ఆ ... ఆ...ఆ ... ఆ...
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని...ఆ... ఒక అందానివో... ఆ
రవి చూడని పాడని నవ్య రాగానివో
ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై
ఆ... ఆ...ఆ... ఆ...
నీ పాటనే పాడనీరవి వర్మకే అందని...ఆ... ఒక అందానివో
ఏ గగనమో కురులు, జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే... నీ దివ్య శిల్పాలై
ఆ ... ఆ...ఆ ... ఆ...
కదలాడనీ... పాడనీ
రవి వర్మకే అందని ఒక అందానివో... ఆ
రవి చూడని పాడని నవ్య రాగానివోరవి వర్మకే అందని...ఆ... ఒక అందానివో... ఆ
చిత్రం : రాముడే రావణుడైతే (1979)
సంగీతం : జి.కె.వెంకటేష్
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
**************************
Movie Name : Ramude Ravanudaithe (1979)
Music Director : G.K.Venkatesh
Lyricist : Veturi
Singers : S.P.Bala Subramanyam , S.Janaki

No comments:
Post a Comment