Monday, December 3, 2012

హే జాణా... హే హే జాణా....అందమే ఎంతున్నా.... జై చిరంజీవా (2005)














పల్లవి :
హే జాణా... హే హే జాణా...
హే జాణా..... హే హే జాణా......అందమే ఎంతున్నా...
హే జాణా..... హే హే జాణా......దాచుకో కొంతైనా
చీరకడితే సింగారం.......ఓణి చుడితే వయ్యారం
పొట్టిబట్టలు కట్టావో.........బట్టబయలే బండారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం........ గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం......చీకట్లొ చెయ్యకు సంచారం ||హే జాణా||

చరణం : 1
ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందమూ మేమేగా...
ఆ అల్లరి ఆ అలజడి అన్నింటిలో మేమేగా...
అ అంటే అమ్మాయి...... అపురూపం మీరోయి..
అపహాస్యంగా మారొద్దుగా........
జబ్బపైన టాటూలు.......జామురాతిరి పార్టిలు......
కట్టుబాట్లకు వీడ్కోలు...... కన్నవాళ్ళకు కన్నీళ్ళు.....
గుమ్ము గుమ్మెత్తే ఆకారం........ గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం......చీకట్లొ చెయ్యకు సంచారం ||హే జాణా||

చరణం : 2
మా ఆశలు మా ఊహలు హైరేంజిలో ఉంటాయి...
ఎంతెత్తుకి మీరెదిగినా ఈ నేలనే చూడాలి...
వేగంగా పరుగెత్తే కాలంతో కదలందే థ్రిల్లేముంది టీనేజికి..
నెట్టులోన ఛాటింగు..........పార్కులోన బీటింగు
మార్చుకో నీ థింకింగు.......చేసిచూపు సంథింగు
గుమ్ము గుమ్మెత్తే ఆకారం........ గోదాట్లో కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం......చీకట్లో చెయ్యకు సంచారం ||హే జాణా||


చిత్రం : జై చిరంజీవా (2005)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : కె.కె.
****************************
Movie Name : Jai Chiranjeevaa (2005)
Musical Director : Mani Sharma
Lyricist : Chandrabose
Singer : Kay Kay

No comments:

Post a Comment