పల్లవి :
ఏ గీత గీసినా నీ రూపమే
ఏ గీత గీసినా నీ రూపమే
ఏ గీతి పాడినా నీ గానమే
రతివో భారతివో అనురాగవతివో
ఎవరివో ఎవరివో నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే
చరణం : 1
దివి నుండి వచ్చిన దేవతవో భువిలోన వెలసిన మోహినివో
మిసమిస అందాల రసరాగ లతవో అసమాన లావణ్య కుసుమానివో
ఎవరివో ఎవరివో నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే
చరణం : 2
కాళిదాసుని దివ్య కావ్యనాయికవో కణ్వముని కనువెలుగు శకుంతలవో
మధుమాస శుభవేళ మాధవుని రాకకై
మధుమాస శుభవేళ మాధవుని రాకకై ఎదురుతెన్నులు చూచు రాధికవో
ఏ గీత గీసినా నీ రూపమే
చరణం : 3
అజంతా గుహలోని చిత్రానివో అమరావతి సీమ శిల్పానివో
రామప్ప గుడిలోన రమణీయ భంగిమల రక్తినొలికించే నర్తన బాలవో
ఎవరివో ఎవరివో నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే
చిత్రం : ముత్తైదువ (1979)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
******************************
Movie Name : Mutthaiduva (1979)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aathreya
Singer : S.P.Bala Subrahmanyam
No comments:
Post a Comment