మారలేదులే ఈ కాలం మారలేదులే ఈ లోకం(2)
దీనులకు ...హీనులకు
దీనులకు హీనులకు తీరలేదులే ఈ శోకం
అందరిలో ఉండేది ఒకే రక్తమైనా
అందరిని సృష్టించింది ఒకే దైవమైనా...(2)
కులం పేరుతొ మతం ముసుగులో
ప్రాణమున్న మనిషినే సమాధి చేసారు..
సమాధి చేసారు...
వారే నీ వారు అనాధలు అభాగ్యులు
వారే నీ బంధువులు బాధితులు పీడితులు
కంటి నీటితోనే...
కంటి నీటితోనే తమ కడుపులను నింపుకునే
అంటరానివారు ...వారే నీ వారు..
ఈ కోవెలలో ఇక నీకు చోటు లేదమ్మా
ఈ లోగిలిలో ఇక నిలువ నీడ లేదమ్మా
చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : దాశరథి
గానం :
************************************
maaraledule ee kaalam maaraledule ee lokam(2)
deenulaku...heenulaku
deenulaku heenulaku teeraledule ee shokam
andarilo undedi oke raktamainaa
andarini srustinchindi oke daivamainaa...(2)
kulam peruto matam musugulo
praanamunna manishine samaadhi chesaare..
samaadhi chesaare...
vare ne varu anadhalu abhagyulu
vare ne bandhuvulu badhitulu peeditulu
kanti neetitone...
kanti neetitone tama kadupulanu nimpukune
antaraanivaru...vaare nee varu..
ee kovelalo ika neku chotu ledammaa
ee logililo ika niluva needa ledammaa
Movie Name : Kaalam Maarindi (1972)
Music Director : Saluri Rajeswara rao
Lyricist : Dasarathi
Singers :

No comments:
Post a Comment