Saturday, November 3, 2012

చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా ......... కనులు మూసినా నీవాయే (2002)


చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా

బిందువై నను తాకిపోవే ప్రియతమా
సింధువై మది నిండిపోవే ప్రాణమా

హృది వాణివై హృదయానివై
ఈ హాయిలో కిరణానివై
నా కంటి పాపల్లో దీపాల వెలుగై
నా గుండె లోతుల్లో స్వప్నాల జడివై

చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా

నిను చూస్తు కూర్చుంటె ఓ సంబరం సంబరం సంబరం
నా చెంతే ఉన్నట్టు ఆ అంబరం అంబరం అంబరం
నీ రూపు కలలెన్నో వెదజల్లి పోయిందీ
ఎద ఏంటి మేఘంలా ఎగిరెళ్ళి పోతోందీ

సఖి నువ్వే నాలోని అలజడికే ఆకారం
నువు కాదా లోలోనే తొలి ప్రేమకు శ్రీకారం
నాలోని భావాలు ఇక తెలిపేదేలా

చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా

ప్రతిరోజు నిదురల్లో ఓ కలవరం కలవరం కలవరం
కెరటాలై పొంగింది మది సాగరం సాగరం సాగరం
మనసేమొ చిత్రంగా నిన్నేలే అడిగిందీ
ఎద ఏమో ఆత్రంగా నీకోసం వెతికిందీ

అణువణువుని జత చేసి నిర్మించా గోపురమే
నువు చిందే చిరునవ్వే నా పాలిట ప్రియ వరమే
నాలోని భావాలు ఇక తెలిపేదేలా

చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా


చిత్రం : కనులు మూసినా నీవాయే (2002)
సంగీతం : చక్రి
రచన : కందికొండ
గానం : హరిహరన్

No comments:

Post a Comment