Wednesday, December 12, 2012

నీడల్లే తరుముతు ఉంది గతమేదో వెంటాడి ..... అనుకోకుండా ఒకరోజు (2005)
















పల్లవి :
నీడల్లే తరుముతు ఉంది గతమేదో వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరుమేదో ఉండుండి
శ్వాసల్లో ఉప్పెనై, చూపుల్లో చీకటై
దిక్కుల్లో  శూన్యమై.... శూన్యమై

చరణం : 1
నిప్పు పై నడకలో తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదో తెలియని ఈ పయనంలో
నీడల్లే తరుముతు ఉంది గతమేదో వెంటాడి

చరణం : 2
ఎందుకో ఎప్పుడో  ఏమిటో ఎక్కడో
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా.....ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా .... నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదో  తెలియని ఈ పయనంలో
నీడల్లే తరుముతు ఉంది గతమేదో వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరుమేదో ఉండుండి
శ్వాసల్లో ఉప్పెనై, చూపుల్లో చీకటై
దిక్కుల్లో  శూన్యమై.... శూన్యమై


చిత్రం : అనుకోకుండా ఒకరోజు (2005)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్రేయా ఘోషల్
*******************************

neeDallE tarumutu undi gatamEdo venTADi
maunamga paibaDutundi uramEdo unDunDi
swAsallo uppanai choopullo cheekaTai
dikkullo Soonyamai Soonyamai

nippu pai naDakalo tODugaa nuvvunDagA
oka bandhamae booDidai manTalE madi ninDagaa
nee baadha ae konchamO naa chelimitO teeradaa
peelchE gaalinainaa naDichE nElanainaa
nammaalO nammarAdo teliyani ee payanamlO
neeDallE tarumutu undi gatamEdo venTADi

enduko eppuDo emiTo ekkaDo
badulu lEni praSnalE nee unikinE uri teeyagaa
bhayamannadae puTTadA
prati oohatO peragadA
peelchE gaalinainaa naDichE nElanainaa
nammaalO nammarAdo teliyani ee payanamlO
neeDallE tarumutu undi gatamEdo venTADi
maunamga paibaDutundi uramEdo unDunDi
swAsallo uppanai choopullo cheekaTai
dikkullo Soonyamai Soonyamai


Movie Name : Anukokunda okaroju (2005)
Music Director : M.M.Keeravani
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Shreya Ghoshal

No comments:

Post a Comment