ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..
చరణం: 1
మెరుపని పిలవాలంటే.. ఆ వెలుగు వొక్క క్షణం ..
పూవనీ పిలవాలంటే.. ఆ సొగసు వొక్క దినం..
ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు..
ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు!!
తెలిసింది వొక్కటే.. నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..
చరణం: 2
తారవని అందామంటే.. నింగిలో మెరిసేవు..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవు..
ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చలో??
ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చలో??
తెలిసింది వొక్కటే.. నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాశాను నీకు చెప్పలేక..
యెదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు భాష చేతకాక..
తెలుపుటకు భాష చేతకాక..
చిత్రం : స్వప్న (1981)
సంగీతం : సత్యం
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు
-telugu-cinema-songs-lyrics.jpg)
No comments:
Post a Comment