Tuesday, April 16, 2013

సన్నజాజి సొగసుంది జున్నులాంటి వయసుంది... కాలం మారింది (1972)














ఓ....ఓ....
తొలకరి మెరుపులా తొలివాన చినుకులా...
ఈ వేళ వచ్చావు ఎవరికోసం...
ఇంకెవరి కోసం...
ఏమేమి తెచ్చావు ఈ బావ కోసం...

సన్నజాజి సొగసుంది జున్నులాంటి వయసుంది
నిన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంది
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ బతుకే ఇంక నీదిరా బావా
ఈ బతుకే ఇంక నీదిరా..
సన్నజాజి సొగసుంటే జున్నులాంటి వయసుంటే
నన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంటే
అంతకు మించి ఏమి వద్దులే పిల్లా
ఆ బతుకే ఎంతో ముద్దులే పిల్ల
ఆ బతుకే ఎంతో ముద్దులే

బంగారు నగలేవి పెట్టుకోనురా
పట్టంచు చీరలేవి కట్టుకోనురా
గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే(2)
పెదవుల భరిణలో పొదిగి ఉంచినానురా
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ వలపే ఇంక నీదిరా...
మిసమిసలాడే నీ మేనే బంగారం
సిగ్గే కంచి పట్టు చీరకన్న సింగారం
నీ పెదవులు చిలికే తేనియ వలపే
పెదవులు చిలికే తేనియ వలపే
ముద్దుల మూటలో ముడిచి దాచుకుందునే
అంతకు మించి ఏమి వద్దులే పిల్లా
ఆ వలపే ఎంతో ముద్దులే...

రవ్వల మేడలంటే మనసు లేదురా
పువ్వుల పానుపంటే మోజు లేదురా.
పచ్చని చేలలో పైరగాలి జోలలో..(2)
ముచ్చటైన గూడు కట్టి వెచ్చగా ఉందాము రా
ఇంతకు మించి ఏమి వద్దులే బావా
ఈ వరమొక్కటే చాలులే
రవ్వలు ఎందుకు నీ నవ్వులు ఉండగా
పూవులు ఎందుకు నీ పులకింతలుండగా
వీడని బాసలే వాడని తీవెలుగా(2)
వెన్నెల గూడు కట్టి వేయి జన్మలుందాము
అంతకు మించి ఏమి వద్దులే
ఆ చల్లని కాపురమే చాలులే(2)


చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : దాశరథి
గానం : ఘంటసాల, పి.సుశీల
****************************************
oo....oo....
tolakari merupulaa tolivaana chinukulaa...
ee vela vachaavu yevarikosam...
inkevari kosam...
yememi techaavu ee bava kosam...

sannajaaji sogasundi junnulanti vayasundi
ninnu chuste karigipoye vennalanti manasundi
intaku minchi yemi leduraa baavaa
ee batuke inka neediraa baavaa
ee batuke inka neediraa..
sannajaaji sogasunte junnulanti vayasunte
nannu chuste karigipoye vennalanti manasunte
antaku minchi yemi vaddule pillaa
aa batuke yento muddule pilla
aa batuke yento umuddule

bangaaru nagalevi pettukonuraa
pattanchu cheeralevi kattukonuraa
gundelo molakette goruvechani valape(2)
pedavula bharinalo podigi unchinaanuraa
intaku minchi yemi leduraa baavaa
ee valape inka neediraa...
misamisalaade ne mene bangaaram
sigge kanchi pattu cheerakanna singaaram
ne pedavulu chilike teniya valape
pedavulu chilike teniya valape
muddula mutalo mudichi dachukundune
antaku minchi yemi vaddule pillaa
aa valape yento muddule...

ravvala medalante manasu leduraa
puvvula panupante moju leduraa.
pachani chelalo pairagaali jolalo..(2)
muchataina gudu katti vechaga undaamu raa
intaku minchi yemi vaddule baavaa
ee varamokkate chalule
ravvalu yenduku ne navvulu undagaa
puvulu yenduku ne pulakintalundagaa
veedani basale vaadani teevelugaa(2)
vennela gudu katti veyi janmalundaamu
antaku minchi yemi vaddule
aa challani kapurame chaalule(2)


Movie Name : Kaalam Maarindi (1972)
Music Director : Saluri Rajeswara rao
Lyricist : Dasarathi
Singers : Ghantasala, P.Susheela

No comments:

Post a Comment