Saturday, December 1, 2012

మనసులో మధువే కురిసెలే చినుకే ........... శకుని (2012)


పల్లవి :
మనసులో మధువే కురిసెలే చినుకే
నా యదలొ తేనెల జల్లె చిలుకగ నీవె
ఏమవునొ తనువే తనువే
నా కంటిలొ నీడై నిలిచి కలవరపెడితె
ఏమవునొ తుదకే తుదకే
రాత్రి పున్నమి చందురుడ , నా చెలియ, అది మరి నీ ముఖమే
వెన్నెలెలె పెరిగితె తరుగునులె నీ సొగసే తరిగిపోని వెన్నెలే
మదికి సూర్యుని కిరణాల ప్రియతమ కావవి నీ కనులె
నీరు కనురెప్పల స్వరములగ, ప్రణయమ నన్ను ఏమి చేసెనొ
ప్రియమా మది నీ వలన పులకించలే ఓఓఓ

మనసులో మధువే కురిసెలే చినుకే

చరణం : 1
నింగికెగసె గువ్వల్ల నీవు నేను కలిసేల ఏకమయే ఎగురుదాం
హో నీలి మేఘ మాలికనై పాలపుంత దాటుకుని పైకలా ఎగురుదాం
గాలల్లె కలగలిసి పోదామా
మబ్బుల్లొ తేలి పోతు ఊయల ఊగుదాం
నీ వల్ల నడిచిన వింత కద, నా ఎదుటె జరిగిన మాయ కద
నీ చూపె నెరపిన తంత్రమిద నా దేహం యె దారింక చేరునొ
కలలు నడుచుట సాధ్యములె, నా కలలు తీరుట నిశ్చయమె
నీ వేలు పట్టిన ఈ క్షణమె నా సఖియ నీవు నాకు సొంతమే
ప్రియమా మది నీ వలన పులకించలే ఓఓఓ

మనసులో మధువే కురిసెలే చినుకే ఏ ఏ

చరణం : 2
ప్రేమ గాలి సోకగనె కానరావు కాలములె జగమిలా మారులే
ఏడు రంగుల హరివిల్లె వేయి రంగులు వెదజల్లె హాయిలే మాయలే
ఎండల్లొ చిరు జల్లులాయెలే
మబ్బుల్లొ తేలి పోతు ఊయల ఊగుదాం
ఇలకు తారలు రావు కద వచ్చిన కనులను చూడవు గ
చూసిన చేతిని తాకవు గ తాకితే ఏమవునొ నా మది
ఇలకు తారలు వచ్చెనుగ, వచ్చి నీ కనులను చూచును గ
చూసి నీ చేతిని తాకును గ, తాకితె పొంగిపోయె నీ మది
ప్రియమా మది నీ వలన పులకించలే ఓఓఓ

మనసులో మధువే కురిసెలే చినుకే


చిత్రం : శకుని (2012)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
రచన : సాహితి
గానం : సోనూ నిగమ్ , సైంధవి
*******************************
Manasulo madhuve kurisele chinuke
naa yadhalo thenela jalle chilukaga neeve
emavuno thanuve thanuve
naa kantilo needai nilichi kalavarapedithe
emavuno thudhake thudhake
ratri punnami chanduruda naa cheliya adhi mari nee mukhame
vennelele perugithe tharugunule nee sogase tharigiponi vennele
madhiki sooryuni kiranaala priyathama kaavavi nee kanule
neeru kanu reppala swaramuluga pranayama nannu emi cheseno
priyama madhi nee valana pulakinchale ooo

manasulo madhuve kurisele chinuke

ningikegase guvvalla neevu nenu kalisela ekamai egurudham
ho neeli megha maalikanai paalapuntha dhatukuni paikala egurudham
galalle kalagalisi podhamaa
mabbullo theli pothu ooyala oogudham
nee valla nadichina vintha kadha naa edhute jarigina maaya kadha
nee choope nerapina thantram idha naa deham ye dharinka cheruno
kalalu naduchuta saadhyame naa kalalu theeruta nischayame
nee velu patina ee kshaname naa sakhiya neevu naa sonthame
priyama madhi nee valana pulakinchale ooo

manasulo madhuve kurisele chinuke

prema gaali sokagane kaanaraavu kaalamule jagamilia marunule
edu rangula hariville veyi rangulu vedhajalle haayile maayale
endallo chiru jalllulayele
mabbullo theli pothu ooyala oogudham
ilaku thaaralu raavu kadha vachina kanulanu choodavu ga
choosina chethini thaakavu ga thakithe emavuno naa madhi
ilaku thaaralu vachunuga, vachi nee kanulanu choochunu ga
choosi nee chethini thaakunu ga, thaakithe pongipoye nee madhi
priyama madhi nee valana pulakinchale ooo

manasulo madhuve kurisele chinuke


Movie Name : Sakuni (2012)
Music Director : G.V. Prakash Kumar
Lyricist: Sahithi
Singer : Sonu Nigam, Saindhavi

No comments:

Post a Comment