Thursday, November 29, 2012

నిన్నైనా నేడైనా ..... రోజన్నది ఎపుడైనా .... మొదటి సినిమా (2005)


ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం

నిన్నైనా నేడైనా ..... రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా...ఒకలాగే పూర్తయ్యేనా
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం


నిన్నైనా నేడైనా ..... రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా...ఒకలాగే పూర్తయ్యేనా

ఏ పూటకి ఆ పూటే... బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఏ క్షణమైనా

ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం

ఎటు నీ పయనమంటే నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే
ఎదలో ఆశవెంటే ఎగసే వేగముంటే
సమయం వెనుకబడదా ఊహతనకంటా ముందుంటే
మనచేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది లేనిపోని ఈ ప్రశ్న
మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా

ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం


ఓ హో ఓ

నిన్నైనా నేడైనా ..... రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా...ఒకలాగే పూర్తయ్యేనా


కసిరే వేసవైనా ముసిరే వర్షమైనా
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్నా ముసుగే కప్పుకున్నా
ఘనులే కలలుకంటే నిద్దరేం కాదని అంటుందా
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోద సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోద ప్రతిగాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా


ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం

హే హే..

నిన్నైనా నేడైనా ..... రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా...ఒకలాగే పూర్తయ్యేనా

ఏ పూటకి ఆ పూటే ... బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఏ క్షణమైనా

ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం
ధీం తనకధీం తగిడితగిడితోం ధీం తనకధీం

చిత్రం : మొదటి సినిమా (2005)
సంగీతం : స్వరాజ్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్

No comments:

Post a Comment