
ఏమిటయ్యా సరసాలు ఎందుకయ్యా జల్సాలు(2)
ఓ సోగ్గాడా నీ అల్లరి చిల్లరి వేషాలు
ఏమిటి పిల్లా నా తప్పు అవునో కాదో నువ్వు చెప్పు(2)
అదరగొట్టినా బెదరగొట్టినా వదిలిపోదులే మన వలపు
ఒళ్ళు ముద్దగా తడిసిపోయి చలిచలిగా ఉన్నదిలే
ఈ నీళ్ళల్లోన ఏముందో సిగ్గేస్తూ ఉన్నదిలే
అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే(2)
నిండా మునిగిన వాళ్లకు మనకు చలి ఏమున్నదిలే
రంగులు మార్చే అబ్బాయిలు చదరంగపుటెత్తులు వేస్తారు
మాయలు తెలియని అమ్మాయిలను మైకంలో ముంచేస్తారు
ఆడవాళ్లిలా అంటారు నాటకమాడుతూ ఉంటారు(2)
సందు చూచుకుని ఎంత వాణ్ణైన కొంగుకు ముడేసుకుంటారు
అత్త కొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏల(2)
మా వాళ్ళిప్పుడు చూసారంటే అబ్బో మిర్చి మసాలా
ఓ మావా కూతురమ్మా అందాల ముద్దుగుమ్మా(2)
మనకేనాడో రాసినాడు ఆ మాయదారి బ్రహ్మ
చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : కొసరాజు
గానం :
************************************
yemitayyaa sarasaalu yendukayyaa jalsaalu(2)
oo soggaadaa ne allari chillari veshaalu
yemiti pillaa na tappu avunoo kaadoo nuvu cheppu(2)
adaragottinaa bedaragottinaa vadilipodule mana valapu
ollu muddagaa tadisipoyi chalichaligaa unnadile
ee neellallona yemundo siggestu unnadile
andulo majaa unnadile anubhavinchite telusunule(2)
nindaa munigina vaallaku manaku chali yemunnadile
rangulu marche abbayilu chadarangaputettulu vestaru
mayalu teliyani ammayilanu maikamlo munchestaru
aadavaallilaa antaru natakamaadutu untaru(2)
sandu chuchukuni yenta vaannaina konguku mudesukuntaru
atta kodukani alusiste ee aagadamantaa yela(2)
maa vallippudu chusarante abbo mirchi masaalaa
oo mava kuturammaa andaala muddugummaa(2)
manakenado rasinaadu aa mayadari brahma
Movie Name : Kaalam Maarindi (1972)
Music Director : Saluri Rajeswara rao
Lyricist : Kosaraju
Singers :
No comments:
Post a Comment