Thursday, November 1, 2012

ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ .... నేను మీకు తెలుసా (2008)


ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ
ముందున్నది .. నిజమంత నిజమే అన్న సంగతీ
అవునా .. అంటున్నదీననిలా విడిచి .. ఏ లోకంలో ఉందీ
మొదలైన సంతోషమో .. తుదిలేని సందేహమో !

నువ్వేనాడో తెలుసునంది మనసు ..ఎలాగో ఏమో
నిన్ను చూడగానే గుండెలో .. ఇదేమి కలవరమో
కలనైన రాని కనువింటి దారి వెలిగించు కాంతి నీకున్నదీ
నడిరేయిలోని నలుపెంత గాని నీదైన వేకువని వింత ఏమిటుందీ

కాలం వెంట కదలలేని శిలగా .. ఎన్నాళ్ళిలాగా
ఎటువైపు అంటే ఏ క్షణం .. జవాబు ఇవ్వదుగా
పడి లేవ లేవ పరుగాపుతావా అడివైన దాటి అడుగేయవా
సుడిలోని నావ కడ చేరుకోవ నువు చూపుతావనే ఆశ రేపుతావా

వహువహు నీకేంటో ఒక ప్రశ్నగా .. నిను నువ్వే వెతుక్కోకలా
నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా

నిన్ను ఆగనీక కొనసాగనీక తడబాటు ఏమిటో చెప్పలేని తనువా !


చిత్రం : నేను మీకు తెలుసా (2008)
సంగీతం : అచ్చు
రచన :  సిరివెన్నెల
గానం : హేమచంద్ర, బాంబే జయశ్రీ

No comments:

Post a Comment