Tuesday, April 16, 2013

నిజం తెలుసుకోండి యువకుల్లారా ఓ యువకుల్లారా .... కాలం మారింది (1972)


విగ్రహాలను ప్రతిష్ఠించమని
వీధులకు తమ పేర్లు పెట్టమని
మన నాయకులెవరు అనలేదండి
ఈ ఆలోచనలు మనవేనండి
నిజం తెలుసుకోండి..
నిజం తెలుసుకోండి యువకుల్లారా ఓ యువకుల్లరా

పేదల పాలిటి పెన్నిధి గాంధీ(2)
దీనుల పాలిటి దేవుడు గాంధీ(2)
అంతరానితనమై పీడించే అంటువ్యాధికే వైద్యుడు గాంధీ
అతని దారిలో నడవండి అతనికి శాంతిని చేకూర్చండి..
నిజం తెలుసుకోండి...

స్వాతంత్ర్య భారత సారధి నెహ్రు
తూర్పు పడమరల వారధి నెహ్రు
శాంతి విధాత జాతికి నేత
సామ్యవాద సంధాత నెహ్రు
అతని బాటలో నడవండి అతని ఆశలు తీర్చండి
నిజం తెలుసుకోండి...

ఆంధ్రకేసరి ప్రకాశము
ఆంగ్లేయులకు సింహ స్వప్నము
అతని జీవితం త్యాగమయం
ఆంధ్రుల ఐక్యత అతని ఆశయం
అతని దారిలో నడవండి ఆంధ్రుల పేరు నిలపండి

వీరనారి మన ఇందిర
అహ విజయ శంఖమూదిందిరా
మన స్వాతంత్ర్యాన్ని హరించ జూచిన
శత్రులను అణిచిందిరా
బంగ్లా జాతిని బానిసత్వము బారినుండి కాచిందిరా
ఇందిర మన ఇందిర(2)

మన నాయకులు కోరింది వెండి విగ్రహాలా
ఊళ్ళకు పేర్లా...కాదు

కులమత బేధం లేని సమాజం భారతదేశం
ధనికుడు పేద లేని సమాజం భారతదేశం
దోపిడీ రాపిడి లేని సమాజం భారతదేశం
ద్రోహం మోసం లేని సమాజం భారతదేశం
భారతదేశం ఒకటే ఒకటని ప్రపంచమంతట చాటాలి
వీర నాయకుల వారసులమని పేరు ప్రతిష్టలు తేవాలి
వారి కలలన్ని నిజము కావాలి...


చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : దాశరథి
గానం :
**********************
Vigrahaalanu pratistinchamani
veedhulaku tama perlu pettamani
mana naayakulevaru analedandi
ee alochanalu manavenandi
nijam telusukondi..
nijam telusukondi yuvakullaaraa oo yuvakullaraa

pedala paliti pennidhi gandhi(2)
deenula paliti devudu gandhi(2)
antaranitanamai peedinche antuvydhike vaidyudu gandhi
atani darilo nadavandi ataniki shantini chekurchandi..
nijam telusukondi...

swatantrya bharata saradhi nehru
turpu padamarala varadhi nehru
shanti vidhaata jaatiki neta
saamyavaada sandhaata nehru
atani batalo nadavandi atani aashalu teerchandi
nijam telusukondi...

andhrakesari prakashamu
angleyulaku simha swapnamu
atani jeevitam tyagamayam
andhrula aikyata atani aashayam
atani darilo nadavandi andhrula peru nilapandi

veeranaari mana indira
aha vijaya shankhamudindiraa
mana swatantryaanni harincha juchina
shatrulanu anichindiraa
banglaa jaatini banisatvamu barinundi kaachindiraa
indira mana indira(2)

mana nayakulu korindi vendi vigrahaalaa
uullaku perlaa...kaadu

kulamata bedham leni samaajam bharatadesham
dhanikudu peda leni samaajam bharatadesham
dopidi rapidi leni samaajam bharatadesham
droham mosam leni samaajam bharatadesham
bharatadesham okate okatani prapanchamantata chaataali
veera naayakula vaarasulamani peru pratistalu tevali
vari kalalanni nijamu kaavaali...


Movie Name : Kaalam Maarindi (1972)
Music Director : Saluri Rajeswara rao
Lyricist : Dasarathi
Singers :

No comments:

Post a Comment