
పల్లవి :
చిలకా ఓ పంచరంగుల చిలకా
మొలకా చిరునవ్వుల బంగరుగిలకా॥
ముద్దుగ నీవు పలుక పులకరించునే నా పిలక
ముద్దుగ నీవు పలుక పులకరించునే నా పిలక
మిడతా ఓ పచ్చని రెక్కల మిడతా
విన్నాలే నగరములో నీ ఘనత॥
వలపుల తాయం పెడితే నీ వలలో నేనే పడతా
వలపుల తాయం పెడితే నీ వలలో నేనే పడతా
చిలకమ్మా... అహ మిడతయ్యా...
చరణం : 1
అయ్యయ్యో ఏమిటిది అమ్మా నాన్నా వస్తారూ
అబ్బబ్బో వాళ్లొకరూ మనపాలిటి దెయ్యాలూ॥
తిట్టకు తిట్టకు మన గుట్టు బయటపెట్టకు
గుట్టు రట్టు చేశావంటే
నాన్నకు వచ్చును కోపం
మన ప్రేమకు తెచ్చును మోసం ॥
మీ అబ్బకు కోపం రానీ
మీ అమ్మకు తాపం కానీ
జేజెమ్మను తీసుకురానీ
పెళ్లి ఔతుంది దిగులేం నీకు
రాత్రి వచ్చింది కల ఒకటి నాకు
చిలకమ్మా... అహ మిడతయ్యా...
చరణం : 2
ఆ లోకంలో బ్రతుకే చాలా కష్టము
ఈ లోకంలో ఏమిచేసినా మన ఇష్టము
॥లోకంలో॥
చిలక మిడతల కళ్యాణం చూతము రారండీ
చిలక మిడతల కళ్యాణం చూతము రారండీ
మల్లెపువ్వులే తలంబ్రాలుగా
పళ్లు ఫలాలు భోజనాలుగా
ముది ఏనుగులే ముత్తైలుగా
నీ కూతురు కులుకుతు ఉన్నది చూడు
చక్కగ దొరికెను అల్లుడుగారూ
కనులకు చెవులకు విందే నేడూ
బాతుల కచ్చేరీ ఉన్నదట
మన కోతుల నాట్యం జరుగునట
మిడతయ్యా... చిలకమ్మా...
చిత్రం : జాతకరత్న మిడతంభొట్లు (1971)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
రచన : అప్పలాచార్య
గానం : మాధవపెద్ది సత్యం, ఎల్ .ఆర్ .ఈశ్వరి
No comments:
Post a Comment