1. దేవాంతకుడు (1960)తెలుగులో తొలి సోషియో ఫాంటసీ. నరుడు యమలోకానికి వెళ్లడమనే కాన్సెప్ట్‌కి శ్రీకారం యముడిగా ఎస్వీఆరూ, నరుడిగా ఎన్టీఆరూ అదరహో.
2. యమగోల (1977)‘డెత్ టేక్స్ ఏ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషనే కానీ, అంతా అచ్చ తెనుగు మసాలా. ‘చిలక కొట్టుడు కొడితే’ లాంటి కిర్రెక్కించే పాటలు. ఎన్టీఆర్ నటనకు వసూళ్ల వర్షం. నరకం నుంచి నేలకు దిగొచ్చిన యమధర్మరాజు-చిత్రగుప్తుడైన కైకాల, అల్లు కామెడీకి పొట్ట పగలాల్సిందే.
3. యముడికి మొగుడు (1988)ఈ ‘యమ’ ఫార్ములా చిరంజీవికి అచ్చొచ్చింది. సినిమా సూపర్ హిట్టు. పాటలూ హిట్టే. యమధర్మరాజుగా కైకాల అదుర్స్. చిత్రగుప్తునిగా అల్లుకు తిరుగేముంది!
4. యమదొంగ (2007)రాజమౌళి మేజిక్. తాత ఎన్టీఆర్‌ను గుర్తు చేసిన మనవడు ఎన్టీఆర్. స్వర్గంలో తాతా మనవళ్ల స్టెప్స్‌కు విజిల్సే విజిల్స్. యమధర్మరాజుగా మోహన్‌బాబు పర్‌ఫెక్ట్ ఫిట్.
5. జగదేక వీరుడు-అతిలోక సుందరి (1990)స్వర్గాధిపతి దేవేంద్రుని కూతురు ఓ సామాన్య మానవుణ్ణి ప్రేమిస్తే? అలాంటి అందమైన స్వప్నమే ఈ సినిమా. తుఫాన్‌లోనూ వసూళ్ల తుఫాన్. ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ లాంటి కమ్మని పాటలు చిరంజీవి, శ్రీదేవి కలయికే వండ్రఫుల్.
6. మగధీర (2009)గ్రాఫిక్స్‌ని ఉపయోగించి రాజమౌళి చేసిన వండర్. రామ్‌చరణ్ రెండో సినిమాతోనే రికార్డుల మీద రికార్డులు. పునర్జన్మ నేపథ్యంలో అల్లుకున్న అందమైన ప్రేమకథ.
7. దేవి (1999)తన భక్తురాల్ని కాపాడుకున్న ఓ నాగదేవత కథ. ఎమ్మెస్ రాజు భారీ వెంచర్. కోడి రామకృష్ణ గ్రాఫికల్ వండర్.
8. అమ్మోరు (1995)నిర్మాణానికే మూడేళ్లు. అష్టకష్టాలు పడి విదేశాల్లో గ్రాఫిక్స్. గ్లామర్ క్వీన్ రమ్యకృష్ణ సరికొత్త అమ్మోరు అవతారం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని మేకర్‌గా హీరోని చేసిన సినిమా.
9. ముత్యాలముగ్గు (1975)ఉత్తర రామాయణాన్ని సోషలైజ్ చేస్తూ తీసిన సినిమా. ‘ముత్యమంతా పసుపు’లాంటి పాటలతోనే మనసు నిండిపోతుంది. రావుగోపాలరావు డైలాగులు డిస్కులుగా సంచలనం.
10. యమలీల (1994)కమెడియన్ అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన లీల. తల్లి ప్రేమ, యమపాశం చుట్టూ తిరిగే కథ. ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా’ అంటూ హుషారైన పాటలు.
No comments:
Post a Comment