పల్లవి :
వెల్ కం ఇండియా కుమారి వొణుకుడు దేనికే వయారివేషం మార్చుకోవె పోరి - ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి
వెస్ట్రన్ స్తైలులో న్యూ స్మైలులో దొరసాని లాగమారి
అరెరె ఆగు ఒక్కసారి పరుగులు తీయలేను సారీ
అసలే కొత్తగుంది దారి పడతానేమో కాలుజారి
మనుషుల లోకమో మాలోకమో ఈ మాయదారి మజిలీ
|| వెల్ కం ||
చరణం : 1
కార్లో శృంగారం అదేమంత నేరం
బేజారవుతావేం అది ఈ ఊళ్ళో ఆచారం
ఏంటి వ్యవహారం మరీ ఇంత ఘోరం
బాగుందంటావేం నడివీధుల్లో వికారం
Be a Roman when you are in Rome
అయ్యో రామా ఇదేం సంబరం
నలుగుర్లాగే ఉండాలే మనం
నడిచే దెట్టా నీతో కాపురం
ఎట్టాగో అట్టా అడ్జస్టు అయిపోవే భామా
|| వెల్ కం ||
చరణం : 2
వస్త్రాలేం కరువా అవేమంత బరువా
చెడ్డీలే కట్టి చెడ తిరిగాడే అది పరువా
చాదస్తం మగువా ప్రతీ చోట తగువా
పరేషాను మాని ఆరే! పరవాలేదనుకోవా
ఊరంతా చూడాలి అందుకా - ఒళ్ళంతా వదిలేయమందువా
MTV FTV చూడవా బ్యూటి పోటీ మాటలెరగవా
అట్టాగ నన్నుండ మంటావా ఏంటయ్య మామా
|| వెల్ కం ||
చిత్రం : అటు అమెరికా ఇటు ఇండియా (2001)
సంగీతం : మాధవపెద్ధి సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, స్వర్ణలత
**************************************************
Movie Name : Atu America Itu India (2001)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : S.P.Balasubramanyam, Swarnalatha
-telugucinema+songs-lyrics.blogspot.in.2.jpg)
No comments:
Post a Comment