Tuesday, April 16, 2013

పల్లె నిదురించేను...తల్లి నిదురించేను.... కాలం మారింది (1972)


పల్లె నిదురించేను...తల్లి నిదురించేను....
ప్రతి పాప తల్లి పొత్తిళ్ళ నిదురించేను...
ఎవరికి నీవు కావాలి
ఎవరికి నీ మీద జాలి

ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల
ఎవరికి నీవు కావాలి
ఎవరికి నీ మీద జాలి
ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల

నీ ఇల్లు కొండలో కొనలో
నీ బ్రతుకు ఎండలో వానలో
కొండలో కొనలో ఎండలో వానలో...
లోకానికే నీవు దూరం
లోకాల తల్లికే భారం
ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల

కలువ పాపాయికి కొలను ఒడి ఉన్నది
చిలుక పాపాయికి చిగురు ఒడి ఉన్నది(2)
ప్రాణమే లేని ఒక శిలకు గుడి ఉన్నది
పాపా నీకే అమ్మ ఒడి లేనిది గుడి లేనిది
ఏనాడు చేసావో పాపం
నీకు ఏనాటిదీ ఘోర శాపం
ఎవరికి నీవు కావాలి
ఎవరికి నీ మీద జాలి
ఏ తల్లి పాడేను జోల..


చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు 
రచన : దాశరథి 
గానం : 
**********************
Palle nidurincheenu...talli nidurincheenu....
prati paapa talli pottilla nidurincheenu...
yevariki neevu kaavaali
yevariki ne meeda jaali

ye talli paadenu jola ye talli upenu dola
yevariki neevu kaavaali
yevariki ne meeda jaali
ye talli paadenu jola ye talli upenu dola

ne illu kondalo konalo
ne bratuku yendalo vanalo
kondalo konalo yendalo vanalo...
lokaanike neevu duram
lokaala tallike bhaaram
ye talli paadenu jola ye talli upenu dola

kaluva papayiki kolanu odi unnadi
chiluka papayiki chiguru odi unnadi(2)
praname leni oka shilaku gudi unnadi
paapaa neeke amma odi lenidi gudi lenidi
yenadu chesavo papam
neku yenatidee ghora shapam
yevariki neevu kaavaali
yevariki nee meeda jaali
ye talli paadenu jola..


Movie Name : Kaalam Maarindi (1972)
Music Director : Saluri Rajeswara rao
Lyricist : Dasarathi
Singers :

No comments:

Post a Comment