Sunday, November 11, 2012

సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం .... సంసారం ఒక చదరంగం (1987)




సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో
ఆవేశాలు, ఋణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం....అనుబంధం ఒక రణరంగం

గుండెలే బండగా మారిపోయేటి స్వార్ధం
తల్లిని తాళిని డబ్బుతో తూచు బేరం
రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం
ఇంటికి మంటికి ఏకధారైన శోకం
తలపై నీ గీత ఇలపైనే వెలసిందా
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ కేళిలో
ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవమా?

సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో
ఆవేశాలు, ఋణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం....అనుబంధం ఒక రణరంగం

కాలిలో ముళ్ళుకి కంట నీరేట్టు కన్ను
కంటిలో నలుసిని కంట కనిపెట్టు చెల్లి
రేఖలు, గీతలు చూడదే ఏ రక్తబంధం
ఏ పగా చాలదు ఆపగా ప్రెమపాశం
గడిలో ఇమిరెనా మదిలో గల మమకారం
పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి మదిలో ప్రేమను

సంసారం ఒక చదరంగం...అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలూ తీసినా, పాశాలూ తీరునా
అదుపు లేదు, అజ్ఞ లేదు మమకారాలలో

కౌగిలే కాపురం కాదులే పిచ్చితల్లి
మల్లెల మంచమే మందిరం కాదు చెల్లి
తేనెతో దాహము తీర్చదేనాడు చెల్లి
త్యాగమే ఊపిరై ఆడదైయేను తల్లి
కామానికి దాసొహం కారాదే సంసారం
కాచుకో భర్తనే కంటి పాపాయిగా
నేర్చుకో ప్రేమనే చంటి పాపాయిగా
మన్నించేది, మనసిచ్చేది మగడే సోదరి

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము, ప్రేమే వేదాంతాము
వయస్సు కాదు, వాంచ కాదు, మనసే జీవితం

చుక్కలు, జాబిలి చూసి నవ్వేటి కావ్యం
నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం
తారపై కోరిక తప్పురా చిట్టీ నేస్తం
రెక్కలే రానిదే ఎగరలేనెదు భ్రమరం
వినరా ఒ సుమతి..పొరాదు ఉన్న మతి
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది , గెలిపించేది చదువే నాయనా

సంసారం ఒక చదరంగం
చెరింగిందా నీ చిరుస్వప్నం
ఈ గాలి వానలో నీ మేఘమాలలో
ఉరిమే మబ్బు మెరిసే బొమ్మ చెరిపే వేళలో
చుక్కలు జాబిలి చూసి నవ్వేరి కావ్యం
నింగికి నిచ్చెన మేసుకుంటుంది బాల్యం
తారపై కోరిక తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే రానిదే ఎగరనేలేదు భ్రమరం
వినరా ఓ సుమతీ పోరాదు ఉన్న మతి
పాత పాఠాలనె దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిన్ను పెంచేది గెలిపించేది చదువే నాయనా

సంసారం ఒక చదరంగం
చీకటిలో అది రవికిరణం
ప్రళయాలు రేగినా తిమిరాలు మూగినా
వెలిగించేది ఈ సంసారమే


చిత్రం : సంసారం ఒక చదరంగం (1987)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : S.P. బాలు
*******************************
Movie Name : Samsaram oka chadarangam (1987)
Music Director : Chakravarthy 
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : S.P.Balu 

No comments:

Post a Comment