Saturday, November 10, 2012

కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా .. శుభోదయం (1980)


కంచికి పోతావా కృష్ణమ్మా..  ఆ ఆ ఆ.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ

కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా..  ఆ ఆ ఆ.. ఆ

చరణం:
ఊ.. ఉఉఉ ఊ.. ఆ ఆ ఆ ఆ హా హా
త్యాగరాయకీర్తనల్లె ఉన్నాది బొమ్మ.. రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ఉ ఊ ఊ
త్యాగరాయకీర్తనల్లె ఉన్నాది బొమ్మ.. రాగమేదో తీసినట్టు ఉందమ్మా

ముసిముసి నవ్వులు పూసింధీకొమ్మ.. మువ్వగోపాలా.. మువ్వగోపాలా..
మువ్వగోపాలా అన్నట్టుందమ్మా

అడుగుల సవ్వడి కావమ్మా అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా
అడుగుల సవ్వడి కావమ్మా అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా..  ఆ ఆ ఆ.. ఆ

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేలకంత నిదుర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేలకంత నిదుర రాదమ్మా

ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ.. ముద్దుమురిపాలా..
మువ్వగోపాలా.. నీవురావేలా అన్నట్టుందమ్మా

మనసు దోచుకున్న వోయమ్మా.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న వోయమ్మా.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా..
ముద్దుమురిపాలా..
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాలా..
కంచిలో వున్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
నీవు రావేలా..
కృష్ణమ్మా!!


చిత్రం : శుభోదయం (1980)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
**********************************
Movie Name : Shubhodhayam (1980)
Music Director : K.V.Mahadevan
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : S.P.Bala Subramanyam , P.Susheela

No comments:

Post a Comment