
ఇప్పుడంటే సినిమా తీయడానికి ఎన్నెన్నో సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. కానీ మనదేశంలో సినిమా ఆరంభమైన తొలినాళ్లలో సినిమా తీయడమంటే ప్రొజెక్టర్ ఆన్ చేసినంత సులభం కాదు. మన నేల మీద సినిమా విత్తనాన్ని నాటే కృషిలో భాగంగా తొలితరం దర్శకులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ మాటకొస్తే అప్పట్లో సినిమా తీయడం కోసం వారు పడ్డకష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఏ సినిమా కథకూ తీసిపోవు. ఈ ఎలిమెంట్సే కొంతమంది నవతరం దర్శకులను ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. ఆ ఆలోచనల్లోంచే భారతీయ సినిమాకి తొలి పాఠాలు నేర్పిన దర్శకుల జీవిత కథలే సినిమాలుగా తెరకెక్కాయి. అలా భారతీయ.. మలయాళ.. తెలుగు సినీ పితామహుల జీవనగాథలే ఇతివృత్తంగా వచ్చిన మూడు సినిమాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భారతీయ సినిమా వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ చారివూతక సందర్భంలో ఈ మూడు సినిమాల అవలోకనం చేయడమంటే ఆ ముగ్గురు పయోనీర్స్నీ, వారి కృషినీ మరొక్కసారి గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందడమే!
క్రీ.శ. 1913.. సరిగ్గా వందేళ్ల కిందట..
భారతదేశ జనాభా దాదాపు మూడుకోట్లు. అన్ని కోట్ల మందిలో సినిమా గురించి తెలిసిన వాళ్లుకాదు, అసలు సినిమాను చూసినవాళ్లే వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది. వాళ్లంతా తెర మీద ఏదో వింత, కదిలే చిత్రాల మాయలాగే చూశారు. కానీ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాల్లో పుట్టి పెరిగిన ఒకరిద్దరిని మాత్రం సినిమా విపరీతంగా ఆకట్టుకుంది, ఆలోచింపచేసింది. అబ్బుర పరిచింది. వారిలో అలజడి రేపింది. తాము సైతం సినిమాలను సృష్టించాలనే కోరికను పుట్టించింది. ముంబై, కేరళ, తెలుగు ప్రాంతంలో పుట్టిన ఆ ముగ్గురు వ్యక్తులు తమ సర్వశక్తులనూ, సర్వస్వాన్నీ త్యాగం చేసి అయినా సినిమాతీసి చూపించాలనే ప్రగాఢకాంక్షను బలంగా రగిలించింది. అప్పట్లో వారికే కాదు భారతీయుపూవరికీ కనీసం కెమెరా అంటే కూడా తెలియదు. సినిమా ఎలా తీస్తారో.. ఫిల్మ్ ఎక్కడ, ఎలా దొరుకుతుందో తెలీదు. అసలు సినిమా కళలో ఇప్పుడు మనం అనుకుంటున్న 24 క్రాఫ్ట్స్‌లో ఒక్క క్రాఫ్ట్ గురించి కూడా తెలియదు. టెక్నిక్కు అంతకన్నా తెలియదు. వారికి తెల్సిందల్లా ఒక్కటే.. సినిమా తీయాలని! భారతీయులకు భారతీయ సినిమా చూపించాలన్నదే వారి స్వప్నం. ఆ సంకల్పబలమే వెండితెరమీద తొలిసారిగా మనదైన కదిలే బొమ్మల అద్భుతాన్ని చూపించింది! ‘రాజా హరిశ్చంవూద’గా మరాఠీలో, ‘విగధకుమారన్’గా మలయాళంలో, ‘భీష్మవూపతిజ్ఞ’గా తెలుగులో బ్రిటీష్వారికి సవాలుగా మనదైన సినిమా ఆవిర్భవించింది. ఎవరి స్వప్నం, సంకల్పం, విజన్, మిషన్ వల్ల భారతీయ సినిమా మొగ్గ తొడిగిందో ఆ మహనీయుల జీవన గాథలనే ఇప్పుడు చలనచివూతాలుగా తెరకెక్కించింది. దాదా ఫాల్కే, జేసీ డానియల్, రఘుపతి వెంకయ్య కన్న వందేళ్ల స్పప్నానికి నీరాజనం పట్టింది.
హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ (మరాఠీ - 2009)
భారతీయ సినీ పితామహుడు ధొండీరాజ్ గోవింద్ ఫాల్కే జీవనగాథ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. 2009లో విడుదలైన ఈ సినిమాకు బాపు వాత్వే రాసిన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అనే గ్రంథం ఆధారం. ప్రఖ్యాత మరాఠీ రంగస్థల కళాకారుడు, దర్శకుడు, రచయిత, నటుడు అయిన పరేష్మొకాషీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ‘ఉత్తమ మరాఠీ’ చిత్రంగా పురస్కారాన్ని పొందడమే కాక ఆస్కార్ అవార్డుకు భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. మరాఠీ భాషా చిత్రాల్లో శ్వాస్ (2004) తర్వాత ఈ గౌరవాన్ని సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే 1913 నాటి కాలాన్ని, వాతావరణాన్ని తెరమీద పునరావిష్కరించిన ఈ బయోక్షిగాఫికల్ పీరియడ్ ఫిల్మ్‌లో దాదా ఫాల్కేగా నందుమాధవ్, సరస్వతి ఫాల్కేగా విభావరీ దేశ్‌పాండే అసమాన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా నిర్మాణం కోసం పరేష్ మొకాషీ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. 1913 దాదా ఫాల్కే తొలి సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, శతాబ్దం తర్వాత దాదా ఫాల్కే మీద తీసిన ఈ సినిమా కోసం పరేష్ కూడా అన్నే కష్టాలు పడ్డాడు. దాదా ఫాల్కే జీవిత చరిత్ర, తొలి సినిమా నిర్మాణ సన్నాహాల గురించిన వాస్తవాలు, చారివూతక ఆధారాల కోసం ఆయన పుణేలోని ‘నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్’లో దాదాపు రెండేళ్ల పాటు పరిశోధన చేశాడు. ఎన్నో ఊళ్లు తిరిగాడు. ఫాల్కే వారసులను కలుసుకున్నాడు. కథను తయారు చేసుకున్నాక ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్‌తో కలిసి 1913 కాలంనాటి ముంబై, మహారాష్ట్ర తాలూకు సెట్స్‌ను, భవనాలను రీక్రియేట్ చేశాడు. డబ్బులు సరిపోక ఒక దశలో ఆయన తన సొంత ఇంటిని కుదవపెట్టి మరీ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయం అయింది.
తెరపై కథేంటి?
‘హరిశ్చంవూదాచి ఫ్యాక్టరీ’ సినిమా.. దాదా ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాని తీసే క్రమంలో ఎదురైన సంఘటనల సమాహారమే! ఇది దాదా ఫాల్కే కుటుంబం, భార్య, పిల్లలు, మధ్య తరగతి జీవన విధానం నుంచి మొదలకొని ఆయనకు చలనచివూతాలపై మోజు పెరగడం, చివరకి సినిమా తీయడం వరకు జరిగే జర్నీని ఎంతో సహజంగా, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించే కాస్ట్యూమ్ - సెట్స్ - యాంబియెన్స్‌తో తెరకెక్కింది. మొదట్లో ఫాల్కే వీధుల్లో మ్యాజిక్‌లు చేసే మెజీషియన్‌గా ఉండడం, ఆ సమయంలో తన పేరుని ప్రొఫెసర్ ‘కెల్ఫా’ (ఫాల్కేలోని అక్షరాలను తిరగేసి అలా పెట్టుకున్నాడు) అని మార్చుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉండడం.. ఒకరోజు ‘పిక్చర్ ప్యాలెస్’ అనే గుడారంలోని సినిమా హాల్లోకి వెళ్లి సినిమా చూడడం.. తెరపై కదిలే బొమ్మలను చూసి ఆశ్చర్యపడి, ఆ తర్వాత వరుసగా అదే సినిమాని చూడడం... కదిలే బొమ్మలు ఎక్కడినుంచి వస్తున్నాయో తెల్సుకునే ఉత్సుకతతో ప్రొజెక్టర్ ఆపరేటర్ని కల్సుకొని వివరాలు తెల్సుకోవడం... బ్రిటీష్ లైబ్రరీలో ‘బయోస్కోప్’ పత్రికను చదివి సినిమా గురించిన మరిన్ని పుస్తకాలను కొనడం... రీళ్లు కొనడం.. రోజుల తరబడి గుడ్డి దీపపు వెలుగులో ఫిల్మ్ రీళ్లను చూస్తూ గడపడం.... దానికోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేయడం... నిరంతరం సినిమా తీసే ఫ్రేమింగ్‌ని ఊహించుకుంటూ పరధ్యానంగా గడపడం.. చివరకి పుణేలోని మెంటల్ హాస్పిటల్లో చేరడం... బయటకు వచ్చాక భార్యను ఒప్పించి తన ఇన్సూన్స్ పాలసీలను కుదువపెటి,్ట పదివేల రూపాయలు తీసుకుని లండన్ వెళ్లడం... అక్కడ అతి కష్టంమీద ఓ సినిమాకి అసిస్టెంట్‌గా పని సంపాదించడం, కెమెరాను, నెగెటివ్‌లను ప్రాసెస్ చేసే కెమికల్స్‌ని కొని ఇండియాకు తిరిగిరావడం.. కథను సిద్ధం చేసుకొని నటీనటుల ఎంపికకోసం నానాతిప్పలు పడడం... చంద్రమతి పాత్రంలో స్త్రీ నటికోసం వేశ్యవాటికల వెంట తిరగడం, ఆఖరుకు మగనటుడు సాటింకే చేతే స్త్రీ పాత్ర వేయించడం.. కథలో చంద్రమతి మెడ నరికే సీన్ చిత్రీకరిస్తుంటే అదేదో హత్యాయత్నంగా భావించి స్థానిక పోలీసులు మొత్తం టీమ్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోపెట్టడం.. తీరా సినిమా ఎడిటింగ్‌ని పూర్తి చేసి కరొనేషన్ థియేటర్లో రిలీజ్‌చేస్తే పదిరోజుల వరకూ ప్రేక్షకుపూవరూ రాకపోవడం... ఆ తర్వాత ‘మౌత్‌టాక్’తో జనాలు తండోపతండాలుగా రావడం... దాదా ఫాల్కే కన్న స్వప్నం.. సంకల్పం సత్ఫలితాన్నివ్వడం.. ఈ సినిమా కథ!ఇక ఈ సినిమా టైటిల్‌గా ‘హరిశ్చంవూదాచి ఫ్యాక్టరీ’ అని పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన వాస్తవం ఉంది. అప్పట్లో ఈ సినిమాలో నటించడానికి, పనిచేయడానికి ఒప్పుకున్న నటులు, వ్యక్తులు ఎవరైనా మీరేం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలి?అని దాదా ఫాల్కేని అడిగారట. అప్పుడు ఫాల్కే తీస్తున్న సినిమా హరిశ్చంద్ర కనుక ‘హరిశ్చంద్ర ఫ్యాక్టరీ’లో పనిచేస్తున్నామని చెప్పండి అని అన్నాడట. ఈ గాథ ఆధారంగా పరేష్ మొకాషీ ఈ సినిమాకి ఆ టైటిల్‌ని పెట్టాడు.
సెల్యులాయిడ్ (2012 మలయాళం)
మలయాళ సినీ పితామహుడు జేసీ డానియల్ జీవనగాథ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. ప్రముఖ మలయాళ సినీ చరివూతకారుడు చెలంగట్ గోపాలకృష్ణన్ రాసిన ‘లైఫ్ ఆఫ్ జేసీ డానియల్’ అనే గ్రంథం, ప్రముఖ రచయిత వినూ అబ్రహామ్ రాసిన ‘నష్ట నాయక’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఆ లెక్కన ఈ సినిమా బయోపిక్‌గానే కాక నవలాచివూతంగా, పీరియడ్ ఫిల్మ్‌గా కూడా ప్రత్యేకతను సాధించింది. డానియల్గా హీరో పృథ్విరాజ్, ఆయన భార్య జానెట్గా మమతామోహన్‌దాస్, రోజీగా చాందినీ జీవించిన ఈ సినిమాకి వేణు అందించిన సినిమాటోక్షిగఫీ ప్లస్ అయింది. ఈ సినిమాను చూస్తుంటే మన తెలుగు సినిమాలు (యమదొంగ, కేడీ వంటివి)లో నటించిన మమతామోహన్‌దాస్ ఈమె ఒకరేనా అనే అనుమానం వేస్తుంది. అదేం చిత్రమో, అద్భుతమైన నటీమణులను కూడా తెలుగులోకి తెచ్చి వాళ్ల చేత నటన తప్ప మిగతావన్నీ చేయించే ఘనత తెలుగు సినిమాలకే ఉందనే బాధ కలుగుతుంది కూడా!‘సెల్యులాయిడ్’ సినిమా జాతీయ అవార్డులలో ఉత్తమ మలయాళ చిత్రంగానే కాక, కేరళరాష్ట్ర ప్రభుత్వ అవార్డులలో ఏడింటిని గెల్చుకుంది. రూ.3.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ స్వప్నాన్ని సాకారం చేసిన దర్శకుడుగా కమల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో ప్రశంసలను పొందాడు. కమాలుద్దీన్ మహ్మద్ మజీద్ అనే పూర్తి పేరును కమల్‌గా మార్చుకున్న ఈ దర్శకుడికి సినీరంగంలో 32 ఏళ్ల అనుభవం ఉంది. 1981లో ‘త్రాసమ్’ సినిమాకి కథారచయితగా మొదలైన ఆయన ప్రస్థానం 1986లో దర్శకుడిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత కమల్ దర్శకత్వంలో 43కు పైగా సినిమాలు వచ్చాయి. పెరుమళక్కలమ్ (2004), కమత్త పళ్లికల్ (2006) వంటి సినిమాలకు జాతీయ ఉత్తమచిత్రం అవార్డులను సైతం సాధించిన కమల్ మలయాళ చిత్ర పరిక్షిశమలో క్రిటికల్ సక్సెస్‌ను, కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన అతి కొద్దిమంది దర్శకులలో ఒకడిగా పేరు సంపాదించాడు. ఈ సినిమాతో కమల్ ‘డానియల్’ జీవనగాథకు సమాంతరంగానే మలయాళ సినిమాల తొలికథనాయిక పీకే రోజీ జీవితాన్ని కూడా ఆవిష్కరించి, తొలి మలయాళ సినిమా ‘విగధకుమరన్’ చిత్రీకరించిన కాలపు ఎన్నెన్నో వాస్తవాలను, విశేషాలను, హృదయానికి హత్తుకునే సీన్లతో చూపించాడు. సినీరంగ నేపథ్యంగా మనిషి ఉత్థాన పతనాలను సామాజిక కోణంలోంచి తెరకెక్కించిన తీరు హ్యాట్సాఫ్ అనిపిస్తాయి.
తెరపై కథేంటి?
‘సెల్యులాయిడ్’ సినిమా ప్రధానంగా జేసీ డానియల్ (జోసెఫ్ చెల్లయ్య డానియల్ నాడార్ అతని పూర్తిపేరు) జీవన గాథ. డానియల్ జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరించిన సినిమా ఇది. ట్రావెంకోర్వూపాంతంలోని లాటిన్ క్రిస్టియన్ నాడార్ కుటుంబంలో 1900 సంవత్సరంలో జన్మించాడు డానియల్. చిన్నప్పట్నించే కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌ను ఇష్టపడే డానియల్ తను స్వయంగా ‘చెలంబాటమ్’ అనే మార్షల్ కళలో నిపుణుడు కూడా. ‘ఇండియన్ ఆర్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అండ్ స్వోర్డ్ ప్లే’ అనే పుస్తకాన్ని ఈ యుద్ధకళపై రాసిన డానియల్ ఈ కళని సినిమా ద్వారా పాపులర్ చేయాలనుకునే ఆలోచనలోంచే సినిమాపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. దానికోసం డానియల్ చెన్నై వెళ్లి అక్కడి స్టూడియోలలో కనీసం ప్రవేశం కూడా దొరకక వెనుదిరగడం, చివరికి ముంబై వెళ్లి అక్కడి ఫిల్మ్ స్టూడియోల్లో ‘కేరళ టీచర్’గా ఎంట్రీ ఇచ్చుకుని, సినిమా మేకింగ్, షూటింగ్‌కి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడం... ఆ క్రమంలోనే భారతీయ సినీ పితామహుడు దాదా ఫాల్కేని కల్సుకోవడం, కేరళకు తిరిగొచ్చి ‘ట్రా నేషనల్ పిక్చర్స్’ పేరిట స్టూడియోను నెలకొల్పి సినిమాని మొదపూట్టాడు. దానికోసం తీసుకున్న భూమినంతా అమ్మేసి రూ.4లక్షలను పెట్టుబడిగా పెట్టడం.. ‘విగధకుమరన్’ పేరిట కథను తనే స్వయంగా రాసుకుని అందులో తానే నటించడం, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్ కూడా తానే చేసుకోవడం.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ మహిళా కూలీని రోజూవారి వేతనానికి కుదుర్చుకోవడం.. తీరా సినిమా పూర్తిచేసి క్యాపిటల్ థియేటర్లో ప్రదర్శించేసరికి హీరోయిన్ పాత్ర విషయమై కొన్ని సామాజిక వర్గాల ప్రజలు నిరసనలు తెలియజేసి, థియేటర్‌పై దాడులు చేయడం... చివరికి నష్టాలపాలై జీవిత చరమాంకంలో దుర్భర పేదరికంతో మరణించడం... ఈ సినిమా కథ!
చిత్రీకరణ విశేషాలు...
ఈ సెల్యులాయిడ్ సినిమా పేరుకు తగినట్లే ఓ సెల్యులాయిడ్ హ్యుమన్ డాక్యుమెంట్ అని చెప్పాలి. 1920 కాలంనాటి పీరియడ్ లుక్‌ని, వస్త్రాలు, సెట్టింగ్స్, ఆఖరికి ఆనాటి గుర్రపు బగ్గీలను సైతం ‘రీక్షికియేట్’ చేయడమేకాక కొన్ని పోర్షన్లను బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ఇక ‘ఎనుందోడి’ అనే పాటలో సినీతారగా అవకాశం వచ్చినప్పటి సందర్భంలో రోజీ పాత్రధారి, పగిలిన అద్దంముక్కలో తన ముఖాన్ని చూసుకుంటూ పరవశించే తన్మయత్వం ఎంతో సహజంగా అనిపిస్తుంది. అలాగే ‘క బ్యాక్‌క్షిగౌండ్ సాంగ్‌లో డానియల్ ట్రావెంకోర్ ఫిల్మ్కంపెనీ స్థాపన, సినిమా షూటింగ్ ఆరంభం, ‘యాక్షన్’ అని చెప్పే మాంటేజ్ సీన్లతో కూడి తొలిసినిమా ఫ్లేవర్‌ను అందిస్తుంది. ఇక సినిమా తొలి ప్రదర్శన సందర్భంలో చిత్ర నాయిక రోజీ నిమ్నజాతి స్త్రీ అనే సాకుతో, సినిమాకు వచ్చిన ప్రేక్షకులు అందరూ తెరపైకి రాళ్లువేయడం... ఆ తర్వాత రోజీ ఉండే గుడిసెకి నిప్పంటించడం, ఆ నిప్పుల కీలల్లోంచి.. దుఃఖంతో, భయవిహ్వలత్వంతో రోజీ పారిపోయే సీన్ మన కళ్లని చెమరుస్తాయి. సినిమా కల పరుగెత్తిన డానియల్ జీవితం, ‘విగధకుమరన్’ సినిమాషూటింగ్, రోజీ (రోషియమ్మ అసలు పేరు)జీవితం అనే ట్రయాంగిల్‌తో నడిచే ఈ సెల్యులాయిడ్.. సామాజిక నియంవూతణలు, కులపరమైన వైషమ్యాల ఉక్కుపాదాల కింద బద్ధలైపోయిన స్వప్నాన్ని, ఏ గుర్తింపునకూ నోచుకోక వివక్షకు గురైన మానస సంకల్పాన్ని తెరకెక్కించిన ఈ సినిమా సామాజిక, మానవీయ అంశాపూన్నింటినో సున్నితంగా, ఆలోచనాస్ఫోరకంగా లేవనెత్తి సినిమాకుండే ప్రయోజనాన్ని సాధించింది.
రఘుపతి వెంకయ్య (2012 - తెలుగు)
తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య జీవన చిత్రమే ఈ సినిమా. రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా పూర్తి చారిత్రక పరిశోధన, సహజ సన్నివేశాల చిత్రణతో తెరకెక్కించిన ఓ నిజాయితీ ప్రయత్నం ఈ సినిమా. ప్రస్తుత తెలుగు సినిమాలు అనగానే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అనే ముద్ర ఉంది. ఆ ముద్రలోంచి బయటపడి జాతీయ ప్రమాణాలతో పీరియడ్ బయోపిక్ సినిమాగా తీశారు దీన్ని. రఘుపతి వెంకయ్యగా సీనియర్ నటుడు నరేష్, ఆయన భార్యగా వాహిని నటించిన ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ మొదలు ఇంటి లోగిళ్లు, కెమెరాలు, పరిసరాల వరకు అన్నీ 1920 కాలంనాటి వాస్తుశిల్పం, సంప్రదాయం కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా, ఆర్ట్ డైరెక్టర్స్ రాము, సతీష్‌ల నేతృత్వంలో వేసిన సెట్స్.. ఆ కాలంనాటి మచిలీ పట్నం, అప్పటి ఇళ్ల శైలిని తెరపై పునర్ సృష్టించాడు. కిషన్‌సాగర్ సినిమాటోగ్రఫీ, రాజ్ అందించిన మ్యూజిక్ పీరియడ్ యాంబియెన్స్‌ను బాగా ఆవిష్కరించాయి. ఇక తెలుగు సినిమాకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్యపై సినిమా తీయాలనే స్వప్నం, దానికి తగిన సంకల్పంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి ముందుకెళ్లిన దర్శకుడు బాబ్జీ! ప్రఖ్యాత ప్రజా నాట్యమండలి సంస్థ నుంచి వచ్చిన నిబద్ధత ఉన్న కళాకారుడు ఈయన. ఈ సినిమాని తన ‘పీపుల్స్ థియేటర్’ పతాకంపై నిర్మించి జాతీయ స్థాయిలో తొలి సినీ స్రష్టల బయోపిక్ సినిమాల సరసన రఘుపతి వెంకయ్య గాథను నిలిపాడు.
తెరపై కథేంటి?
రఘుపతి వెంకయ్య సినిమాని స్క్రీన్ ప్లేపరంగానూ, సన్నివేశాల పరంగానూ ఎంతో నవ్యతతో అల్లుకొన్నాడు. రఘుపతి వెంకయ్య వృద్ధాప్యంలోని దశతో ఓపెన్ అయ్యే సినిమా. వెంకయ్య తన ప్రాభవాన్ని, ఆస్తులను అన్నీ పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో పేదరికంలో మగ్గుతూ, ఒంటరిగా ఉండి తన ఆత్మకథను రాయడం మొదపూట్టడంతో సినిమా ఆరంభం అవుతుంది. అయితే రఘుపతి వెంకయ్య గురించి, ఆయన భార్య, కుటుంబం గురించి పెద్దగా వివరాలేవీ లభించనందువల్ల ఈ సినిమాకుగాను దర్శకుడు కొంత క్రియేటివ్ లిబర్టీని తీసుకుని సన్నివేశాలను అల్లుకున్నాడు. అయితే అవేవీ ఆనాటి కాలమాన, సామాజిక పరిస్థితులను అతిక్షికమించకుండా సహజంగా ఉండేలా చూసుకోవడంలో జాగ్రత్త వహించాడు. అలా ఫ్యాక్ట్నీ, ఫిక్షన్నీ కలగలిపి సాధ్యమైనంత వాస్తవికతతో తెరకెక్కించాడు. ఈ సినిమాలో రఘుపతి వెంకయ్య జీవన ఘట్టాలలో ఆయనను దేశభక్తి ప్రేరేపితుడిగా ఆనాటి సంఘసంస్కర్తగా, తన సోదరుడు అయిన ‘రఘుపతి వెంకటరత్నం నాయుడు’ ప్రభావం ఉన్న యువకుడిగా బ్రిటీష్‌వారి సాంస్కృతిక, సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా భారతీయులు సైతం సినిమా తీసి నిరూపించగలరు అనే భావనను నిజం చేసిన జాతీయవాదిగా ఆవిష్కరించాడు. అలాగే తన కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్‌ని సినిమాల్లో శిక్షణ కోసం విదేశాలకు పంపించే క్రమంలో వచ్చే సీన్లు, విదేశాల నుంచి తిరిగి వచ్చి కొడుకు సినిమా తీస్తున్నప్పుడు కరెంట్ పోయి షూటింగ్‌కు అంతరాయం కలిగినప్పుడు.. రఘుపతి వెంకయ్య ఆ షూటింగ్ స్పాట్లో మేకప్ రూమ్‌లోని నిలువుటద్దాలను సూర్యకిరణాలతో పరివర్తనం చెందించి కావలసిన లైట్ ఎఫెక్ట్‌ని సృష్టించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.
కొసమెరుపు :
భారతీయ, మలయాళ, తెలుగు సినీపితామహులైన దాదాఫాల్కే, డానియల్, వెంకయ్య ముగ్గురూ అవసాన దశలో సమకాలీన సమాజంలో కనీస గుర్తింపు కూడా నోచుకోలేకపోయారు. స్వప్నాన్ని, సంకల్పాన్ని మాత్రమే మదినిండా నింపుకొని సినీరంగంలో తొలిబాటలు వేసిన మార్గదర్శకులు వీరు. జయహో భారతీయ సినిమా!
No comments:
Post a Comment