Thursday, November 29, 2012

సుభాష్ చందు అణువణువునందు ....... సుభాష్ చంద్రబోస్ (2005)


జైహింద్ జైహింద్  జైహింద్ జైహింద్

సుభాష్ చందు అణువణువునందు
అడుగడుగునందు జైహింద్
స్వేచ్చనే పొందు పోరాటమందు
మనమంత ముందు జైహింద్
తెల్లరాబందు మనదేశమందు
ఉండొద్దు ఎందు జైహింద్
దోపిళ్ళు బందు దొరతనము బందు
తొడగొట్టమందు జైహింద్

వందే..మాతరం వందే.. మాతరం
వందే.. మాతరం వందే.. మాతరం

పిడికిళ్ళు అగ్గి పిడుగుల్ని చేసి
కురిపించమంది జైహింద్
కన్నీళ్ళ ధార ఖఢ్గాల ధార
కావాలి అంది జైహింద్
గాయాలలోన ధ్యేయాన్ని చూసి
కదలాలి అంది జైహింద్
రక్తాలు చిందు త్యాగాల విందు
ఆజాదు హిందు జైహింద్

వందే..మాతరం వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం

జైహింద్ జైహింద్

స్వారాజ్యమింక మన జన్మ హక్కు
అంటుంది జెండా జైహింద్
మన గుండెలన్ని జెండాలో
ధర్మ చక్రాలే చూడు జైహింద్
అరచేయి అడ్డు పెట్టేసి
సూర్యునాపేది ఎవడు జైహింద్
ఆంగ్లేయ గుంటనక్కలే
మనలాపేయలేవు జైహింద్
నలబది కోట్ల జనమంత
ఇంక కట్టారు జట్టు జైహింద్
మన భరతమాత పాదాల మట్టి
బొట్టుగా పెట్టు జైహింద్

వందే..మాతరం వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం

జైహింద్ జైహింద్

బుల్లెట్ల వాన అల్లూరిపైన
కురిసింది నాడు జైహింద్
తల తెగినగాని తలవంచబోడు
మన తెలుగువాడు జైహింద్
పుడతారు వేల వీరులే
ఒక్క వీరుడే ఒరిగి జైహింద్
పుడతాయి విప్లవాలెన్నో
వీర రక్తాలే చింది జైహింద్
ఒకసారి కాదు వెయిసార్లు మళ్ళి
పుడతాడు అతడు జైహింద్
ద్రోహులను చీల్చి చెండాడె
సింహమవుతాడు అతడు జైహింద్

వందే..మాతరం వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం

వందే.. మాతరం వందే..మాతరం
ఆహా… ఆహా….

చిత్రం : సుభాష్ చంద్రబోస్ (2005)
సంగీతం : మణిశర్మ
రచన : సుద్దాల అశోక్ తేజ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , అనురాధా పౌడ్వాల్

No comments:

Post a Comment