అందమైన కలల కుటీరం...అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం...దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతిదినం...సుఖశాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం...దేవుళ్ళ జన్మాలయం
అందమైన కలల కుటీరం...అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం...దేవుళ్ళ జన్మాలయం
కనులువేరు చూపులు ఒకటే
తలలువేరు తలపులు ఒకటే
పంచుకున్న ప్రాణం ఒకటే
ఎదలు వేరు స్పందన ఒకటే
పెదవిలోని ప్రార్థన ఒకటే
ఒకరికన్నా ఇష్టం ఒకరే
కంగారై ఎవరున్నా ప్రతికన్ను చెమ్మగిల్లేను
కన్నీరై ఎవరున్నా పదిచేతులొచ్చి తుడిచేను
సమభావం అన్నది సంసారం ఐనది
మా ఇల్లు మమతాలయం
కవి లేని కవితాలయం
అందమైన కలల కుటీరం...అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం...దేవుళ్ళ జన్మాలయం
కునుకు లేని వాకిలి మాది
అలక లేని అరుగే మాది
మరక లేని మనసే మాది
తెరలు లేని తలుపే మాది
గొడవ లేని గడపే మాది
కరువు లేని కరుణే మాది
ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే
ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే
స్వర్గాలే జాలిగా స్థానాన్నే కోరగా
మా ఇల్లు మంత్రాలయం
అనుబంద గంధాలయం
అందమైన కలల కుటీరం...అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం...దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతిదినం...సుఖశాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం...దేవుళ్ళ జన్మాలయం
చిత్రం : బలాదూర్ (2008)
సంగీతం : K.M.రాధాకృష్ణన్
రచన : చంద్రబోస్
గానం : కారుణ్య

No comments:
Post a Comment