Friday, November 30, 2012

వినిపించనీ తరుణీ నీ చరితని ........ అటు అమెరికా ఇటు ఇండియా (2001)

పల్లవి :
వినిపించనీ తరుణీ నీ చరితని
వివరించనీ రమణీ నీ ఘనతని
ప్రకృతిగ భావించి పడతిని పూజించు
సంస్కృతి మనదేనని
|| వినిపించనీ ||

చరణం :
మంచికి మాగాణి మమతల మారాణి
భరతావని భామిని ఇలపై సౌదామిని
కుంకుమ నీరెండ కురులలో పూదండ
కళలొలికే భూమిని ప్రతి ఋతువు ఆమని
మగువను మన్నించి మనసున కొలువుంచు
పురుషుడె మనిషంటూ జగతికి చాటించి
మురిసిన చరితని తలుచుకొని
|| వినిపించనీ ||

చరణం :
అమ్మ అనడమే అన్ని విద్యలకూ ఆది బిందువంది
పుట్టుకకే పురుడోసిన పృధివిని స్త్రీతో పోల్చింది
ఇల్లాలిని నట్టింటి లక్ష్మిగా కళ్ళకద్దుకుంది
ఇంటి కంటితడి కారు చిచ్చులా కాల్చుతుంది అంది
ఇలాంటి ధర్మం ఈ జగాన ఇంకెక్కడ ఉంటుంది

చరణం :
శృంగార రంగాన అంగన సౌందర్యలహరి
చందన శీతల మందహాస చంద్రికలలాసనగరి
కారుణ్యామృతవారి సుకుమారి
సమరాంగణాన యమపురికి దారి చూపించు వీరనారి
సహన శీలమున శాంత శీలమై నిలిచే చిన్నారి
మహిష మర్దినిగ భయద భీభత్స జ్వాలా కీలగ మారి
భద్రకాళిగా రౌద్రకేళిగా రుధిర నదులుగ పారి
పరమాద్భుతమనిపించదా మరి
నవరసాకృతుల కలికి విలాసం దర్శించిన భారతదేశం
మనవ జాతికి సందేశం తరతరాలకు ఆదర్శం


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం & బృందం 
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Balasubramanyam & Chorus

No comments:

Post a Comment