Monday, October 29, 2012

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు ...... మూగ మనసులు (1964)

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే..

పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఎడ్చినా
నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునా
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఆ ఆ ఆ అ
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలు ఈ మూగమనసు బాసలు
మీకిద్దరికి సేసలు
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ

చిత్రం : మూగ మనసులు (1964)
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల

No comments:

Post a Comment