Saturday, November 10, 2012

ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు ..... మొగుడు కావాలి (1980)

పల్లవి :
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు..
సాగరతీరం కెరటాలు ఆకాశానికి చేరవు.. || ఆకాశంలో తారకలు ||.

చరణం : 1
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ || మెరిసే మబ్బులు ||
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
మట్టికి బిడ్డలు మణులు మనుషులు
అదే మరిచిపోకూ అదే మరిచిపోకూ || ఆకాశంలో తారకలు ||

చరణం : 2
అమావాస్యలో చందమామకై వెదకవద్దు నీవు..
అంధకారమే వెలుగు చేసుకొని బ్రతకవద్దు నీవు..
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుస్సు చూడు..
పేద బ్రతుకులో పెద్ద మనుషులు మనసు పెట్టి చూడు..
నా మనసు విప్పి చూడు..    || ఆకాశంలో తారకలు ||.

చిత్రం : మొగుడు కావాలి (1980)
సంగీతం : జె.వి.రాఘవులు
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 

No comments:

Post a Comment