Saturday, November 3, 2012

చందమామ లాంటి..నువ్వే నవ్వితే.. బ్యాంక్ (2007)


చందమామ లాంటి..నువ్వే నవ్వితే..
పువ్వే పూసెనే..నీ అధరాలపై
కబురే చెప్పాలి నీతో..కంగారౌతుంది ఏంటో..
చెలి నువ్వు తెలిపెయ్యవా !

ఎనలేని ప్రేమ నీకు..ఎలా తెలుపనూ
ఎనలేని ప్రేమ నీకు..ఎలా తెలుపనూ
నువ్వే నాకు తోడు లేక ఎలా బ్రతకనూ
మనసే మైకాన మునిగే..నా వయసే ప్రెమల్లో కరిగే
దారేదో చూపించవా !

చురుకైన కళ్ళలోన..కలై నువ్విలా
చురుకైన కళ్ళలోనా..కలై నువ్విలా
చినుకల్లే గుండెపైన..రాలేవా ఇలా
అడుగే నీ వెంట సాగే..అణువణువూ నీవైపు లాగే
నీ ప్రేమ అందించవా !

చందమామ లాంటి..నువ్వే నవ్వితే..
పువ్వే పూసెనే..నీ అధరాలపై
కబురే చెప్పాలి నీతో..కంగారౌతుంది ఏంటో..
చెలి నువ్వు తెలిపెయ్యవా !

చిత్రం : బ్యాంక్ (2007)

సంగీతం : చిన్ని చరణ్
రచన : చిన్ని చరణ్
గానం : దీపు

No comments:

Post a Comment