Monday, December 3, 2012

బీదల రోదన వినవా నిరు పేదల వేదన కనవా ....... ఏది నిజం (1956)


బీదల రోదన వినవా
నిరు పేదల వేదన కనవా
ఓ కానని దైవమా ||బీదల||

కూటసాక్ష్యములు చెప్పేవాళ్లు
కొంపలు తీసి గడించేవాళ్లు
జారులు చోరులు కూనికోరులు
వీరా వూరికి పాలకులు
ఓ కానని దైవమా ||బీదల||

సొమ్మిస్తేనే రక్షిస్తావా
నమ్మినదీనుల శిక్షిస్తావా
దీనుల కాచే దేవుడందురు
దేనికి నీకీ పేరో చెపుమా
ఓ కానని దైవమా ||బీదల||

కానీ లేదుర ముడుపుగట్టుటకు
కన్నీటను నీ కాళ్లు కడిగెదను
అన్నెము పున్నెము ఎరుగమురా
మమ్మాదరించి కాపాడ రమ్మురా
ఓ కానని దైవమా ||బీదల||

చిత్రం : ఏది నిజం (1956)
సంగీతం : మాస్టర్ వేణు
రచన :
గానం : జిక్కి

No comments:

Post a Comment