Friday, November 9, 2012

పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం... కలిసుందాం..రా (2000)














పల్లవి :
పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తయినా ఎక్కేస్తానే నీ కోసం ||పసి||
తలకోన జంగిల్‌లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ రోమియోకన్న నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చ గాణ్ణమ్మ ||పసి||

చరణం : 1
పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యార్ మంటాడు
టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమేకాదా
తోడువస్తున్నా ప్రేమతోడుకుంటున్నా
పసిఫిక్‌లో దూకేయమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం

చరణం : 2
నీ ఒంపుల కెంపుల్లో ప్రేమపూజ చేస్తున్నా
నీ గుండెల గాదుల్లో ప్రేమపూవు నవుతున్నా
కరెన్సీ నోటుకన్నా కాస్టుకాదా ప్రేమపాట
కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
నాలోపాట అర్థంకాదా వద్దకురావే ముద్దుల రాధా
సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా ||పసి||


చిత్రం : కలిసుందాం..రా  (2000)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : ఉదిత్ నారాయణ్, అనురాధా శ్రీరామ్
****************************************
Movie Name : Kalisundam raa (2000)
Music Director : Manisharma
Lyricist : Chandrabose
Singers : Udith Narayan, Anuradha Sriram

No comments:

Post a Comment