వందేళ్ల భారతీయ సినిమాలో చరిత్రలో నిలిచిన షోలే చిత్రంతోపాటు నాటి బిమల్ రాయ్, గురుదత్, శ్యామ్ బెనెగల్, ఆదూర్ గోపాలకృష్ణన్.. నేటి అనురాగ్ కశ్యప్, దివాకర్ బెనర్జీ, జోయా ఆఖ్తర్, కరణ్ జోహార్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. అనురాగ్ కశ్యప్ 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, ఒనీర్ చిత్రం మై బ్రదర్ నిఖిల్, పంజాబీ డైరెక్టర్ గురువిందర్ సింగ్ చిత్రం 'అనే గోరే ద దాన్', నందితాదాస్ దర్శకత్వం వహించిన 'ఫిరాఖ్' చిత్రాలను కూడా ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఇంకా బల్ రాజ్ సహాని, దేవ్ ఆనంద్, షమ్మి కపూర్, రాజేశ్ ఖన్నా నటించిన చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రమేశ్ సిప్పి, విశాల్ భరద్వాజ్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, నాగార్జునలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. తన 25 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని.. వందేళ్ల సినిమాలో తాను భాగస్వామినవ్వడం చాలా గొప్పగా ఉందని నాగార్జున అన్నారు. భారతీయ సినిమాలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య హద్దులు చెరిగిపోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకులు సిప్పీ, భరద్వాజ్, కునాల్ కోహ్లీ, జానూ బారువా, ఏక్తా కపూర్, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాలతో కూడాని ప్యానెల్ వందేళ్ల సినిమాపై చర్చించనున్నారు. ఏప్రిల్ 30 తేదిన దాదా సాహెబ్ ఫాల్కే పై అమిర్ రాజా హుస్సేన్ రూపొందించిన ఓ ప్రత్యేక ప్రదర్శనతో చిత్రోత్సవం ముగుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా సాధించిన విజయాల ద్వారా లభించిన గుర్తింపు రానున్న రోజుల్లో రెట్టింపవుతుందని పలువురు వ్యాఖ్యానించారు. |
Friday, April 26, 2013
'వందేళ్ల భారతీయ సినిమా'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment