పల్లవి :
నువ్వే నువ్వే అంటూ నాప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతీచోటు నీకోసం వెతుకుతుండగా
కన్నుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం ||నువ్వే||
చరణం : 1
కనులకు గుచ్చే తీయని భావం
ప్రేమోఏమో ఎలా చెప్పను
తహతహ పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఏం చేయడం
ఊహల్లో ఉయ్యాలూపే సంతోషం రేగేలా
ఊపిరిలో రాగం తీసేసంగీతం సాగేలా
అలవై పిలిచే ప్రణయసుప్రభాతం ||నువ్వే||
చరణం : 2
ఎవరెవరంటూ గెలిచిన ప్రాణం
నిన్నె చూసితలొంచే క్షణం
మిసమిసమంటూ నీనయగారం
హారంవేసివరించే క్షణం
స్నేహాల జంటే అల్లేసి కౌగిల్లో
పపారాశి పాదాలే పారాడే గుండెల్లో
నడకే మరచి శిలయ్యింది కాలం ||నువ్వే||
చిత్రం : కలిసుందాం రా (2000)
సంగీతం : S.A.రాజ్ కుమార్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : హరిహరన్ , సుజాత
******************************
nuvve nuvve antu naa praanam
nuvve nuvve antu naa pranam
pade pade pilache nee gaanam
prathi chota nee kosam vethukuthundaga
Movie Name : Kalisundam raa (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Hariharan, Sujatha

No comments:
Post a Comment