Friday, November 30, 2012

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే ...... అటు అమెరికా ఇటు ఇండియా (2001)


నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే
అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే

మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే
ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే
ఏ భాషను పలికిస్తున్నా గొంతులొ స్వర తంత్రులు ఒకటే
ఆహారం  వేరే ఐనా అందరి ఆకలి ఒకటే

ఆకారం వేరే ఐనా ఆధారం బ్రతుకొకటే

నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితమొకటే
ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా పిల్లన గ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకు విలువొకటే
నీకు నాకు అందరికి పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే


చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : S.P.Balasubramanyam

No comments:

Post a Comment