Saturday, November 10, 2012

గల గల పారుతున్న గోదారిలా .. రెపరెపలాడుతున్న తెరచాపలా.... గౌరి (1974)

గల గల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా. లా..లాలలా....
హే హే గల గల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా
ఈ జీవితం సాగనీ హాయిగా
హే... గలగల పారుతున్న గోదారిలా

అందాలు పందిరి వేసే ఈ తోటలు
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలు
నాగలి పట్టే రైతులు ,కడవలు మోసే కన్నెలు
బంగరు పంటల సీమలు చూడరా..

హే... గలగల పారుతున్న గోదారిలా

దేశానికాయువు పోసే పల్లెలు
చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యము 
సత్యం ధర్మం నిలుపుటే న్యాయం కోసం పోరుటే..
హే... గలగల పారుతున్న గోదారిలా 


చిత్రం : గౌరి (1974)
సంగీతం : సత్యం 
రచన : దాశరథి 
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 
*********************************
Movie Name : Gowri (1974)
Music Director : Satyam
Lyricist : Dasarathi
Singer : S.P.Bala Subrahmanyam

No comments:

Post a Comment