టెక్నాలజీ సినిమా రూపురేఖలనే మార్చేసింది
- రాజశ్రీ
వందేళ్ల సినిమా గురించి ఎంతని చెబుతాం. మహాసముద్రంలాంటి సినిమాలో నీటిబొట్టులాంటి వాళ్లం మేము. సినిమా అంటే హీరోహీరోయిన్లే కాదు, పాత్రధారులందరూ ప్రధానమే. అందరం కలిస్తేనే సినిమా. మేము పుట్టకముందే సినిమా పుట్టింది. మూకీ సినిమాలు తీసి పక్కనుండి డైలాగులు చెప్పేవారట. విఠలాచార్య ఎన్నో ట్రిక్కులు చేసి మాయ చేశారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. గ్రాఫిక్స్ వచ్చేశాయి. 'చాలామంది సినిమాల్లో లేదా టీవీ సీరియల్లో నటించవచ్చు కదా అని అడిగేవారు. కానీ, నాకు అస్సలు ఇష్టం లేదు. 1977లోనే నటనకు గుడ్‌బై చెప్పేశాను. అప్పటినుండి కుటుంబం, పిల్లలే నా లోకం. అయినా సీనియర్ నటీనటులకు ఈ తరం గౌరవం ఇవ్వడం లేదని చాలా మంది చెబుతుంటే విన్నాను.

సెట్స్‌లో ఒంటరిగా కూర్చోవడం కంటే ఇంట్లో నలుగురితోనూ కలిసుండడమే ఉత్తమం కదా. అయినా ఈ తరం సినిమా గురించి విమర్శించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కాలాన్ని బట్టి మార్పు సహజమే కదా. ఒక్కో తరం మారుతూనే ఉంటుంది. వస్త్రధారణ విషయంలో మా ముందు తరంవారు మమ్మల్ని విమర్శించేవారు. మేము ఈ తరాన్ని విమర్శిస్తున్నాం. మా రోజుల్లో కురచ దుస్తుల ధరించేవారు కొంతమందే ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్లందరూ కురచ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. అయినా వస్త్రధారణే కాదు, నటన, చిత్రీకరణ విధానాలు కూడా ఎంతో మారిపోయాయి. టెక్నాలజీ సినిమా రూపురేఖలనే మార్చేసింది.

అయితే సమయపాలన పాటించకపోవడం ఈ తరం చేస్తున్న పెద్ద పొరబాటు. సమయపాలన పాటించాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లే. వారి దగ్గర మేము ఎంతో నేర్చుకున్నాం. ఈ తరం అతివేగంతో ముందుకెళ్తున్న మాట వాస్తవమేగానీ, సమయపాలన పాటించక పోవడం బాధాకరం. ఏదేమైనా ఎన్టీఆర్, ఏఎన్నార్, నాగయ్య, ఎస్వీ రంగారావు, భానుమతి, కన్నాంబ వంటి నటీనటులు మళ్లీ రారు. ఎవర్‌గ్రీన్ తారలు వారు.

వందేళ్ల కాలం
గుర్తుండేలా ఉత్సవాలు
- సి. కల్యాణ్, అధ్యక్షుడు, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కాలంలో ఈ ఫీల్డులో ఉండటం గొప్ప అనుభూతి. చెన్నైలో జరగనున్న వందేళ్ల ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నందుకు తెలుగువాడిగా గర్వపడుతున్నా. రాబోయే వందేళ్ల కాలం వరకూ గుర్తుండిపోయేలా ఈ ఉత్సవాల్ని జరపాలనీ, భారతీయ సినిమా రెండో శతాబ్ది చివరకు ప్రపంచంలోనే నెంబర్‌వన్ కావాలనీ ఆశిస్తున్నాం. జూలై 13 నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం.

ఉత్సవాల మొదటి రోజు ఉదయం మలయాళ చిత్రాలకీ, సాయంత్రం తమిళ చిత్రాలకీ, రెండో రోజు ఉదయం కన్నడ చిత్రాలకీ, సాయంత్రం తెలుగు చిత్రాలకీ కేటాయిస్తున్నాం. మూడో రోజు సాయంత్రం నిర్వహించే భారీ వేడుకలో దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల నుంచీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.

ఆ వేడుకకు రాష్ట్రపతినీ, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ, తెలుగు సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి, నేడు కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్న చిరంజీవినీ ఆహ్వానిస్తున్నాం. వారంతా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం. ఇదివరకు తెలుగు సినిమా వజ్రోత్సవం గొప్పగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల సినిమాల వారూ కలిసి సౌత్ రీజియన్‌గా చరిత్రలో గుర్తుండిపోయేలా రూ. 30 కోట్ల ఖర్చుతో భారతీయ సినిమా శతాబ్ది వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నాం.


మనుగడకు అవకాశాలు తగ్గుతున్నాయి
- తమ్మారెడ్డి భరద్వాజ్, అధ్యక్షుడు, ఆం.ప్ర. చలనచిత్ర వాణిజ్య మండలి
సినిమా శతాబ్ది పూర్తి నాటికి ఇండస్ట్రీలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, ఆ ఇండస్ట్రీలో ఇప్పుడొస్తున్న మార్పులకు కొంత బాధగానూ ఉంది. కాలంతో పాటే సినిమాల్లోనూ ఎన్నో మార్పులొచ్చాయి. అప్పట్లో స్వతంత్ర నిర్మాతలు ఉండేవారు. మనుగడకు అవకాశాలెక్కువగా ఉండేవి. ఇప్పుడూ స్వతంత్ర నిర్మాతలున్నా మనుగడకు అవకాశాలు స్వల్పమైపోయాయి. పద్ధతులు మారాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఈ కొత్త పద్ధతుల్లో ఇమడలేక నానా ఇక్కట్లూ పడుతున్నారు.

ఆరుబయటి తెరల నుంచి టూరింగ్ టాకీసులకు, అక్కణ్ణించి పర్మనెంట్ సినిమా హాళ్లకూ వచ్చిన సినిమా ఆ తర్వాత కాంప్లెక్సులకూ, ఇప్పుడు మల్టీప్లెక్సులకూ మారింది. ప్రింట్ల పద్ధతి పోయి డిజిటలైజేషన్ వచ్చినందున ఖర్చు తగ్గుతుందనుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చవుతోంది. సినిమా తక్కువ సమయంలో పూర్తవ్వాల్సింది పోయి ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటున్నదో అర్థం కావడం లేదు. రోజు రోజుకూ టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. పాతది పోయి కొత్తది వస్తోంది. థియేటర్లలో ప్రతి ఏటా ప్రొజెక్టర్లు మార్చుకోవాల్సిన స్థితి వస్తోంది. ఇప్పుడు నిజంగా మనం క్రాస్‌రోడ్స్‌పై ఉన్నాం.


ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది
- ఎం. బాలయ్య, నటుడు, నిర్మాత, దర్శకుడు
ఇండస్ట్రీలోకి 1957లో ఓ ఆర్టిస్టుగా ప్రవేశించాను. తర్వాత ఈ యాభై ఆరేళ్లలో నటునిగా, నిర్మాతగా, రచయితగా, దర్శకునిగా ఇంత దూరం ప్రయాణిస్తూ వచ్చా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు నాగయ్య, రేలంగి, సీయస్సార్ ఆంజనేయులు, గుమ్మడి వంటి గొప్ప సహ నటులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. తర్వాత నిర్మాతగా పది సినిమాలు తీశాను. అన్నీ కథాబలం ఉన్నవే.

వాటికి నేనే కథా రచయితని. నేను తీసిన 'చెల్లెలి కాపురం', 'ఊరుకిచ్చిన మాట' చిత్రాలకు ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఏడు సినిమాలకు దర్శకత్వం వహించాను. మారుమూల ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాకు ఇండస్ట్రీ ఓ ప్రత్యేకతని ఇచ్చింది. నన్ను పూజించింది. అభివృద్ధి చేసింది. తెలుగు సినిమా పితామహుడైన రఘుపతి వెంకయ్య అవార్డు నాకు దక్కేట్లు చేసింది. అందుకు చిత్రసీమకు సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇప్పటికీ నేను కథలు రాస్తుంటాను. కానీ వాటిని తీసుకునేవాళ్లే కనిపించడం లేదు.

ఇది ప్రత్యేక సందర్భం
శుక్రవారం భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దానికి గుర్తింపుగా ఓ సినిమా తీసి ఉండాల్సిందనే కోరికని వ్యక్తం చేశాడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్. "వందేళ్ల భారతీయ సినిమాపై ఓ సినిమా తీయాలనుకున్నా. కానీ తీయలేకపోయా. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్నందుకూ, ఈ ఇండస్ట్రీలో ఓ భాగమైనందుకూ సంతోషంగా ఉంది.

ఇదే సందర్భంలో నటునిగా నేనూ పాతికేళ్లు పూర్తి చేసుకున్నందుకు ఇది ఓ ప్రత్యేక సందర్భంగా అనిపిస్తోంది'' అని ఆయన చెప్పాడు. సినిమా శతాబ్దికి నివాళిగా నాలుగు చిన్న కథలతో నలుగురు పేరుపొందిన దర్శకులు దివాకర్ బెనర్జీ, కరణ్ జోహార్, జోయా అఖ్తర్, అనురాగ్ కాశ్యప్ 'బాంబే టాకీస్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా శుక్రవారమే విడుదలవుతోంది.

ఈ సినిమా టైటిల్ ట్రాక్‌లో పలువురు పేరుపొందిన బాలీవుడ్ తారలు నటించారు. అమీర్‌ఖాన్‌తో ప్రారంభమయ్యే ఆ సినిమా షారుఖ్‌ఖాన్‌తో ముగుస్తుంది. ఈ పాటలో కరీనా కపూర్, కరిష్మా కపూర్, రణవీర్ సింగ్, అనిల్ కపూర్, ప్రియాంకా చోప్రా, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, శ్రీదేవి, రణబీర్ కపూర్ వంటివాళ్లు కనిపిస్తారు. ఆ పాట చేసినందుకూ, అందులో భాగమైనందుకూ గొప్పగా భావిస్తున్నానని అమీర్ తెలిపాడు.

Friday, May 3, 2013

గిన్నిస్‌బుక్‌లోకి "అగడం"

ఒక్క షాట్‌లో రూపొందిన అధిక నిడివి గల చిత్రంగా అగడం గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించింది. పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ గత ఏడాది డిసెంబర్ 7న గిన్నిస్‌బుక్‌లో నమోదైంది. రెండు గంటల మూడు నిమిషాలు 30 సెకన్లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ ఒక నోటరి, పబ్లిక్ న్యాయవాది, అధ్యాపకులు, ఎత్తన్ చిత్ర దర్శకుడు సురేష్ సమక్షంలో జరిగింది.

చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ వెంటనే లండన్‌లోని గిన్నీస్‌బుక్ రికార్డు సమితికి దర్శకుడు మొహ్మద్ ఇసాక్ పంపారు. లాస్ట్ బెంచ్ బాయ్స్ ప్రొడక్షన్ పతాకంపై ఎం.రసియతి మహమ్మద్, మొహ్మద్ ఇసాక్ నిర్మించిన ఈ చిత్రానికి కెమెరామెన్ నౌషద్. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది.

చిత్ర ట్రైలర్‌ను అభిరామి రామనాథన్ ఆవిష్కరించారు. తొలి సీడీని కె.భాగ్యరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అభిరామి రామనాథన్ మాట్లాడుతూ ఒక్క భారతీయుడి మేధస్సు, పదిమంది అమెరికన్ల మేధస్సుకు సమానమని తానెప్పుడూ చెబుతుంటానన్నారు. అది ఈ చిత్రంతో మరోసారి నిజమైందని పేర్కొన్నారు.

1913 - 2013: వందేళ్ల భారతీయ సినిమాకు వందనం ... అభివందనం..

హిందువు గుడికి వెళ్తాడు... మహమ్మదీయుడు మసీదుకు వెళ్తాడు.. క్రైస్తవుడు చర్చికి వెళ్తాడు. కానీ, అన్ని మతాల వాళ్లూ వెళ్లే ప్లేస్... సినిమా థియేటర్.నిజం చెప్పాలంటే... సమాజంతో కలగలసిపోయి... మనుషుల భావోద్వేగాలతో పెనవేసుకుపోయిన సినిమానే ఓ మతం అయిపోయింది. ఓ చిన్న ప్రశ్న. సినిమా లేకపోతే మన జీవితం ఎలా ఉండేది?ఎంత ఆలోచించినా సమాధానం దొరికినట్టే దొరికి దొరక్కుండా పోతుంది.

20వ శతాబ్దం మనకు అందించిన అద్భుతం సినిమా. మొదట మాటల్లేని సినిమా. తర్వాత మాటలు నేర్చిన సినిమా. ఆటలు, పాటలు, రంగులు, హంగులు... ఇలా ఎన్నెన్ని హొయలో. ఊరూరా తిరుగుతూ మొదలైన సినిమా ఇప్పుడు ఉపగ్రహ ప్రసారం స్థాయికి ఎదిగింది. మన బంధువుల్ని గుర్తుపెట్టుకుంటాం. మన స్నేహితుల్ని గుర్తు పెట్టుకుంటాం. ప్రయాణంలో పరిచయస్తుల్ని,

ఓ చిన్న సాయం చేసినవాళ్లని కూడా గుర్తుపెట్టుకుంటాం. మరి.. ‘సినిమా’ అనే అద్భుతాన్ని మన
భారతీయులకు పరిచయం చేసినవాళ్లని ఒక్క క్షణమైనా గుర్తుపెట్టుకోవద్దా! సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఫాల్కేని స్మరించాలి. ఆయన తీసిన తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ను గుర్తు పెట్టుకోవాలి. మాటల్లేని ఆ సినిమా చెప్పే జ్ఞాపకాలు, కలిగించే అనుభూతులు ఎప్పటికీ సజీవంగా ఉండిపోవాలి. ‘100’ అనేది సినిమావాళ్లకు ఇష్టమైన సంఖ్య.

ఓ సినిమా వంద రోజులాడితేనే వాళ్లకది సంక్రాంతి, ఉగాది, దసరా కింద లెక్క. మరి మన భారతీయ తొలి మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ విడుదలై నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఇది నిజంగా మనకు పండగ రోజే. వందేళ్లంటే పండు ముదుసలి కింద లెక్క. అవసాన దశలో... అవశేష దిశలో ఉన్నట్టు లెక్క. కానీ సినిమా... సమాజాన్ని చిలికితే వచ్చిన సృజన అనే అమృతాన్ని తాగింది. అందుకే సినిమా ఎప్పటికీ నిత్య యవ్వనంగానే ఉంటుంది.

శతసహస్రాయుష్మాన్ భవ.

* * * ప్రపంచంలోనే తొలి సినిమా ప్రదర్శన 1895 డిసెంబర్ 28న ప్యారిస్‌లో లూమియర్ సోదరుల ఆధ్వర్యంలో జరిగింది.

* * * మనదేశంలో తొలి సినిమా ప్రదర్శన 1896 జూలై 7న బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో జరిగింది.

* * * ప్రపంచంలో తొలి మూకీ సినిమా ‘ది గ్రేట్ ట్రయిన్ రాబరీ’ (1903). దీనికి నిర్మాత ఎడ్విన్ పోర్టర్.


‘షూటింగ్’ అని ఎందుకంటామో తెలుసా? మొదటి కెమెరా తుపాకీ ఆకారంలో ఉండేది. దాంతో బొమ్మను చిత్రీకరించారు. తుపాకి షూట్ చేస్తుంది కనుక, బొమ్మ తీయడాన్ని ‘షూటింగ్’ అన్నారు.

ఫాల్కేకు పాదాభివందనం. అవును. మనమంతా దాదా సాహెబ్ ఫాల్కేకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఆయన ఈ సినిమా సౌధానికి శంకుస్థాపన చేసిన ముహూర్తం బావుంది. ఈ నేలను తడిపి, మట్టిని తడిమి, విత్తు వేసి, నీళ్లు పోసి ఈ సినిమా అనే కలల కల్పవృక్షం ఇంతెత్తున ఎదగడానికి దాదా చిందించిన స్వేదం, పడ్డ శ్రమకు ఖరీదు కట్టే షరాబు లేడు.

ఎక్కడో త్రయంబకేశ్వరంలో ఓ సంస్కృత పండితుల కుటుంబంలో పుట్టిన ఫాల్కే కత్తికి అన్ని వైపులా పదునే. ఆయనకు ఆర్కిటెక్చర్ తెలుసు. ఫొటోగ్రఫీ తెలుసు. పెయింటింగ్ తెలుసు. డ్రాయింగ్ తెలుసు. ఏదైనా అనుకుంటే సాధించే వరకూ నిద్రపోడు.

ఆ రోజుల్లో జనానికి నాటకాలు తప్ప వేరే వినోదం తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఫాల్కే ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ (1910) అనే సినిమా చూశాడు. తెరమీద కదిలే బొమ్మల్ని చూసి వావ్... అద్భుతం అనుకున్నాడు. మనమూ ఇలాంటి సినిమా ఎందుకు తీయకూడదనిపించింది. అనుకోవడమే ఆలస్యం... లండన్ వెళ్లాడు. వాల్టన్ స్టూడియోలో శిక్షణ పొందాడు. విలమ్స్‌న్ కెమెరాతో పాటు కొన్ని పరికరాలు కొనుక్కుని బొంబాయి వచ్చేశాడు. దాదర్ రోడ్‌లో స్టూడియో స్టార్ట్ చేశాడు. అందుకోసం ఇన్సూరెన్స్ పాలసీని తనఖా పెట్టాడు. అప్పట్లో విదేశాల నుంచి చాలా సినిమాలు దిగుమతి అయ్యేవి. అన్నీ క్రైస్తవ గాథలే. భారతీయ పురాణ కథతో సినిమా చేద్దామని ఫాల్కే నిశ్చయించుకున్నాడు. అలా ‘రాజా హరిశ్చంద్ర’ సినిమా మొదలుపెట్టాడు.

హీరో ఓకే. హీరోయిన్ వేషానికే ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. నృత్యాలు వచ్చినవాళ్లని, పాడడం తెలిసిన వాళ్లని యాక్ట్ చేయమని అడిగితే, ఛీ పొమ్మన్నారు. చివరకు దిక్కు తోచక వేశ్యల దగ్గరకు కూడా వెళ్లి అడిగాడు. ‘అమ్మో... సినిమానా? మా పరువేం కానూ’ అన్నారు వాళ్లు. అదీ... అప్పట్లో సినిమాకుండే ఇమేజ్. అదే ఇంకెవరైనా అయ్యుంటే నిరాశపడిపోయేవాళ్లు. ఫాల్కే మొండిఘటం. వెనక్కు తగ్గే రకం కాదు. నాటకాల్లో మగవాళ్లతో ఆడవేషాలు వేయించినట్లుగా, సినిమాల్లో కూడా వేయిస్తే పోలా అనుకున్నాడు. షూటింగ్ మొదలైంది. డెరైక్టర్ తనే. ప్రొడ్యూసర్ తనే. ఎడిటింగ్ తనే. లైటింగ్ అరేంజ్‌మెంట్స్ తనే. ఫాల్కే భార్య సరస్వతి తొమ్మిది మంది పిల్లల్ని చూసుకుంటూనే భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. లైట్లు పట్టుకునేది. ఆ లైట్లకు అడ్డుగా దుప్పట్లు పట్టుకునేది. యూనిట్ మొత్తానికీ భోజనం వండిపెట్టేది.

సినిమా అంతా రెడీ. అప్పట్లో రీళ్లకు హోల్స్ ఉండేవి కావు. ప్రొజెక్టర్‌లో రీలు తిరగాలంటే హోల్స్ ఉండాల్సిందే. డార్క్‌రూమ్‌లో కూర్చుని తనే హోల్స్ పెట్టేవాడు ఫాల్కే. సినిమా రిలీజై ఫాల్కే పంట పండింది. ఫోర్డు కారు, ఆస్తులు కొన్నాడు. వరుసపెట్టి సినిమాలు తీశాడు. 1914లో తీసిన ‘మోహినీ భస్మాసుర’లో తల్లీకూతుళ్లయిన దుర్గాభాయ్ కామత్, కమలతో యాక్ట్ చేయించాడు. దాంతో సినిమాల్లో స్త్రీలు నటించొచ్చనే ధైర్యం పెరిగింది. ఫాల్కే తన కెరీర్‌లో 52 మూకీ చిత్రాలు, 7 లఘు చిత్రాలు, 6 డాక్యుమెంటరీ లఘు చిత్రాలు , 3 డాక్యుమెంటరీలు తీశాడు. 1937లో ‘గంగావతరణ్’ అనే టాకీ తీశాడు. అది బాగా నష్టపరిచింది. ఆస్తులన్నీ హరించుకుపోయి అప్పులే మిగిలాయి. 1930ల తర్వాత మూకీలు అంతరించడంతో పాటు, పరిశ్రమలో వచ్చిన మార్పులు ఫాల్కేని కలవరపెట్టాయి.

దాంతో బొంబాయి వదిలిపెట్టి నాసిక్ వెళ్లిపోయాడు. భారతీయ సినిమాకు శాశ్వత చిరునామా ఇచ్చిన ఫాల్కే చివరాఖరి స్టేజ్ చాలా దారుణం. ఓ దశలో విషం తాగి చనిపోవాలనుకున్నాడు. కానీ విషం బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. పరిశ్రమా పట్టించుకోలేదు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఓ అనాధలాగానే చనిపోయాడు. ఇంతకన్నా విషాదం ఏముంటుంది? కేంద్రప్రభుత్వం ప్రతి ఏటా ఆయన పేరుతో ఓ సినీ ప్రముఖుడికి పురస్కారం ప్రదానం చేస్తోంది. దాంతోనే ఆయనకిచ్చే నివాళి పరిపూర్ణమా? భారతీయ సినిమాకు శతాబ్దపు ప్రయాణం ముగిసింది. మరో శతాబ్దంలోకి సగర్వంగా అడుగుపెడుతోంది. ఈ సందర్భంలోనైనా ఫాల్కేని స్మరించుకుందాం.

తొలి భారతీయ మూకీ 

ఈ వందేళ్లలో 1, 268 మూకీలు, సుమారు 50 వేల టాకీలు వచ్చాయి. వీటన్నింటికీ తొలి బీజం వేసింది... మార్గ నిర్దేశనం గావించింది ‘రాజా హరిశ్చంద్ర’. 40 నిమిషాలు ఉన్న ఈ సినిమా నిడివి 4 రీళ్లు మాత్రమే. 1913 ఏప్రిల్ 21న బొంబాయిలోని ఒలింపియా సినిమా హాలులో ప్రివ్యూ వేశారు. ఆ తర్వాత 12 రోజులకు మే 3, శనివారం నాడు బొంబాయిలోని కారొనేషన్ థియేటర్‌లో విడుదల చేశారు. ‘రాజా హరిశ్చంద్ర’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయిలో 23 రోజులు ప్రదర్శితమైంది. అటుపై దేశంలోని ఇతర ప్రాంతాలకూ వెళ్లింది.
నిజానికి దీనికన్నా ముందే నాలుగు సినిమా ప్రయత్నాలు జరిగాయి.
1. బెంగాల్‌కు చెందిన హీరాలాల్ సేన్ 1904లో ‘అలీబాబా’ పేరుతో ఓ సినిమా తీశాడట. అదెందుకో బయటకు రాలేదు.

2. రామచంద్ర గోపాల్ తోర్నే ‘భక్త పుండలీక్’ పేరుతో ఓ సినిమా తీశారు. 1912 మే 18న బొంబాయిలోని కారొనేషన్ సినిమా హాల్లో విడుదలైంది. ‘ది డెడ్‌మ్యాన్స్ చైల్డ్’ అనే విదేశీ చిత్రంతో కలిపి దీన్ని ప్రదర్శించారు. దీని నిడివి 22 నిమిషాలే ఉండడం, సాంకేతిక నిపుణులు చాలా మంది విదేశీయులు కావడం, ఫిలిం ప్రాసెసింగ్ లండన్‌లో జరగడం... ఈ కారణాల రీత్యా దీన్ని తొలి భారతీయ మూకీగా గుర్తించలేదు.

3. సావేదాదాగా పేరొందిన హరిశ్చంద్ర సఖారామ్ భట్వాడేకర్ దగ్గర కెమెరా కొని పటంకర్, దేవేకర్, కరండికర్ అనే ముగ్గురు కలిసి ‘సావిత్రి’ అనే సినిమా తీశారు. అయితే ఫిలిమ్ డెవలపింగ్‌లో తప్పిదం జరిగి, ఆ సినిమా కాస్తా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.

4. బొంబాయిలోని గెయిటీ థియేటర్‌లో 1912 నవంబర్ 2న ‘యాన్ ఎపిసోడ్ ఫ్రమ్ రామాయణ’ సినిమా విడుదలైంది. అయితే దీన్ని ‘సినిమా డెలక్సీ’ అనే విదేశీ సంస్థ నిర్మించడంతో తొలి మూకీ ఖ్యాతి మిస్సయిపోయింది.

తొలి కథానాయకుడు
‘రాజా హరిశ్చంద్ర’లో హరిశ్చందునిగా టైటిల్ రోల్ పోషించిన దత్తాత్రేయ దామోదర్ దబ్కే మన తొలి భారతీయ కథానాయకుడు. ఆ తర్వాత మరో మూడు, నాలుగు సినిమాల్లో నటించి దర్శకుడిగానూ, ఛాయాగ్రాహకునిగానూ మారారాయన. 1924లో వచ్చిన ‘రాజా హరిశ్చంద్ర’కు ఆయనే దర్శకుడు.
తొలి బాలనటుడు

ఫాల్కే పెద్ద కొడుకు భాల్‌చంద్ర ‘రాజా హరిశ్చంద్ర’లో లోహితుడు వేషం వేశాడు. అతనే మన తొలి భారతీయ బాలనటుడు.

తొలి బాలనటి
‘కాళీయ మర్దన్’(1919)లో శ్రీకృష్ణుడి వేషం వేసిన మందాకిని మన తొలి బాల నటి. అప్పుడామె వయసు అయిదేళ్లు. ఫాల్కే పెద్ద కూతురామె.

తొలి దర్శకురాలు
అర్దేషిర్ ఇరానీ, నానుభాయ్ దేశాయ్ వంటి వారి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఉర్దూ మహిళ హెచ్.హెచ్.బేగమ్ ఫాతిమా సుల్తాన్. పలు మూకీ చిత్రాల్లో నటించడమే కాకుండా, కొన్ని సినిమాలు నిర్మించారు.
1926లో ‘బుల్ బులే పరిస్తాన్’ అనే మూకీ సినిమాని తొలిసారిగా డెరైక్ట్ చేశారామె. మూకీ స్టార్స్‌గా వెలుగొందిన జుబేదా, సుల్తానా, షెహజాది ఆమె కూతుళ్లే.

తొలి కథానాయిక(లు)


చరిత్రలో ఇదొక తమాషా అంశం. మన తొలి కథానాయిక స్త్రీ కాదు. పదహారణాల పురుషుడు. అవును మరి. అప్పట్లో స్త్రీలు సినిమాల్లో నటించడమంటే ఓ అపచారం కింద లెక్క. పడుపు వృత్తి చేసుకునేవాళ్లు సైతం సినిమాల్లో నటించడానికి భయపడేవారు. అప్పట్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు పురుషులే ధరించేవారు. అదే పద్ధతిని సినిమాలోనూ అనుసరించారు ఫాల్కే. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్రకు ఓ నాజూకైన కుర్రాడు కావాలనుకుని ఫాల్కే తెగ అన్వేషిస్తే అన్నా సాలుంకే కనిపించాడు.

ఇతగాడు బొంబాయి గ్రాంట్ రోడ్డులోని ఓ హోటల్‌లో వంటవాడు. అతన్ని 15 రూపాయల నెల జీతానికి ఒప్పించి ఈ పాత్ర చేయించారు. తర్వాత అన్నా సాలుంకే చాలా మూకీల్లో యాక్ట్ చేశాడు. మరి కథానాయికగా చేసిన తొలి స్త్రీ ఎవరో తెలుసుకోవాలి కదా! ఆమె పేరు కమల. ఫాల్కే తీసిన రెండో మూవీ ‘భస్మాసుర మోహిని’(1913)లో ఆమే కథానాయిక.

తొలి బాక్సాఫీస్ హిట్
హిట్, సూపర్‌హిట్, బాక్సాఫీస్ హిట్, బ్లాక్ బస్టర్... అంటూ మనం సినిమా గురించి చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు మన దేశంలో తొలి బాక్సాఫీస్ హిట్ ఏదో తెలుసా? 1917లో వచ్చిన ‘లంకా దహన్’. దీని సృష్టికర్త కూడా ఫాల్కేనే. ‘రాజా హరిశ్చంద్ర’ తర్వాత ఫాల్కే తీసిన సినిమా ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు కష్టాలు, ముడి ఫిలిమ్ కొరత ఇత్యాది కారణాల రీత్యా నాలుగేళ్లు భారతీయ సినిమా ముందుకు కదల్లేదు. మళ్లీ ‘లంకా దహన్’తో అందరిలోనూ ఊపొచ్చింది. ఈ సినిమా టిక్కెట్ల కోసం జనం విపరీతంగా ఎగబడేవారు.

ఈ రద్దీ తట్టుకోలేక బొంబాయిలోని ‘వెస్ట్ ఎండ్’ (తర్వాత ‘నాజ్’గా మారింది) థియేటర్లో ఉదయం నుంచి రాత్రి వరకూ వరుసగా షోలు వేస్తూనే ఉండేవారు. ఆ రోజుల్లోనే పది రోజులకు 32 వేల రూపాయలు వసూలు చేసింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు ఎడ్లబళ్లు కట్టుకుని మరీ వచ్చేవారు. థియేటర్ దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టాల్సి వచ్చింది. ‘రాజా హరిశ్చంద్ర’లో హీరోయిన్‌గా చేసిన సాలుంకే ఇందులో సీతగానూ, రాముడిగానూ నటించడం విశేషం. ఈ లెక్కన మన తొలి ద్విపాత్రాభినయ నటుడు కూడా సాలుంకేనే అన్నమాట.

తొలి ఛాయాగ్రాహకుడు
‘రాజా హరిశ్చంద్ర’కు ఛాయాగ్రాహణం చేసిన ట్రింబాక్ బి.టెలాంగ్ మన తొలి కెమెరామేన్. ఆ తర్వాత ఆయన సత్యవాది రాజా హరిశ్చంద్ర, లంకా దహన్(1917) తదితర చిత్రాలకు పనిచేశారు.

తొలి భారతీయ టాకీ
మాటలు నేర్చిన మన తొలి సినిమా ‘ఆలం ఆరా’. ఖాన్ బహదూర్ అర్దేషిర్ ఇరానీ దీనికి కర్త, కర్మ, క్రియ. 1931 మార్చి 14న బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో తొలి ప్రదర్శన జరిగింది. ఆ చిత్ర ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుని గోతాముల్లోకి ఎక్కించి పోలీసుల కాపలాతో ఇరానీ ఇంటికి తీసుకెళ్లినట్టు చెబుతారు. పృథ్వీరాజ్‌కపూర్, జుబేదా, మాస్టర్ విఠల్ ఇందులో నటించారు.


Friday, April 26, 2013

సృజన కొరవడి .. మూస ఒరవడి..

'వందేళ్ల భారతీయ సినిమా'

ప్రపంచ సినిమా రంగంలో చలన చిత్ర నిర్మాణంలో భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానం. వినోదంతోపాటు, వాణిజ్య విలువలకు భారతీయ చలన చిత్ర నిర్మాణంలో కొదువేమిలేదు. అందుకే భారతీయ చిత్రాలంటే ప్రపంచ సినిమా రంగానికి గొప్ప ఆదరణ పెరుగుతోంది. ఇటీవల కాలంలో భారతీయ నేపథ్యానికి హాలీవుడ్ కూడా ఆకర్షణకు లోనవుతోంది. అందుకు తాజా ఉదహరణ లైఫ్ ఆఫ్ పై చిత్రంగా చెప్పుకోవచ్చు. అలాంటి చిత్ర పరిశ్రమ వందేళ్ల పండుగను జరుపుకోవడానికి సిద్ధమైంది. గత వందేళ్లలో అతిసామన్యమైన వ్యక్తులు కూడా అద్బుతమైన ప్రతిభాపాటవాలతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు. అందులో సత్యజిత్ రే, రాజ్ కపూర్, బిమల్ రాయ్, గురుదత్, శ్యామ్ బెనెగల్, బల్ రాజ్ సహానీ, ఆదూర్ గోపాలకృష్ణన్, శేఖర్ కపూర్ లను ప్రముఖంగా ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఈ సందర్భంగా వందేళ్ల సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజులపాటు సాగే చిత్రోత్సవాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించించారు.

1929 సంవత్సరంలో రూపొందించిన మూకీ చిత్రం ' ఏ త్రో ది డైస్' చిత్రాన్ని ఆరంభ చిత్రంగా ప్రదర్శించారు. మహాభారతం నేపథ్యంగా సాగే 'ఏ త్రో ది డైస్' చిత్రానికి జర్మనీకి చెందిన ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వం వహించారు. నటుడు, నిర్మాత హిమాంశురాయ్ తో కలిసి 1926 నుంచి 1939 సంవత్సరాల మధ్య కాలంలో ఓస్టెన్ 19 చిత్రాలను రూపోందించారు. ఈ చిత్ర ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆక‌ర్షించింది.

వందేళ్ల భారతీయ సినిమాలో చరిత్రలో నిలిచిన షోలే చిత్రంతోపాటు నాటి బిమల్ రాయ్, గురుదత్, శ్యామ్ బెనెగల్, ఆదూర్ గోపాలకృష్ణన్.. నేటి అనురాగ్ కశ్యప్, దివాకర్ బెనర్జీ, జోయా ఆఖ్తర్, కరణ్ జోహార్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. అనురాగ్ కశ్యప్ 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, ఒనీర్ చిత్రం మై బ్రదర్ నిఖిల్, పంజాబీ డైరెక్టర్ గురువిందర్ సింగ్ చిత్రం 'అనే గోరే ద దాన్', నందితాదాస్ దర్శకత్వం వహించిన 'ఫిరాఖ్' చిత్రాలను కూడా ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఇంకా బల్ రాజ్ సహాని, దేవ్ ఆనంద్, షమ్మి కపూర్, రాజేశ్ ఖన్నా నటించిన చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రమేశ్ సిప్పి, విశాల్ భరద్వాజ్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, నాగార్జునలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. తన 25 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని.. వందేళ్ల సినిమాలో తాను భాగస్వామినవ్వడం చాలా గొప్పగా ఉందని నాగార్జున అన్నారు. భారతీయ సినిమాలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య హద్దులు చెరిగిపోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

దర్శకులు సిప్పీ, భరద్వాజ్, కునాల్ కోహ్లీ, జానూ బారువా, ఏక్తా కపూర్, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాలతో కూడాని ప్యానెల్ వందేళ్ల సినిమాపై చర్చించనున్నారు. ఏప్రిల్ 30 తేదిన దాదా సాహెబ్ ఫాల్కే పై అమిర్ రాజా హుస్సేన్ రూపొందించిన ఓ ప్రత్యేక ప్రదర్శనతో చిత్రోత్సవం ముగుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా సాధించిన విజయాల ద్వారా లభించిన గుర్తింపు రానున్న రోజుల్లో రెట్టింపవుతుందని పలువురు వ్యాఖ్యానించారు.

Friday, April 5, 2013

3 పయోనీర్స్ 3 ఫిల్స్


ఇప్పుడంటే సినిమా తీయడానికి ఎన్నెన్నో సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. కానీ మనదేశంలో సినిమా ఆరంభమైన తొలినాళ్లలో సినిమా తీయడమంటే ప్రొజెక్టర్ ఆన్ చేసినంత సులభం కాదు. మన నేల మీద సినిమా విత్తనాన్ని నాటే కృషిలో భాగంగా తొలితరం దర్శకులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ మాటకొస్తే అప్పట్లో సినిమా తీయడం కోసం వారు పడ్డకష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఏ సినిమా కథకూ తీసిపోవు. ఈ ఎలిమెంట్సే కొంతమంది నవతరం దర్శకులను ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. ఆ ఆలోచనల్లోంచే భారతీయ సినిమాకి తొలి పాఠాలు నేర్పిన దర్శకుల జీవిత కథలే సినిమాలుగా తెరకెక్కాయి. అలా భారతీయ.. మలయాళ.. తెలుగు సినీ పితామహుల జీవనగాథలే ఇతివృత్తంగా వచ్చిన మూడు సినిమాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భారతీయ సినిమా వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ చారివూతక సందర్భంలో ఈ మూడు సినిమాల అవలోకనం చేయడమంటే ఆ ముగ్గురు పయోనీర్స్‌నీ, వారి కృషినీ మరొక్కసారి గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందడమే!

క్రీ.శ. 1913.. సరిగ్గా వందేళ్ల కిందట..
భారతదేశ జనాభా దాదాపు మూడుకోట్లు. అన్ని కోట్ల మందిలో సినిమా గురించి తెలిసిన వాళ్లుకాదు, అసలు సినిమాను చూసినవాళ్లే వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది. వాళ్లంతా తెర మీద ఏదో వింత, కదిలే చిత్రాల మాయలాగే చూశారు. కానీ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాల్లో పుట్టి పెరిగిన ఒకరిద్దరిని మాత్రం సినిమా విపరీతంగా ఆకట్టుకుంది, ఆలోచింపచేసింది. అబ్బుర పరిచింది. వారిలో అలజడి రేపింది. తాము సైతం సినిమాలను సృష్టించాలనే కోరికను పుట్టించింది. ముంబై, కేరళ, తెలుగు ప్రాంతంలో పుట్టిన ఆ ముగ్గురు వ్యక్తులు తమ సర్వశక్తులనూ, సర్వస్వాన్నీ త్యాగం చేసి అయినా సినిమాతీసి చూపించాలనే ప్రగాఢకాంక్షను బలంగా రగిలించింది. అప్పట్లో వారికే కాదు భారతీయుపూవరికీ కనీసం కెమెరా అంటే కూడా తెలియదు. సినిమా ఎలా తీస్తారో.. ఫిల్మ్ ఎక్కడ, ఎలా దొరుకుతుందో తెలీదు. అసలు సినిమా కళలో ఇప్పుడు మనం అనుకుంటున్న 24 క్రాఫ్ట్స్‌లో ఒక్క క్రాఫ్ట్ గురించి కూడా తెలియదు. టెక్నిక్కు అంతకన్నా తెలియదు. వారికి తెల్సిందల్లా ఒక్కటే.. సినిమా తీయాలని! భారతీయులకు భారతీయ సినిమా చూపించాలన్నదే వారి స్వప్నం. ఆ సంకల్పబలమే వెండితెరమీద తొలిసారిగా మనదైన కదిలే బొమ్మల అద్భుతాన్ని చూపించింది! ‘రాజా హరిశ్చంవూద’గా మరాఠీలో, ‘విగధకుమారన్’గా మలయాళంలో, ‘భీష్మవూపతిజ్ఞ’గా తెలుగులో బ్రిటీష్‌వారికి సవాలుగా మనదైన సినిమా ఆవిర్భవించింది. ఎవరి స్వప్నం, సంకల్పం, విజన్, మిషన్ వల్ల భారతీయ సినిమా మొగ్గ తొడిగిందో ఆ మహనీయుల జీవన గాథలనే ఇప్పుడు చలనచివూతాలుగా తెరకెక్కించింది. దాదా ఫాల్కే, జేసీ డానియల్, రఘుపతి వెంకయ్య కన్న వందేళ్ల స్పప్నానికి నీరాజనం పట్టింది.

హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ (మరాఠీ - 2009)
భారతీయ సినీ పితామహుడు ధొండీరాజ్ గోవింద్ ఫాల్కే జీవనగాథ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. 2009లో విడుదలైన ఈ సినిమాకు బాపు వాత్వే రాసిన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అనే గ్రంథం ఆధారం. ప్రఖ్యాత మరాఠీ రంగస్థల కళాకారుడు, దర్శకుడు, రచయిత, నటుడు అయిన పరేష్‌మొకాషీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ‘ఉత్తమ మరాఠీ’ చిత్రంగా పురస్కారాన్ని పొందడమే కాక ఆస్కార్ అవార్డుకు భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. మరాఠీ భాషా చిత్రాల్లో శ్వాస్ (2004) తర్వాత ఈ గౌరవాన్ని సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే 1913 నాటి కాలాన్ని, వాతావరణాన్ని తెరమీద పునరావిష్కరించిన ఈ బయోక్షిగాఫికల్ పీరియడ్ ఫిల్మ్‌లో దాదా ఫాల్కేగా నందుమాధవ్, సరస్వతి ఫాల్కేగా విభావరీ దేశ్‌పాండే అసమాన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా నిర్మాణం కోసం పరేష్ మొకాషీ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. 1913 దాదా ఫాల్కే తొలి సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, శతాబ్దం తర్వాత దాదా ఫాల్కే మీద తీసిన ఈ సినిమా కోసం పరేష్ కూడా అన్నే కష్టాలు పడ్డాడు. దాదా ఫాల్కే జీవిత చరిత్ర, తొలి సినిమా నిర్మాణ సన్నాహాల గురించిన వాస్తవాలు, చారివూతక ఆధారాల కోసం ఆయన పుణేలోని ‘నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్’లో దాదాపు రెండేళ్ల పాటు పరిశోధన చేశాడు. ఎన్నో ఊళ్లు తిరిగాడు. ఫాల్కే వారసులను కలుసుకున్నాడు. కథను తయారు చేసుకున్నాక ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్‌తో కలిసి 1913 కాలంనాటి ముంబై, మహారాష్ట్ర తాలూకు సెట్స్‌ను, భవనాలను రీక్రియేట్ చేశాడు. డబ్బులు సరిపోక ఒక దశలో ఆయన తన సొంత ఇంటిని కుదవపెట్టి మరీ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయం అయింది.

తెరపై కథేంటి?
‘హరిశ్చంవూదాచి ఫ్యాక్టరీ’ సినిమా.. దాదా ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాని తీసే క్రమంలో ఎదురైన సంఘటనల సమాహారమే! ఇది దాదా ఫాల్కే కుటుంబం, భార్య, పిల్లలు, మధ్య తరగతి జీవన విధానం నుంచి మొదలకొని ఆయనకు చలనచివూతాలపై మోజు పెరగడం, చివరకి సినిమా తీయడం వరకు జరిగే జర్నీని ఎంతో సహజంగా, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించే కాస్ట్యూమ్ - సెట్స్ - యాంబియెన్స్‌తో తెరకెక్కింది. మొదట్లో ఫాల్కే వీధుల్లో మ్యాజిక్‌లు చేసే మెజీషియన్‌గా ఉండడం, ఆ సమయంలో తన పేరుని ప్రొఫెసర్ ‘కెల్ఫా’ (ఫాల్కేలోని అక్షరాలను తిరగేసి అలా పెట్టుకున్నాడు) అని మార్చుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉండడం.. ఒకరోజు ‘పిక్చర్ ప్యాలెస్’ అనే గుడారంలోని సినిమా హాల్‌లోకి వెళ్లి సినిమా చూడడం.. తెరపై కదిలే బొమ్మలను చూసి ఆశ్చర్యపడి, ఆ తర్వాత వరుసగా అదే సినిమాని చూడడం... కదిలే బొమ్మలు ఎక్కడినుంచి వస్తున్నాయో తెల్సుకునే ఉత్సుకతతో ప్రొజెక్టర్ ఆపరేటర్‌ని కల్సుకొని వివరాలు తెల్సుకోవడం... బ్రిటీష్ లైబ్రరీలో ‘బయోస్కోప్’ పత్రికను చదివి సినిమా గురించిన మరిన్ని పుస్తకాలను కొనడం... రీళ్లు కొనడం.. రోజుల తరబడి గుడ్డి దీపపు వెలుగులో ఫిల్మ్ రీళ్లను చూస్తూ గడపడం.... దానికోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేయడం... నిరంతరం సినిమా తీసే ఫ్రేమింగ్‌ని ఊహించుకుంటూ పరధ్యానంగా గడపడం.. చివరకి పుణేలోని మెంటల్ హాస్పిటల్‌లో చేరడం... బయటకు వచ్చాక భార్యను ఒప్పించి తన ఇన్సూన్స్ పాలసీలను కుదువపెటి,్ట పదివేల రూపాయలు తీసుకుని లండన్ వెళ్లడం... అక్కడ అతి కష్టంమీద ఓ సినిమాకి అసిస్టెంట్‌గా పని సంపాదించడం, కెమెరాను, నెగెటివ్‌లను ప్రాసెస్ చేసే కెమికల్స్‌ని కొని ఇండియాకు తిరిగిరావడం.. కథను సిద్ధం చేసుకొని నటీనటుల ఎంపికకోసం నానాతిప్పలు పడడం... చంద్రమతి పాత్రంలో స్త్రీ నటికోసం వేశ్యవాటికల వెంట తిరగడం, ఆఖరుకు మగనటుడు సాటింకే చేతే స్త్రీ పాత్ర వేయించడం.. కథలో చంద్రమతి మెడ నరికే సీన్ చిత్రీకరిస్తుంటే అదేదో హత్యాయత్నంగా భావించి స్థానిక పోలీసులు మొత్తం టీమ్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లోపెట్టడం.. తీరా సినిమా ఎడిటింగ్‌ని పూర్తి చేసి కరొనేషన్ థియేటర్‌లో రిలీజ్‌చేస్తే పదిరోజుల వరకూ ప్రేక్షకుపూవరూ రాకపోవడం... ఆ తర్వాత ‘మౌత్‌టాక్’తో జనాలు తండోపతండాలుగా రావడం... దాదా ఫాల్కే కన్న స్వప్నం.. సంకల్పం సత్ఫలితాన్నివ్వడం.. ఈ సినిమా కథ!ఇక ఈ సినిమా టైటిల్‌గా ‘హరిశ్‌చంవూదాచి ఫ్యాక్టరీ’ అని పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన వాస్తవం ఉంది. అప్పట్లో ఈ సినిమాలో నటించడానికి, పనిచేయడానికి ఒప్పుకున్న నటులు, వ్యక్తులు ఎవరైనా మీరేం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలి?అని దాదా ఫాల్కేని అడిగారట. అప్పుడు ఫాల్కే తీస్తున్న సినిమా హరిశ్చంద్ర కనుక ‘హరిశ్చంద్ర ఫ్యాక్టరీ’లో పనిచేస్తున్నామని చెప్పండి అని అన్నాడట. ఈ గాథ ఆధారంగా పరేష్ మొకాషీ ఈ సినిమాకి ఆ టైటిల్‌ని పెట్టాడు.

సెల్యులాయిడ్ (2012 మలయాళం)
మలయాళ సినీ పితామహుడు జేసీ డానియల్ జీవనగాథ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. ప్రముఖ మలయాళ సినీ చరివూతకారుడు చెలంగట్ గోపాలకృష్ణన్ రాసిన ‘లైఫ్ ఆఫ్ జేసీ డానియల్’ అనే గ్రంథం, ప్రముఖ రచయిత వినూ అబ్రహామ్ రాసిన ‘నష్ట నాయక’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఆ లెక్కన ఈ సినిమా బయోపిక్‌గానే కాక నవలాచివూతంగా, పీరియడ్ ఫిల్మ్‌గా కూడా ప్రత్యేకతను సాధించింది. డానియల్‌గా హీరో పృథ్విరాజ్, ఆయన భార్య జానెట్‌గా మమతామోహన్‌దాస్, రోజీగా చాందినీ జీవించిన ఈ సినిమాకి వేణు అందించిన సినిమాటోక్షిగఫీ ప్లస్ అయింది. ఈ సినిమాను చూస్తుంటే మన తెలుగు సినిమాలు (యమదొంగ, కేడీ వంటివి)లో నటించిన మమతామోహన్‌దాస్ ఈమె ఒకరేనా అనే అనుమానం వేస్తుంది. అదేం చిత్రమో, అద్భుతమైన నటీమణులను కూడా తెలుగులోకి తెచ్చి వాళ్ల చేత నటన తప్ప మిగతావన్నీ చేయించే ఘనత తెలుగు సినిమాలకే ఉందనే బాధ కలుగుతుంది కూడా!‘సెల్యులాయిడ్’ సినిమా జాతీయ అవార్డులలో ఉత్తమ మలయాళ చిత్రంగానే కాక, కేరళరాష్ట్ర ప్రభుత్వ అవార్డులలో ఏడింటిని గెల్చుకుంది. రూ.3.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ స్వప్నాన్ని సాకారం చేసిన దర్శకుడుగా కమల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో ప్రశంసలను పొందాడు. కమాలుద్దీన్ మహ్మద్ మజీద్ అనే పూర్తి పేరును కమల్‌గా మార్చుకున్న ఈ దర్శకుడికి సినీరంగంలో 32 ఏళ్ల అనుభవం ఉంది. 1981లో ‘త్రాసమ్’ సినిమాకి కథారచయితగా మొదలైన ఆయన ప్రస్థానం 1986లో దర్శకుడిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత కమల్ దర్శకత్వంలో 43కు పైగా సినిమాలు వచ్చాయి. పెరుమళక్కలమ్ (2004), కమత్త పళ్లికల్ (2006) వంటి సినిమాలకు జాతీయ ఉత్తమచిత్రం అవార్డులను సైతం సాధించిన కమల్ మలయాళ చిత్ర పరిక్షిశమలో క్రిటికల్ సక్సెస్‌ను, కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన అతి కొద్దిమంది దర్శకులలో ఒకడిగా పేరు సంపాదించాడు. ఈ సినిమాతో కమల్ ‘డానియల్’ జీవనగాథకు సమాంతరంగానే మలయాళ సినిమాల తొలికథనాయిక పీకే రోజీ జీవితాన్ని కూడా ఆవిష్కరించి, తొలి మలయాళ సినిమా ‘విగధకుమరన్’ చిత్రీకరించిన కాలపు ఎన్నెన్నో వాస్తవాలను, విశేషాలను, హృదయానికి హత్తుకునే సీన్లతో చూపించాడు. సినీరంగ నేపథ్యంగా మనిషి ఉత్థాన పతనాలను సామాజిక కోణంలోంచి తెరకెక్కించిన తీరు హ్యాట్సాఫ్ అనిపిస్తాయి.

తెరపై కథేంటి?
‘సెల్యులాయిడ్’ సినిమా ప్రధానంగా జేసీ డానియల్ (జోసెఫ్ చెల్లయ్య డానియల్ నాడార్ అతని పూర్తిపేరు) జీవన గాథ. డానియల్ జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరించిన సినిమా ఇది. ట్రావెంకోర్‌వూపాంతంలోని లాటిన్ క్రిస్టియన్ నాడార్ కుటుంబంలో 1900 సంవత్సరంలో జన్మించాడు డానియల్. చిన్నప్పట్నించే కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌ను ఇష్టపడే డానియల్ తను స్వయంగా ‘చెలంబాటమ్’ అనే మార్షల్ కళలో నిపుణుడు కూడా. ‘ఇండియన్ ఆర్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అండ్ స్వోర్డ్ ప్లే’ అనే పుస్తకాన్ని ఈ యుద్ధకళపై రాసిన డానియల్ ఈ కళని సినిమా ద్వారా పాపులర్ చేయాలనుకునే ఆలోచనలోంచే సినిమాపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. దానికోసం డానియల్ చెన్నై వెళ్లి అక్కడి స్టూడియోలలో కనీసం ప్రవేశం కూడా దొరకక వెనుదిరగడం, చివరికి ముంబై వెళ్లి అక్కడి ఫిల్మ్ స్టూడియోల్లో ‘కేరళ టీచర్’గా ఎంట్రీ ఇచ్చుకుని, సినిమా మేకింగ్, షూటింగ్‌కి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడం... ఆ క్రమంలోనే భారతీయ సినీ పితామహుడు దాదా ఫాల్కేని కల్సుకోవడం, కేరళకు తిరిగొచ్చి ‘ట్రా నేషనల్ పిక్చర్స్’ పేరిట స్టూడియోను నెలకొల్పి సినిమాని మొదపూట్టాడు. దానికోసం తీసుకున్న భూమినంతా అమ్మేసి రూ.4లక్షలను పెట్టుబడిగా పెట్టడం.. ‘విగధకుమరన్’ పేరిట కథను తనే స్వయంగా రాసుకుని అందులో తానే నటించడం, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్ కూడా తానే చేసుకోవడం.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ మహిళా కూలీని రోజూవారి వేతనానికి కుదుర్చుకోవడం.. తీరా సినిమా పూర్తిచేసి క్యాపిటల్ థియేటర్‌లో ప్రదర్శించేసరికి హీరోయిన్ పాత్ర విషయమై కొన్ని సామాజిక వర్గాల ప్రజలు నిరసనలు తెలియజేసి, థియేటర్‌పై దాడులు చేయడం... చివరికి నష్టాలపాలై జీవిత చరమాంకంలో దుర్భర పేదరికంతో మరణించడం... ఈ సినిమా కథ!

చిత్రీకరణ విశేషాలు...
ఈ సెల్యులాయిడ్ సినిమా పేరుకు తగినట్లే ఓ సెల్యులాయిడ్ హ్యుమన్ డాక్యుమెంట్ అని చెప్పాలి. 1920 కాలంనాటి పీరియడ్ లుక్‌ని, వస్త్రాలు, సెట్టింగ్స్, ఆఖరికి ఆనాటి గుర్రపు బగ్గీలను సైతం ‘రీక్షికియేట్’ చేయడమేకాక కొన్ని పోర్షన్‌లను బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ఇక ‘ఎనుందోడి’ అనే పాటలో సినీతారగా అవకాశం వచ్చినప్పటి సందర్భంలో రోజీ పాత్రధారి, పగిలిన అద్దంముక్కలో తన ముఖాన్ని చూసుకుంటూ పరవశించే తన్మయత్వం ఎంతో సహజంగా అనిపిస్తుంది. అలాగే ‘క బ్యాక్‌క్షిగౌండ్ సాంగ్‌లో డానియల్ ట్రావెంకోర్ ఫిల్మ్‌కంపెనీ స్థాపన, సినిమా షూటింగ్ ఆరంభం, ‘యాక్షన్’ అని చెప్పే మాంటేజ్ సీన్లతో కూడి తొలిసినిమా ఫ్లేవర్‌ను అందిస్తుంది. ఇక సినిమా తొలి ప్రదర్శన సందర్భంలో చిత్ర నాయిక రోజీ నిమ్నజాతి స్త్రీ అనే సాకుతో, సినిమాకు వచ్చిన ప్రేక్షకులు అందరూ తెరపైకి రాళ్లువేయడం... ఆ తర్వాత రోజీ ఉండే గుడిసెకి నిప్పంటించడం, ఆ నిప్పుల కీలల్లోంచి.. దుఃఖంతో, భయవిహ్వలత్వంతో రోజీ పారిపోయే సీన్ మన కళ్లని చెమరుస్తాయి. సినిమా కల పరుగెత్తిన డానియల్ జీవితం, ‘విగధకుమరన్’ సినిమాషూటింగ్, రోజీ (రోషియమ్మ అసలు పేరు)జీవితం అనే ట్రయాంగిల్‌తో నడిచే ఈ సెల్యులాయిడ్.. సామాజిక నియంవూతణలు, కులపరమైన వైషమ్యాల ఉక్కుపాదాల కింద బద్ధలైపోయిన స్వప్నాన్ని, ఏ గుర్తింపునకూ నోచుకోక వివక్షకు గురైన మానస సంకల్పాన్ని తెరకెక్కించిన ఈ సినిమా సామాజిక, మానవీయ అంశాపూన్నింటినో సున్నితంగా, ఆలోచనాస్ఫోరకంగా లేవనెత్తి సినిమాకుండే ప్రయోజనాన్ని సాధించింది.

రఘుపతి వెంకయ్య (2012 - తెలుగు)
తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య జీవన చిత్రమే ఈ సినిమా. రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా పూర్తి చారిత్రక పరిశోధన, సహజ సన్నివేశాల చిత్రణతో తెరకెక్కించిన ఓ నిజాయితీ ప్రయత్నం ఈ సినిమా. ప్రస్తుత తెలుగు సినిమాలు అనగానే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ అనే ముద్ర ఉంది. ఆ ముద్రలోంచి బయటపడి జాతీయ ప్రమాణాలతో పీరియడ్ బయోపిక్ సినిమాగా తీశారు దీన్ని. రఘుపతి వెంకయ్యగా సీనియర్ నటుడు నరేష్, ఆయన భార్యగా వాహిని నటించిన ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ మొదలు ఇంటి లోగిళ్లు, కెమెరాలు, పరిసరాల వరకు అన్నీ 1920 కాలంనాటి వాస్తుశిల్పం, సంప్రదాయం కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా, ఆర్ట్ డైరెక్టర్స్ రాము, సతీష్‌ల నేతృత్వంలో వేసిన సెట్స్.. ఆ కాలంనాటి మచిలీ పట్నం, అప్పటి ఇళ్ల శైలిని తెరపై పునర్ సృష్టించాడు. కిషన్‌సాగర్ సినిమాటోగ్రఫీ, రాజ్ అందించిన మ్యూజిక్ పీరియడ్ యాంబియెన్స్‌ను బాగా ఆవిష్కరించాయి. ఇక తెలుగు సినిమాకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్యపై సినిమా తీయాలనే స్వప్నం, దానికి తగిన సంకల్పంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి ముందుకెళ్లిన దర్శకుడు బాబ్జీ! ప్రఖ్యాత ప్రజా నాట్యమండలి సంస్థ నుంచి వచ్చిన నిబద్ధత ఉన్న కళాకారుడు ఈయన. ఈ సినిమాని తన ‘పీపుల్స్ థియేటర్’ పతాకంపై నిర్మించి జాతీయ స్థాయిలో తొలి సినీ స్రష్టల బయోపిక్ సినిమాల సరసన రఘుపతి వెంకయ్య గాథను నిలిపాడు.

తెరపై కథేంటి?
రఘుపతి వెంకయ్య సినిమాని స్క్రీన్ ప్లేపరంగానూ, సన్నివేశాల పరంగానూ ఎంతో నవ్యతతో అల్లుకొన్నాడు. రఘుపతి వెంకయ్య వృద్ధాప్యంలోని దశతో ఓపెన్ అయ్యే సినిమా. వెంకయ్య తన ప్రాభవాన్ని, ఆస్తులను అన్నీ పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో పేదరికంలో మగ్గుతూ, ఒంటరిగా ఉండి తన ఆత్మకథను రాయడం మొదపూట్టడంతో సినిమా ఆరంభం అవుతుంది. అయితే రఘుపతి వెంకయ్య గురించి, ఆయన భార్య, కుటుంబం గురించి పెద్దగా వివరాలేవీ లభించనందువల్ల ఈ సినిమాకుగాను దర్శకుడు కొంత క్రియేటివ్ లిబర్టీని తీసుకుని సన్నివేశాలను అల్లుకున్నాడు. అయితే అవేవీ ఆనాటి కాలమాన, సామాజిక పరిస్థితులను అతిక్షికమించకుండా సహజంగా ఉండేలా చూసుకోవడంలో జాగ్రత్త వహించాడు. అలా ఫ్యాక్ట్‌నీ, ఫిక్షన్‌నీ కలగలిపి సాధ్యమైనంత వాస్తవికతతో తెరకెక్కించాడు. ఈ సినిమాలో రఘుపతి వెంకయ్య జీవన ఘట్టాలలో ఆయనను దేశభక్తి ప్రేరేపితుడిగా ఆనాటి సంఘసంస్కర్తగా, తన సోదరుడు అయిన ‘రఘుపతి వెంకటరత్నం నాయుడు’ ప్రభావం ఉన్న యువకుడిగా బ్రిటీష్‌వారి సాంస్కృతిక, సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా భారతీయులు సైతం సినిమా తీసి నిరూపించగలరు అనే భావనను నిజం చేసిన జాతీయవాదిగా ఆవిష్కరించాడు. అలాగే తన కొడుకు ఆర్.ఎస్‌. ప్రకాశ్‌ని సినిమాల్లో శిక్షణ కోసం విదేశాలకు పంపించే క్రమంలో వచ్చే సీన్‌లు, విదేశాల నుంచి తిరిగి వచ్చి కొడుకు సినిమా తీస్తున్నప్పుడు కరెంట్ పోయి షూటింగ్‌కు అంతరాయం కలిగినప్పుడు.. రఘుపతి వెంకయ్య ఆ షూటింగ్ స్పాట్‌లో మేకప్ రూమ్‌లోని నిలువుటద్దాలను సూర్యకిరణాలతో పరివర్తనం చెందించి కావలసిన లైట్ ఎఫెక్ట్‌ని సృష్టించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.

కొసమెరుపు :
భారతీయ, మలయాళ, తెలుగు సినీపితామహులైన దాదాఫాల్కే, డానియల్, వెంకయ్య ముగ్గురూ అవసాన దశలో సమకాలీన సమాజంలో కనీస గుర్తింపు కూడా నోచుకోలేకపోయారు. స్వప్నాన్ని, సంకల్పాన్ని మాత్రమే మదినిండా నింపుకొని సినీరంగంలో తొలిబాటలు వేసిన మార్గదర్శకులు వీరు. జయహో భారతీయ సినిమా!

Thursday, October 18, 2012

తొలి తెలుగు సంపూర్ణ టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931) లోని పద్యాలు, గేయాలు


వింతాయెన్ వినన్ సంతస మాయెనుగా దేవేంద్ర
సంతస మాయెనుగా సురనాథ
అడగెను దేవారి బెడిదపు దపమున
గూరివడి ప్రాణం బెడబాసి
మనసున నానందంబును మిగులుగా
నీవొంద దనుజుండు మృతిజెందె !

( తెలుగులో రచించిన మొదటి పాట.. )

చిత్రం : భక్త ప్రహ్లాద (1931)
రచన : చందాల కేశవదాసు (తొలి తెలుగు సినీ కవి)
సంగీతం : హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గానం : సురభి కమలాబాయి


******************************

పరితాప భారంబు భరియింప తరమా
కటకటనే విధి గడువంగ జాలుదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా...
పరితాప భారంబు భరియింప తరమా

ఈ విషము నేనెటులను
తనయుని త్రావింపగలను?
ధర్మము కాపాడుదునా?
తనయుని కావగగలనా?...

పరితాప భారంబు భరియింప తరమా
కటకటనే విధి గడువంగ జాలుదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా...
పరితాప భారంబు భరియింప తరమా

చిత్రం : భక్త ప్రహ్లాద (1931)
రచన : చందాల కేశవదాసు (తొలి తెలుగు సినీ కవి)
సంగీతం : హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గానం : సురభి కమలాబాయి